S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/01/2017 - 23:47

నార్త్ సౌండ్: పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ రాణిస్తానన్న నమ్మకాన్ని తాను ఎన్నడూ కోల్పోలేదని విండీస్‌తో జరిన మూడో టెస్టులో 72 పరుగులు సాధించిన భారత ఓపెనర్ అజింక్య రహానే అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ వనే్డల్లో రాణించలేననిగానీ, టీమిండియాకు ఆడే అవకాశం దక్కదనిగానీ తాను ఎన్నడూ అనుమానించలేదని స్పష్టం చేశాడు.

07/01/2017 - 23:47

ముంబయి, జూలై 1: లోధా కమిటీ చేసిన సిఫార్సులను తప్పక అమలు చేయిస్తామని, ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, తమ పనిని తాము చేసుకుపోతామని సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. సిఫార్సులను అమలును సాధ్యమైనంత వరకూ ఆలస్యం చేయడానికి బిసిసిఐ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నది.

07/01/2017 - 23:46

న్యూఢిల్లీ, జూలై 1: వచ్చేనెల గ్లాస్గో (స్కాట్‌లాండ్)లో జరిగే బాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటుతామని, పతకాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని భారత స్టార్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. శనివారం ఇక్కడ జరిగిన శ్రీకాంత్ సన్మాన సభ జరిగింది.

07/01/2017 - 01:12

లండన్, జూన్ 30: ‘టెన్నిస్ జంటిల్మన్’ రోజర్ ఫెదరర్ కెరీర్‌లో మరోసారి వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ చాంపియన్‌షిప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకవేళ టైటిల్‌ను సాధిస్తే సరికొత్త రికార్డును నెలకొల్పుతాడు. వింబుల్డన్ ఓపెన్ టోర్నీగా మారిన తర్వాత పురుషుల సింగిల్స్ టైటిల్ అందుకున్న వారిలో ఎక్కువ యవసున్న ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంటాడు. ఓపెన్ శకంలో ఆర్థర్ ఆషే పేరిట ఈ రికార్డు ఉంది.

07/01/2017 - 01:11

నార్త్ సౌండ్, జూన్ 30: కోచ్ ఎంపికలో క్రికెటర్ల జోక్యం ఏమాత్రం ఉండదని, ఒకవేళ తమను అడిగితే అభిప్రాయాలను వెల్లడిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు అనిల్ కుంబ్లేను కోచ్‌గా కొనసాగించాలని బిసిసిఐ భావించినప్పటికీ, ఆ ప్రతిపాదనకు అతను నిరాకరించిన విషయం తెలిసిందే.

07/01/2017 - 01:09

మియామీ, జూన్ 30: టెన్నిస్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ చేసిన పొరపాటు వల్ల 78 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మియామీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 9న పామ్ బీజ్ గార్డెన్స్ ప్రాంతంలో కారులో వెళుతున్న వీనస్ హఠాత్తుగా మార్గాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో కారును దాదాపు నిలిపేసింది. వీనస్ కారు ఊహించని విధంగా ఆగిపోవడంతో, ఆ వెనకే వస్తున్న మరో కారు దీనిని ఢీ కొంది.

07/01/2017 - 01:08

కండరాల నొప్పితో బాధపడుతున్న ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే. అతని ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, సోమవారం నుంచి మొదలుకానున్న వింబుల్డన్‌లో అతను ఎంత వరకు రాణిస్తాడోనన్న భయం అభిమానులను వేధిస్తున్నది

07/01/2017 - 01:06

తిరుపతి, జూన్ 30: ఇండియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ను జూలై 9న ప్రకటిస్తామని బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి వేకువజామున స్వామివారికి నిర్వహించే సుప్రభాతం సేవలో పాల్గొన్నాడు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బాగా ఆడిందన్నాడు.

07/01/2017 - 01:06

భారత్‌తో అంటిగువాలో మూడో వనే్డ ఆరంభానికి ముందు ఫొటోలకు ఫోజులిస్తున్న వెస్టిండీస్ ఆటగాళ్లు షాయ్ హోప్, కేల్ హోప్. వెస్టిండీస్ తరఫున వనే్డల్లో ఆడిన అన్నదమ్ముల సంఖ్య వీరితో నాలుగుకు చేరింది. ఇంతకు ముందు మార్లొన్ శామ్యూల్స్/ రాబర్ట్ శామ్యూల్స్, డ్వెయిన్ బ్రేవో/డారెన్ బ్రేవో, పెడ్రో కొలిన్స్/్ఫడెల్ ఎడ్వర్డ్స్ సోదరులు వెస్టిండీస్‌కు వనే్డల్లో ప్రాతినిథ్యం వహించారు

07/01/2017 - 01:04

న్యూఢిల్లీ, జూన్ 30: చాలా మంది మాజీ క్రికె టర్లు డబ్బు సంపాదించడానికే ప్రాధాన్యతనిస్తూ, జాతీయ సేవలను విస్మరిస్తున్న తరుణంలో రా హుల్ ద్రవిడ్ అందుకు భిన్నంగా జాతీయ సేవల కే తాను సేవలు అందిస్తానని ప్రకటించాడు. ఐపి ఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తు న్న అతను ఆ పదవికి రాజీనామా చేశాడు. జాతీ య ‘ఎ’ జట్టుతోపాటు, అండర్-19 జట్టుకు కోచ్ గా కొనసాగుతానని ప్రకటించాడు.

Pages