S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/15/2018 - 23:56

ఘ్ఘ్ఘపయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 15: పెయిర్స్ స్కేటింగ్‌లో గురువారం సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. అలొనా సచెన్కో, బ్రూనో మాసట్ జోడీ 235.90 పాయింట్లు సంపాదించి, గతంలో తాము నెలకొల్పిన రికార్డును తామే బద్దలు చేశారు. జర్మనీకి చెందిన ఈ ఫిగర్ స్కేటర్లు ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా జాగ్రత్త పడుతూ, చైనాకు చెందిన సుయ్ వెన్‌జింగ్, హాన్ కాంగ్ జోడీని నుంచి ఎదురైన పోటీని తట్టుకున్నారు.

02/15/2018 - 06:21

పోర్ట్ ఎలిజబెత్, ఫిబ్రవరి 14: తమ జట్టులో కొన్ని మార్పులతో ఆరో వనే్డలో బరిలోకి దిగుతామని, అయితే, తమ లక్ష్యం మాత్రం విజయం సాధించడంపైనే ఉంటుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆరు వనే్డల సిరీస్‌లో ఇప్పటికే 4-1 తేడాతో మంచి ఊపుమీదనున్న భారత్ శుక్రవారం జరిగే ఆఖరి మ్యాచ్‌పై దృష్టి సారించింది.

02/15/2018 - 06:19

గాంగ్‌న్యుంగ్, ఫిబ్రవరి 14: ఉత్తర కొరియా స్కేటర్లు రియామ్ తయే ఒక్, కిమ్ జూ సిక్ పట్టుదలకు మారుపేరన్న ముద్ర వేయించుకున్నారు. నిజానికి ఉత్తర కొరియా నుంచి వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన 22 మంది బృందంలో ఎవరికీ ఒలింపిక్స్ స్థాయి ఈవెంట్స్‌లో పోటీపడే స్థాయి లేదు. కనీస అర్హతా ప్రమాణాలు కూడా వారికి లేవు. 20 మందికి తమతమ విభాగాల్లో మెయిన్ డ్రా చేరడం అసాధ్యమని ఉత్తర కొరియా అధికారులే ఉంటున్నారు.

02/15/2018 - 06:19

విజయవాడ, ఫిబ్రవరి 14: వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బుధవారం భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మర్యాద పూర్వకంగా కలిశాడు. క్రీడలకు, క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సహంపై సీఎంను అభినందించాడు. గతంలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా అకాడమీలు ఏర్పాటయ్యేలా సీఎం కృషి చేశారని గుర్తు చేశాడు.

02/15/2018 - 06:18

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 14: నాలుగేళ్ల క్రితం దారుణంగా విఫలమై, ఇంటా బయటా విమర్శలకు గురైన అమెరికా స్నోబోర్డ్ లెజెండ్ షాన్ వైట్ పయాంగ్‌చాంగ్‌లో గెలిచాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నాలుగేళ్లుగా బాధను అనుభవించిన అతను ఈసారి వింటర్ ఒలింపిక్స్ స్నోబోర్డ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. స్వర్ణ పతకాన్ని స్వీకరించిన తర్వాత ఉద్వేగాన్ని ఆపుకోలేక బిగ్గరగా రోదించాడు.

02/15/2018 - 06:17

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 14: భారత్ చేతిలో ఆరు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఐదో వనే్డ ముగిసే సమయానికే 1-4 తేడాతో కోల్పోవడం దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్‌ను నిరాశకు గురి చేసింది. మొదటి మూడు వనే్డల్లో పరాజయాలను చవిచూడడంతో, దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడికి గురైందనేది వాస్తవం.

02/15/2018 - 06:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో మొదలుకానుంది. ఈ టోర్నమెంట్ ప్రసార హక్కులను పొందిన స్టార్ ఇండియా సూచన మేరకు మ్యాచ్‌ల సమయాలను మారుస్తున్నట్టు వచ్చిన వార్తలకు ఐపీఎల్ కమిటీ తెరదించింది.

02/14/2018 - 01:22

పోర్ట్ ఎలిజబెత్, ఫిబ్రవరి 13: దక్షిణాఫ్రికాతో ఆరు వనే్డల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి పోర్ట్ ఎలిజబెత్‌లోని సెంట్ జార్జ్ పార్క్ క్రీడా మైదానంలో జరిగిన ఐదో వనే్డలో భారత్ 73 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది.

02/14/2018 - 00:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఇటీవల ప్రారంభమైన ఫెడ్ కప్‌లో భారత్‌కు చెందిన క్రీడాకారిణి అంకిత రైనా ఆటతీరు బాగా ఉందని, దీని తర్వాత జరిగే పోటీలో మరింత కలిసివచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. గత వారం జరిగిన ఆసియా/ఆసియానియా గ్రూప్-1లో భారత్ 2-0తో చైనాపై విజయం సాధించింది. ‘ఫెడ్ కప్‌లో భారత్ క్రీడాకారులు ఎప్పుడూ ఒంటిచేత్తో తిరిగి వస్తున్నారు.

02/14/2018 - 00:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారతదేశానికి బంగారు పతకం అందించిన ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాకర్ల కేవలం అతని అకౌంట్‌ను హ్యాక్ చేయడంతోనే సరిపెట్టుకోకుండా కొన్ని ట్వీట్లు చేయడం గమనార్హం. అందులో ఒకటి ‘ఆపరేషన్ ఇన్ ఆఫ్రిన్, ఐ సపోర్టు టర్కీ’ అని పేర్కొన్నారు. అభినవ్ బింద్రా అకౌంట్ హ్యాక్ కావడంతో తాత్కాలికంగా దానిని నిలుపుదల చేశారు.

Pages