S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/03/2017 - 01:12

కకామిగహరా (జపాన్), నవంబర్ 2: డ్రాగ్ ఫ్లికర్ గుర్జిత్ కౌర్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో, ఇక్కడ జరుగుతున్న ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఎలాంటి కష్టం లేకుండా సెమీ ఫైనల్స్ చేరింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న ఈ జట్టు గురువారం జరిగిన క్వార్టర్ పైనల్‌లో కజకస్తాన్‌ను 7-1 గోల్స్ తేడాతో చిత్తుచేసింది.

11/03/2017 - 01:10

బులవాయో, నవంబర్ 2: వెస్టిండీస్ చేతిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, క్లీన్‌స్వీప్ పరాభవం నుంచి జింబాబ్వే తృటిలో తప్పించుకుంది. మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి గ్రేమ్ క్రెమర్ (28 నాటౌట్)తో కలిసి క్రీజ్‌లో ఉన్న రెగిన్ చకాబ్వా (71 నాటౌట్) జింబాబ్వేను ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని వెస్టిండీస్ గెల్చుకోగా, 0-1 తేడాతో వెనుకబడిన జింబాబ్వే రెండో టెస్టులోనూ రాణించలేకపోయింది.

11/03/2017 - 01:10

జొహానె్నస్‌బర్గ్, నవంబర్ 2: రెండు కాళ్లూ లేకపోయినా, కృత్రిమ కాళ్లతోనే పరుగులు తీస్తూ, ప్రపంచ మేటి అథ్లెట్‌గా ఎదిగిన ఆస్కార్ పిస్టోరియస్‌కు ‘హత్య కేసు’లో విధించిన ఆరేళ్ల జైలు శిక్ష చాలా చిన్నదని, ఆ శిక్షను పెంచాలని ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తున్నది. శుక్రవారం ఈ ప్రత్యేక అప్పీల్‌పై బ్లూంఫొంటైన్ అప్పీల్ కోర్టు ఒక రోజు విచారణ జరుపుతుంది. తీర్పును వెంటనే లేదా తర్వాత ప్రకటించవచ్చు.

11/03/2017 - 01:08

జెనీవా, నవంబర్ 2: రష్యా అథ్లెట్లపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతునే ఉంది. వ్యూహాత్మక డోపింగ్‌కు రష్యా ప్రభుత్వమే ప్రోత్సహించిందన్న వామర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గతంలో ఒలింపిక్ పతకాలు సాధించిన ఎంతో మంది రష్యా అథ్లెట్లు తాజాగా డోపింగ్ పరీక్షలో పట్టుబడుతూ, సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్నారు. ఆ జాబితాలో మరో అథ్లెట్ చేరాడు.

11/03/2017 - 01:07

హో చి మిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 2: భారత సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ ఇక్కడ జరుగుతున్న ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో క్వార్టర్ పైనల్స్ చేరింది. 48 కిలోల విభాగంలో పోటీపడుతున్న 34 ఏళ్ల కోమ్ తన తొలి రౌండ్ ఫైట్‌లో స్థానిక ఫేవరిట్ డియెమ్ తి ట్రిన్‌ను పాయింట్ల ప్రాతిపదికపై ఓడించింది. తర్వాతి రౌండ్‌లో ఆమె చైనీస్ తైపీకి చెందిన మెంగ్ చియెన్ పింగ్‌ను ఢీ కొంటుంది.

11/03/2017 - 01:07

లండన్, నవంబర్ 2: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో పటిష్టమైన రియల్ మాడ్రిడ్‌కు టోటెన్హామ్ జట్టు షాకిచ్చింది. 3-1 తేడాతో విజయం సాధించి, ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ 27వ నిమిషంలో తొలి గోల్ అందించిన డేల్ అల్ 56వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. 65వ నిమిషంలో క్రిస్టియన్ ఎరిక్‌సన్ మరో గోల్ చేసి, టొటెన్హామ్ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు.

11/02/2017 - 00:36

భారత హాకీ క్రీడాకారుడు యువరాజ్ వాల్మీకి, అతని సోదరుడు దేవీందర్ వాల్మీకి
ముంబయి హాకీ సంఘం (ఎంహెచ్‌ఎ)లో ప్రారంభించిన హాకీ క్లినిక్‌కు హాజరై,
యువ క్రీడాకారులకు సూచనలిస్తున్న జర్మనీ కోచ్ ఫబియాన్ రొజ్వాడొవ్‌స్కీ

11/02/2017 - 01:43

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వరుసగా 11 టి-20 ఇంటర్నేషనల్స్‌లో మొదటి వికెట్‌కు కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించడం ద్వారా వారు మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇద్దరూ అర్ధ శతకాలు సాధించి, టీమిండియా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు.

11/02/2017 - 00:30

న్యూఢిల్లీ, నవంబర్ 1: టీమిండియాకు విశిష్ట సేవలు అందించిన పేసర్.. అందునా స్థానికుడు.. హోం గ్రౌండ్ ఫిరోజ్ షా కోట్లాలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌తో తన కెరీర్‌ను ముగించిన ఆశిష్ నెహ్రాకు వేలాది మంది ప్రేక్షకులు హర్షధ్వానాలతో ఘనంగా వీడ్కోలు పలికారు.

11/02/2017 - 00:28

న్యూఢిల్లీ: గుంటూరుకు చెందిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పేరును పద్మశ్రీ అవార్డుకు పరిశీలించాల్సిందిగా కేంద్ర క్రీడాశాఖ మాజీ మంత్రి విజయ్ గోయల్ కోరారు. అతని పేరును ప్రతిపాదిస్తున్నానని, కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 15.

Pages