S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/01/2017 - 01:04

గాలే, జూన్ 30: ఆల్‌రౌండర్ సాలమన్ మైర్ సూపర్ సెంచరీతో రాణించడంతో, శుక్రవారం ఇక్కడ జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో శ్రీలంకపై జింబాబ్వే ఆరు వికెట్ల తేడతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న లంక 50 ఓవర్లలో 5 వికెట్లకు 316 పరుగులు సాధించింది.

07/01/2017 - 01:03

రొసారియో, జూన్ 30: అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ, సుమారు దశాబ్దం సహచర జీవితాన్ని గడిపిన తర్వాత శుక్రవారం అతను పెళ్లి చేసుకున్న ఆంటోనెలా రొకూజో మధ్య ప్రేమాయణం నిన్నమొన్నటిది కాదు. ఇద్దరూ ఒక ప్రాంతానికి చెదిన వారు. మెస్సీ తన తొమ్మిదో ఏట మొదటిసారి రొకూజోను చూశాడు. చూసిందే తడవుగా ఆమె పట్ల ఇష్టం పెంచుకున్నాడు.

07/01/2017 - 01:02

మెల్బోర్న్, జూన్ 30: ఆస్ట్రేలియా క్రికెట్‌లో నెలకొన్న అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఎసిఎ) మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి రాలేదు. దీనితో తాజా కాంట్రాక్టుపై క్రికెటర్లు ఎవరూ సంతకాలు చేయలేదు. ఇంతకు ముందున్న కాంట్రాక్టు శుక్రవారంతో ముగిసిన కారణంగా, కొత్త కాంట్రాక్టు లేకపోవడంతో ఆసీస్ క్రికెటర్లంతా ఇప్పుడు నిరుద్యోగులుగా మారారు.

06/30/2017 - 00:50

లండన్, జూన్ 29: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, వింబుల్డన్ డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే గాయపడ్డాడు. కాలి కండరాల నొప్పితో కారణంగా అతను వింబుల్డన్‌కు వామప్‌గా చెప్పే హర్లిగమ్ క్లబ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. అయితే, ఫిట్నెస్‌పై ఆందోళ లేదని, జూలై మూడో తేదీ నుంచి మొదలయ్యే వింబుల్డన్ టోర్నీలో పాల్గొంటానని ముర్రే ప్రకటించాడు. ఒకటి రెండు రోజుల విశ్రాంతితో మళ్లీ ఫిట్నెస్‌ను సంతరించుకుంటానని అన్నాడు.

06/30/2017 - 00:49

టౌన్టన్, జూన్ 29: స్మృతి మందానా సూపర్ సెంచరీతో రాణించడంతో, మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత్ అదే ఉత్సాహంతో విండీస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

06/30/2017 - 00:47

నార్త్ సౌండ్ (అంటిగువా), జూన్ 29: వెస్టిండీస్‌పై ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా చేసుకున్న టీమిండియా శుక్రవారం నాటి మూడో మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో వనే్డను భారత్ గెల్చుకున్న విషయం తెలిసిందే.

06/30/2017 - 00:47

న్యూఢిల్లీ, జూన్ 29: దక్షిణాఫ్రికాతో టూర్‌కు వెళ్లే భారత్ ‘ఎ’ టెస్టు, వనే్డ జట్లకు కరుణ్ నాయర్, మనీష్ పాండే నాయకత్వం వహించనున్నారు. అక్కడ అనధికార టెస్టుతోపాటు ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భారత్ ‘ఎ’ తలపడుతుంది. మొదట ట్రయాంగ్యులర్ వనే్డ సిరీస్ జరుగుతుంది. ఆతర్వాత దక్షిణాఫ్రికాతో భారత్ ‘ఎ’ నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్ ఆడుతుంది.
జట్ల వివరాలు

06/30/2017 - 00:46

న్యూఢిల్లీ, జూన్ 29: టీమిండియా కోచ్ పదవికి మాజీ ఆల్‌రౌండర్ రవి శాస్ర్తీ దరఖాస్తు చేసుకున్న 24 గంటలు కూడా పూర్తికాక ముందే మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన దరఖాస్తును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి పంపాడు. కర్నాటకకు చెందిన 47 ఏళ్ల ప్రసాద్ కెరీర్ 33 టెస్టులు ఆడాడు. 203 పరుగులు చేశాడు. 30 (నాటౌట్) టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు.

06/30/2017 - 00:45

సిడ్నీ, జూన్ 29: కొత్త ఒప్పందంపై వెంటనే సంతకం చేయాల్సిందిగా ఆటగాళ్ల ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) లేఖ రాసింది. అయితే, ఇది ఒక లాంఛనం మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. నిజానికి క్రికెటర్లతో ఇప్పటికీ సిఎ దాదాపుగా రాజీకొచ్చింది. క్రికెటర్ల సంఘం (ఎసిఎ)తో చర్చలు జరిపిన తర్వాత రాజీ సూత్రాన్ని ప్రకటించింది.

06/30/2017 - 00:44

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి తాను రేసులో లేనని మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ గారీ కిర్‌స్టెన్ స్పష్టం చేశాడు. కోచ్‌గా దరఖాస్తులు స్వీకరించే గడువును బిసిసిఐ జూలై 9వ తేదీ వరకు పెంచడంతో, అప్పటి వరకూ రేసులో మిగతా వారి కంటే ముందున్న టామ్ మూడీ, రిచర్డ్ పీబస్, వీరేందర సెవాగ్‌లకు గట్టిపోటీ తప్పడం లేదు.

Pages