S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/27/2017 - 00:34

టౌన్టన్, జూన్ 26: మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో నికోల్ బోల్టన్ అజేయ శతకంతో రాణించడంతో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 47.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (46), కెప్టెన్ స్ట్ఫానీ టేలర్ (46) తప్ప మిగతా వారంతా విఫలమయ్యారు.

06/27/2017 - 00:33

ఈస్ట్‌బర్న్ (ఇంగ్లాండ్), జూన్ 26: అమెరికాకు చెందిన మాట్ రీడ్‌తో కలిసి డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత ఆటగాడు జీవన్ నెడుంజనియన్ ఇక్కడ ప్రారంభమైన ఎటిపి-250 ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్లు ర్యాన్ హారిసన్, మైఖేల్ వీనస్ జోడీకి షాకిచ్చాడు. జీవన్, రీడ్ జోడీ 6-3, 3-6, 10-7 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది.

06/26/2017 - 01:50

సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెల్చుకున్న తర్వాత, సపోర్టింగ్ స్టాఫ్‌తో ఫొటోలకు ఫోజులిస్తున్న తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్. అతనికి ఇది వరుసగా రెండవ, కెరీర్‌లో నాలుగవ సూపర్ సిరీస్ టైటిల్

06/26/2017 - 01:28

సిడ్నీ, జూన్ 25: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌ను భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో రెండు పర్యాయాలు ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ప్రపంచ ఆరో ర్యాంకర్ చెన్ లాంగ్‌ను 22-20, 21-16 తేడాతో ఓడించాడు.

06/26/2017 - 01:25

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన కిడాంబి శ్రీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీసహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. కెరీర్‌లో నాలుగోసారి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించిన శ్రీకాంత్‌ను మోదీ అభినందించారని పిఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాంత్ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ ప్రశంసించారు.

06/26/2017 - 01:25

చెన్నై: ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌తో స్వదేశానికి చేరుకోనున్న కిడాంబి శ్రీకాంత్‌కు తాను వ్యక్తిగత హోదాలో టియువి 300 కారును బహూకరిస్తానని మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రకటించాడు. అతని పోరాట పటిమను చూసి జాతి మొత్తం గర్విస్తున్నదని ఆనంద్ ట్వీట్ చేశాడు.

06/26/2017 - 01:22

ముంబయి, జూన్ 25: లోధా కమిటీ సూచించిన ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’ విధానం అమలు ప్రధాన అంశంగా సోమవారం ఇక్కడి ప్రధాన కార్యాలయంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సమావేశం కానుంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా, కొత్త కోచ్ ఎంపిక వంటి పలు కీలక అంశాలు కూడా ఈ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

06/26/2017 - 01:21

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూన్ 25: చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో, కోచ్ లేకుండానే విండీస్ టూర్‌కు వచ్చిన టీమిండియా కుదుటపడుతున్నదని జట్టు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ అన్నాడు. కుంబ్లే లేకపోవడం లోటేనని ఆదివారం వెస్టిండీస్‌తో రెండో వనే్డ ఆరంభానికి ముందు విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. అయితే, ఆటగాళ్లంతా సమష్టిగా నిలిచి, లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు.

06/26/2017 - 01:29

న్యూఢిల్లీ, జూన్ 25: మంగోలియాలో జరిన ఉలాన్‌బాతర్ కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 60 కిలోల విభాగంలో భారత యువ బాక్సర్ అంకుష్ దహియా స్వర్ణ పతకం సాధించాడు. 19 ఏళ్ల అంకుష్ చివరి ఫైనల్‌లో కొరియాకు చెందిన మన్ చొయే చొల్‌ను ఓడించాడు. సీనియర్స్ విభా గంలో అతనికి ఇదే తొలి అంతర్జాతీయ పతకం. కాగా, 52 కిలోల విభాగంలో దేవేంద్రో సింగ్ రజత పతకంతో సరిపుచ్చుకున్నాడు.

06/26/2017 - 01:17

హమీర్‌పూర్, జూన్ 25: టీమిండియా చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజకీనామా విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని అనవసరంగా లాగుతున్నారని బిసిసిఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోహ్లీని విమర్శించడం మంచిది కాదని హితవు పలికాడు. కుంబ్లే రాజీనామా చేయడంలో కోహ్లీకి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

Pages