S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/30/2017 - 00:43

రొసారియో, జూన్ 29: తల్లిదండ్రుల పెళ్లి పిల్లలు ఎవరూ చూసి ఉండరు. పిల్లల సమక్షంలో తల్లిదండ్రులు వివాహం చేసుకున్న సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పాలి. కానీ, ఈ అవకాశం బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ, అతని చిన్ననాటి స్నేహితురాలు ఆంటొనెలా రొకూజో, వారి పిల్లలు థియాగో, మటెయోలకు దక్కనుంది. సుమారు దశాబ్దకాలంగా మెస్సీ, రొకూజో సహజీవనం చేస్తున్నారు.

06/30/2017 - 00:41

న్యూఢిల్లీ, జూన్ 29: రాష్టప్రతి పదవికే లేని వయోపరిమితి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలక మండలి సభ్యులకు ఎందుకని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్‌సిఎ) కార్యదర్శి నిరంజన్ షా ప్రశ్నించాడు. లోధా కమిటీ చేసిన ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటని, దీనిని తాను వ్యతిరేకిస్తున్నానని విలేఖరులతో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం జరిగింది.

06/30/2017 - 00:41

చెక్ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్ 300 మీటర్ల పరుగులో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పిన దక్షిణాఫ్రికా రన్నర్ వేడ్ వాన్ నికెర్. అతను లక్ష్యాన్ని 30.81 సెకన్లలోనే చేరుకొని, 2000వ సంవత్సరంలో అమెరికా రన్నర్ మైఖేల్ జాన్సన్ 30.85 సెకన్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు.

06/29/2017 - 03:28

న్యూఢిల్లీ, జూన్ 28: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతుండగా, మంగళవారం దరఖాస్తు చేసుకున్న జట్టు మాజీ కెప్టెన్, మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ ఈ రేసులో ముందున్నాడన్న వాదన తెరపైకి వచ్చింది. డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా ఉన్నప్పుడు, టీమిండియాకు అతను సమర్థమైన మార్గదర్శకాన్ని అందించడం లేదని బిసిసిఐ అనుమానించింది.

06/28/2017 - 03:58

హైదరాబాద్, జూన్ 27: ఇండోనేసియా సూపర్ సిరీస్, తాజాగా ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిళ్లను దక్కించుకోవడంతో తిరిగి ప్రపంచ టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్న కిడాంబి శ్రీకాంత్ ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను దక్కించుకోవడంపై దృష్టిపెట్టాడు. ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం కోసమే తాను ఆ టోర్నమెంట్‌లో ఆడుతానని చెప్పాడు.‘ తిరిగి టాప్ టెన్‌లోకి రావడం గొప్ప విషయమే.

06/28/2017 - 01:58

న్యూఢిల్లీ, జూన్ 27: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల్లో రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వ్యతిరేకిస్తున్న కొన్ని కఠినమైన సిఫారసులను అధ్యయనం చేసేందుకు బిసిసిఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

06/28/2017 - 01:57

న్యూఢిల్లీ, జూన్ 27: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ సిద్ధమవుతున్నాడు. కోచ్ పదవికి దరఖాస్తులు సమర్పించే గడువును జూలై 9వ తేదీ వరకు పొడిగించాలని బిసిసిఐ నిర్ణయించడంతో రేసులో దిగేందుకు రవిశాస్ర్తీ చాలా ఆసక్తితో ఉన్నట్లు అతని సన్నిహితుడు ఒకరు మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.

06/28/2017 - 01:56

హైదరాబాద్, జూన్ 27: నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్‌గల్ గ్రామానికి చెందిన సింధూజ రెడ్డి అమెరికా మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. గతంలో ఆమె హైదరాబాద్ మహిళా జట్టు తరఫున రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆడింది. అలాగే అండర్-19 క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. అండర్-19 భారత జట్టు సభ్యురాలిగా పలు పోటీల్లో పాల్గొంది.

06/28/2017 - 01:54

న్యూఢిల్లీ, జూన్ 27: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ మరో ఐదేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లకు టైటిల్ స్పాన్సరర్‌గా కొనసాగనుంది. ఈ సంస్థ భారీ మొత్తంలో 2,199 కోట్ల రూపాయలకు బిడ్ దాఖలు చేసి మంగళవారం టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను నిలబెట్టుకుంది. ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం గతంలో ఈ సంస్థ కుదుర్చుకున్న కాంట్రాక్టు మొత్తం కంటే ఇది 554 శాతం ఎక్కువ.

06/28/2017 - 01:53

ముంబయి, జూన్ 27: ఒలింపిక్ కాంస్యపతక విజేత, ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విజేందర్ సింగ్ ఆగస్టు5న చైనాకు చెందిన జుల్పికర్ మైమైతాలితో తలపడతాడు.

Pages