S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/17/2017 - 01:03

కొలంబో, మార్చి 16: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో దినేష్ చండీమల్ శతకంతో రాణించాడు. అతని ప్రతిభతో లంక 338 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది.

03/17/2017 - 01:03

న్యూఢిల్లీ, మార్చి 16: బిసిసిఐ పాలనా వ్యవహారాలను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు నియమించిన అధికారుల కమిటీ (సిఎఒ) శుక్రవారం సమావేశమై, లోధా కమిటీ సిఫార్సుల అమలు తదితర అంశాలను చర్చించనుంది. అదే విధంగా కోర్టు కేసుపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలను కూడా ఈ కమిటీ సమీక్షిస్తుంది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలే ఈ కమిటీ ముందున్న ప్రధాన లక్ష్యమన్నది విదితమే.

03/17/2017 - 01:02

వెల్లింగ్టన్, మార్చి 16: దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే న్యూజిలాండ్ ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ ఒంటరి పోరాటం జరిపి సెంచరీ సాధించగా, మిగతా వారు తక్కువ పరుగులకే పరిమితం కావడంతో కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 268 పరుగులేకే ఆలౌటైంది. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

03/16/2017 - 05:55

‘ఐసిసి చైర్మన్‌గా రెండేళ్ల కాలానికి నేను పోటీ లేకుండా గత ఏడాది ఎన్నికయ్యాను. సంస్థను పారదర్శకంగా ఉంచడానికి, పాలనా వ్యవహారాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. పాలక మండలి సభ్యుల సహాయ సహకారాలతో నేను విధులను నిర్వర్తించాను. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆగస్టులో జరిగే ఐసిసి వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించలేను.

03/16/2017 - 05:53

రాంచీ, మార్చి 15: రాంచీ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని నిపుణుల అభిప్రాయం. జెఎస్‌సిఎ మైదానంపై బంతి చాలా తక్కువగా బౌన్స్ అవుతుంది. బంతి బ్యాట్‌పైకి రాకపోవడంతో, పరుగుల కోసం బ్యాట్స్‌మెన్ నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే, ఇది టెస్టు కాబట్టి, రెండుమూడు సెషన్స్ తర్వాత పిచ్ తీరు మారే అవకాశం ఉంటుంది.

03/16/2017 - 05:52

మొట్టమొదటిసారి ఒక టెస్టు మ్యాచ్‌కి ముస్తాబైనప్పటికీ రాంచీలో పండుగ వాతావరణం కరవైంది. స్థానికుడైన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులో లేకపోవడమేకాదు.. కనీసం మ్యాచ్‌ని చూసేందుకు వచ్చే అవకాశం కూడా లేదన్న వార్తతో అభిమానులు నీరసపడిపోయారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆదరణ ఉన్నప్పటికీ, రాంచీలోని క్రికెట్ అభిమానులకు అతను ధోనీతో సరితూగడు.

03/16/2017 - 05:51

న్యూఢిల్లీ, మార్చి 15: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో జార్ఖండ్, బెంగాల్ జట్లు తమతమ ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరాయి. విదర్భను ఢీకొన్న జార్ఖండ్ ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు సాధించింది.

03/16/2017 - 05:51

ఇండియన్ వెల్స్, మార్చి 15: ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో టాప్ స్టార్లు ప్రీ క్వార్టర్స్ చేరారు. రెండో ర్యాంక్ ఆటగాడు, టైటిల్ ఫేవరిట్ నొవాక్ జొకోవిచ్ 7-5, 4-6, 6-1 ఆధిక్యంతో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను ఓడించాడు. మొదటి సెట్‌ను సాధించడానికి ఎంతో కష్టపడిన జొకోవిచ్ రెండో సెట్‌లో పోరాడినప్పటికీ ఓటమిపాలయ్యాడు.

03/15/2017 - 00:38

రాంచీ, మార్చి 14: ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లోనూ టీమిండియా దూకుడు కొనసాగుతుందని జట్టు కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. మైదానంలో ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా, ప్రశాంతంగా ఉండాలని ఆటగాళ్లను కోరే ప్రసక్తే లేదని మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ కుంబ్లే అన్నాడు. స్వతఃసిద్ధమైన అలవాట్లను, ఉత్సాహాన్ని అడ్డుకోవడం తన లక్ష్యం కాదని చెప్పాడు.

03/15/2017 - 00:37

రాంచీ, మార్చి 14: తిట్ల దండకం చదవడం, చులకనగా మాట్లాడడం, హేళన చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం, అవమానించే రీతిలో సైగలు చేయడం వంటి చర్యలతో ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడంలో ఆస్ట్రేలియాను మించిన జట్టు లేదు. మైదానంలో విపరీత ధోరణకులకు కారణమైన ‘స్లెడ్జింగ్’తో ఆసీస్ రెచ్చిపోతే, ఇంగ్లాండ్, వెస్టిండీస్ తదితర జట్లు కూడా తాము తక్కువేమీ కాదన్న రీతిలో ప్రవర్తిస్తున్నాయ.

Pages