S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/28/2017 - 01:52

న్యూయార్క్, జూన్ 27: మహిళా టెన్నిస్‌లో 23 గ్రాండ్‌శ్లామ్ సింగిల్స్ టైటిళ్లతో తనకు ఎదురు లేదని చాటి చెప్పిన సెరేనా విలియమ్స్ తనకు పురుషుల టెన్నిస్ సర్క్యూట్‌లో 700వ ర్యాంక్ ఇచ్చిన మెకన్రోపై తనదైన రీతిలో ఎదురుదాడి చేసింది.

06/28/2017 - 01:51

న్యూఢిల్లీ, జూన్ 27: నేపాల్ రాజధాని ఖాడ్మండూలో జరిగిన వరల్డ్ గేమ్స్‌లో భారత త్రోబాల్ జట్లు చరిత్ర సృష్టించాయి. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన ఈ గేమ్స్‌లో భారత పురుష, మహిళా జట్లు పసిడి పతకాలను కైవసం చేసుకున్నాయి.

06/27/2017 - 00:43

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 26: వెస్టిండీస్‌తో ఈనెల 30న అంటిగువాలో జరిగే మూడో వనే్డ ఇంటర్నేషనల్‌లో యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు చోటు దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరోక్షంగా వెల్లడించాడు. విండీస్‌తో జరిగిన రెండో వనే్డను 105 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న భారత్ ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

06/27/2017 - 00:41

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పర్యాయాలు 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు వనే్డలో ఐదు వికెట్లకు 310 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది.

06/27/2017 - 00:41

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: విలక్షణమైన ‘చైనామన్’ బౌలింగ్‌తో 22 ఏళ్ల భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో అతను అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. అందులో నాలుగు వికెట్లు కూల్చాడు. వెస్టిండీస్ టూర్‌కు ఎంపికై, మొదటి వనే్డలో ఆడాడు. అయితే, భారత్ ఇన్నింగ్స్ పూర్తి కాకముందే భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.

06/27/2017 - 00:39

ఒస్ట్రావా (చెక్ రిపబ్లిక్), జూన్ 26: తన కెరీర్‌లో ఇదే చివరి సీజన్ అని, ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత అథ్లెటిక్స్‌కు స్వస్తి పలుకుతానని స్ప్రింట్ వీరుడు ఉసేన్ బో ల్ట్ స్పష్టం చేశాడు. కెరీర్‌ను కొనసాగించే ఉద్దేశం లేదని, తన నిర్ణయంలో మార్పురాదని ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బోల్ట్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు.

06/27/2017 - 00:38

న్యూఢిల్లీ, జూన్ 26: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి శ్రీలంక మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే కూడా పోటీపడనున్నట్టు సమాచారం. వీరేందర్ సెవాగ్, టామ్ మూడీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జయవర్ధనే కూడా ఫేవరిట్స్ జాబితాలో చేరాడు. అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువును జూలై 9వ తేదీ వరకు బిసిసిఐ పెంచిన విషయం తెలిసిందే.

06/27/2017 - 00:37

ముంబయి, జూన్ 26: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై మంగళవారం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపాడు. రెండుమూడు రోజుల్లో ఆ కమిటీ పని మొదలు పెడుతుందని, పక్షం రోజుల్లో నివేదిక ఇస్తుందని చెప్పాడు. బిసిసిఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) సోమవారం ఇక్కడ జరిగింది.

06/27/2017 - 00:36

ముంబయి: బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఎస్‌జిఎంలో విశ్వప్రయత్నం చేసినట్టు సమాచారం. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) అధ్యక్షుడి హోదాలో దొడ్డిదారిన ఎస్‌జిఎంకు హాజరైన అతను పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు.

06/27/2017 - 00:36

ముంబయి: టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని అమితాబ్ చౌదరి అన్నాడు. ఆ ప్రకటన చేసే సమయంలో తాను వారిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ పూర్వక వాతావరణాన్ని చూడలేదని అన్నాడు. తాను నిజమే చెప్పానని, ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాలను తాను ఊహించలేదని అన్నాడు.

Pages