S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/06/2017 - 03:07

రాజ్‌కోట్ నవంబర్ 5: భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ 29వ జన్మదిన వేడుకలను క్రీడాభిమానులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సహచర ఆటగాళ్లు కోహ్లీని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పగా, భారత్ సహా అనేక దేశాల్లో ఆయన అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు.

11/06/2017 - 00:57

డమ్మమ్, నవంబర్ 5: ఎఎఫ్‌సి అండర్-19 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు ఆదిలోనే చతికిలబడింది. శనివారం ఇక్కడ జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య సౌదీ అరేబియా జట్టు 5-0 గోల్స్ తేడాతో భారత జట్టును మట్టికరిపించింది.

11/06/2017 - 00:57

న్యూఢిల్లీ, నవంబర్ 5: చైనాలో జరుగుతున్న షెన్‌జెన్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన విష్ణు వర్ధన్, ఎన్.శ్రీరామ్ బాలాజీ టైటిల్ సాధించారు. ‘జెయింట్ కిల్లర్స్’గా పేరు పొందిన వీరు పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో 7-6(3), 7-6(3) సెట్ల తేడాతో నాలుగో సీడ్ జోడీగా బరిలోకి దిగిన అమెరికన్లు ఆస్టిన్ క్రాజిసెక్, జాక్సన్ విత్రోపై విజయం సాధించి సత్తా చాటుకున్నారు.

11/06/2017 - 00:56

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), నవంబర్ 5: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మరో రెండు పతకాలను కైవసం చేసుకుంది. ఆదివారం ఆరో రోజు ఇక్కడ జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్తోల్ ఈవెంట్‌లో భారత్‌కు అనీష్ భన్వాలే రజత పతకాన్ని అందించగా, ఇదే ఈవెంట్‌లో నీరజ్ కుమార్ కాంస్య పతకాన్ని అందించాడు.

11/06/2017 - 00:56

హోచిమిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 5: వియత్నాంలో జరుగుతున్న ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు ఖాయమయ్యాయి. 64 కిలోల విభాగంలో స్టార్ బాక్సర్ ఎల్.సరితా దేవితో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత సోనియా లాథర్ (57 కిలోల కేటగిరీ), లవ్లినా బొర్గోహైన్ (69 కిలోల కేటగిరీ) సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లి భారత్‌కు ఈ పతకాలను ఖాయం చేశారు.

11/05/2017 - 04:49

రాజ్‌కోట్, నవంబర్ 5: టీమిండియా చేతిలో తొలిసారి ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో ఓటమిపాలైన న్యూజిలాండ్ అందరూ అనుకున్నట్లే ‘దెబ్బతిన్న పులి’లా విజృంభించింది. మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా శనివారం ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సిఎ) స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించి న్యూఢిల్లీలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సిరీస్‌ను సమం చేసింది.

11/05/2017 - 00:50

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సి) హార్దిక్ పాండ్య (బి) యుజ్వేంద్ర చాహాల్ 45, కొలిన్ మున్రో నాటౌట్ 109, కేన్ విలియమ్‌సన్ (సి) రోహిత్ శర్మ (బి) మహమ్మద్ సిరాజ్ 12, టామ్ బ్రూస్ నాటౌట్ 18, ఎక్స్‌ట్రాలు: (లెగ్ బైస్ 2, వైడ్స్ 10) 12, మొత్తం: 20 ఓవర్లలో 196/2. వికెట్ల పతనం: 1-105, 2-140.

11/05/2017 - 00:49

బ్రిస్బేన్, నవంబర్ 4: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్ అంజుమ్ వౌద్గిల్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో ఆమె కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ ఈవెంట్‌లో ఆమె మొత్తం 616.7 పాయింట్లు సాధించి తృతీయ స్థానంలో నిలవడమే ఇందుకు కారణం.

11/05/2017 - 00:53

హోచిమిన్ సిటీ (వియత్నాం), నవంబర్ 4: వియత్నాంలో జరుగుతున్న ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ బాక్సర్, రాజ్యసభ సభ్యురాలు మేరీ కోమ్‌కు ఆరో పతకం ఖాయమైంది.

11/05/2017 - 00:46

బెంగళూరు, నవంబర్ 4: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపణలు చేసే బదులు అందుకు తగిన ఆధారాలను బహిర్గతం చేయాలని మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిందితుడైన శ్రీశాంత్‌కు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సలహా ఇచ్చాడు. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న శ్రీశాంత్ బిసిసిఐపై మాటల దాడి చేస్తున్న నేపథ్యంలో కపిల్ స్పందించాడు.

Pages