S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/14/2017 - 00:53

రాంచీ, మార్చి 13: భారత్‌తో ఈనెల 16 నుంచి మొదలయ్యే మూడో టెస్టులో తాను ఆడతానని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ధీమా వ్యక్తం చేశాడు. బెంగళూరులో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు అతని కుడిచేతి చూపుడువేలుకు గాయమైంది. బంతిని స్పిన్ చేసేందుకు ఉపయోగించే వేలి నొప్పితో బాధపడుతున్న లియాన్ మూడో టెస్టులో ఆడకపోవచ్చన్న అనుమానాలు తలెత్తాయి. అయితే, మ్యాచ్ ఆడగలనన్న నమ్మకం తనకు ఉందని అన్నాడు.

03/14/2017 - 00:51

ఇండియన్ వెల్స్: మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంక్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా (స్పెయిన్) ప్రీ క్వార్టర్స్ చేరింది. ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన ఆమె ఇక్కడ మూడో రౌండ్‌లో కేలా డేను 3-6, 7-5, 6-2 తేడాతో ఓడించింది.

03/13/2017 - 02:20

రాంచీ, మార్చి 12: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని, క్రీడాస్ఫూర్తిని మంటగలిపాడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఆరోపణలు ఉద్రిక్తతలకు దారితీసినప్పటికీ, ఇరు దేశాల క్రికెట్ బోర్డుల అధికారులు సమావేశమై చర్చించడంతో తాత్కాలికంగా ముగిసింది.

03/13/2017 - 01:13

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 12: విశాఖ జిల్లా ఆల్‌రౌండర్ కెవి శశికాంత్ భారత అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆంధ్రా జట్టులో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న శశికాంత్ సెలక్టర్లను ఆకట్టుకుని జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

03/13/2017 - 01:11

ఇండియన్ వెల్స్, మార్చి 12: ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రేకు చుక్కెదురైంది. కెనడాకు చెందిన యువ ఆటగాడు వాసెక్ పొస్పిసిల్ 6-4, 7-6 తేడాతో వరుస సెట్లలో ముర్రేను ఓడించి సంచలనం సృష్టించాడు. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ముర్రే మొదటి సెట్‌లో ప్రత్యర్థిని చాలా తేలిగ్గా తీసుకున్నట్టు కనిపించింది.

03/13/2017 - 01:10

ఇండియన్ వెల్స్: ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారిణి సమంతా స్టొసుర్‌ను మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో జూలియా జార్జస్ దెబ్బతీసింది. మొదటి సెట్‌ను 4-6 తేడాతో చేజార్చుకున్న ఆమె ఎవరూ ఊహించని విధంగా ఫామ్‌లోకి వచ్చింది. మిగతా రెండు సెట్లను 6-4, 6-4 తేడాతో తన ఖాతాలో వేసుకోవడంతో స్టొసుర్ నిష్క్రమించింది. ఇతర కీలక మ్యాచ్‌ల్లో, లూసీ సఫరోవా 4-6, 6-4, 6-1 ఆధిక్యంతో కొకొ వాండెవాగ్‌ను ఓడించింది.

03/13/2017 - 01:08

ఢిల్లీ, మార్చి 12: విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో బరోడా, తమిళనాడు జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి. మొదటి క్వార్టర్ ఫైనల్‌లో కర్నాటకను ఢీకొన్న బరోడా 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్నాటక 48.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. పవన్ దేశ్‌పాండే (54) అర్ధశతకంతో రాణించగా, మాయాంక్ అగర్వాల్ (40), రవికుమార్ సమర్థ్ (44) మెరుగైన స్కోర్లు చేశారు.

03/13/2017 - 01:08

డ్యునెడిన్, మార్చి 12: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజైన ఆదివారం నాటి ఆట వర్షం కారణంగా రద్దుకావడంతో, మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశమే లేకుండాపోయింది. మొదట భారీ వర్షం, ఆతర్వాత అవుట్‌ఫీల్డ్ బురదమయం కావడం చివరి రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడకుండా ఆడ్డుకున్నాయి. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 341 పరుగులు సాధించింది.

03/12/2017 - 10:17

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 11: స్థానిక టీనేజర్ కేలా డే ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీ ఫైనలిస్టు మిర్జానా లూసిక్ బరోనీతో జరిగిన మ్యాచ్‌ని 17 ఏళ్ల కేలా డే ఎవరూ ఊహించని రీతిలో 6-4, 5-7, 7-5 తేడాతో గెల్చుకొని, మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది.

03/12/2017 - 09:49

గాలే, మార్చి 11: రంగన హెరాత్ విజృంభణతో బంగ్లాదేశ్ విలవిల్లాడింది. డ్రా కోసం చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, రెండో ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 197 పరుగులకే కుప్పకూలింది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఎడమచేతి వాటం బౌలర్లలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన హెరాత్ ఆరు వికెట్లు పడగొట్టి, శ్రీలంకకు 259 పరుగుల భారీ విజయాన్ని సాధించిపెట్టాడు.

Pages