S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/11/2017 - 00:52

ఇండియన్ వెల్స్, మార్చి 10: ఇటీవల కాలంలో కొంత వెనుకబడిన మాట వాస్తవమేనని, అయితే, త్వరలోనే మళ్లీ ఫామ్‌లోకి వస్తానని టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో బై లభించిన జొకోవిచ్ రెండో సెట్‌లో మ్యాచ్‌కి సిద్ధమవుతున్నాడు.

03/11/2017 - 00:51

డ్యునెడిన్, మార్చి 10: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ విజృంభణ న్యూజిలాండ్‌ను ఆదుకుంది. సెంచరీతో అతను రాణించి, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తన జట్టు 33 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించడంలో ముఖ్యభూమిక పోషించాడు. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు సాధించింది.

03/10/2017 - 00:51

దుబాయ్, మార్చి 9: బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో చోటు చేసుకున్న డిఆర్‌ఎస్ వివాదంలో ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదని, అందుకు తగినంత బలమైన ఫిర్యాదులు కూడా తమకు అందలేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) స్పష్టం చేసింది. దీనితో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వివాదానికి తెరపడినట్టే.

03/10/2017 - 00:49

బెంగళూరు, మార్చి 9: తమ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంబద్ధమైన ఆరోపణలు చేశాడని, నిజానికి వాటిలో పస లేదని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేవిడ్ సాకెర్ ధ్వజమెత్తాడు. డిఆర్‌ఎస్ అప్పీల్స్‌కు వెళ్లే ప్రతిసారీ డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తూ, అక్కడి నుంచి సూచనల కోసం స్మిత్ ఎదురుచూస్తున్నాడని కోహ్లీ విమర్శించిన విషయం తెలిసిందే.

03/10/2017 - 00:48

న్యూఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న భారత రోల్‌బాల్ పురుషులు, మహిళా జట్ల సభ్యులు. ఢాకా (బంగ్లాదేశ్)లో జరిగిన
ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఈ రెండు జట్లు టైటిళ్లను నిలబెట్టుకున్నాయ

03/10/2017 - 00:46

బర్మింహామ్, మార్చి 9: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐసిసి చేసిన ప్రకటన పట్ల భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఏకపక్ష నిర్ణయమంటూ ఐసిసిపై ధ్వజమెత్తాడు. ఒక్కో దేశానికి లేదా ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన న్యాయాన్ని అమలు చేస్తున్నదని ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గవాస్కర్ ఆరోపించాడు.

03/10/2017 - 00:44

గాలే, మార్చి 9: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక 182 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 494 పరుగుల భారీ స్కోరును లంక సాధించిన విషయం తెలిసిందే. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 133 పరుగులు చేయగా, సౌమ్య సర్కార్ (66), కెప్టెన్ ముష్ఫికర్ రహీం (1) క్రీజ్‌లో ఉన్నారు.

03/10/2017 - 00:43

బర్మింహామ్, మార్చి 9: భారత స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు ఇక్కడ జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరారు. గురువారం నాటి రెండో రౌండ్ మ్యాచ్‌లో సైనా ఎలాంటి కష్టం లేకుండా, తన ప్రత్యర్థి ఫాబియానే డిప్రెజ్‌ను 21-18, 21-6 తేడాతో చిత్తుచేసింది.

03/10/2017 - 00:41

బార్సిలోనా, మార్చి 9: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రీ క్వార్టర్స్‌లో పారిస్ సెయింట్ జెర్మెయిన్ (పిఎస్‌జి)ని 6-1 తేడాతో చిత్తుచేసింది. చివరి ఏడు నిమిషాల్లో మూడు గోల్స్ సాధించి, ఎదురుదాడికి కొత్త అర్ధాన్నిచ్చింది. ఈ టోర్నమెంట్‌లో పిఎస్‌జితో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లో బార్సిలోనా ఒక్క గోల్ కూడా చేయలేదు.

03/10/2017 - 00:40

డ్యునెడిన్, మార్చి 9: కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తూ, అజేయంగా 85 పరుగులు సాధించడంతో, దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 177 పరుగులు చేయగలిగింది. అంతకు ముందు నాలుగు వికెట్లకు 229 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 122.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది.

Pages