S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/09/2017 - 07:37

ముంబయి, మార్చి 8: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మెదడు మొద్దుబారుతున్నదని, అందుకే, నిబంధనలకు విరుద్ధంగా అతను డిఆర్‌ఎస్ అప్పీల్స్ సమయంలోనూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సపోర్టింగ్ స్ట్ఫా సూచనల కోసం ఎదురుచూస్తున్నాడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన విమర్శలు సంచలనం రేపుతున్నాయి.

03/09/2017 - 07:35

లండన్, మార్చి 8: ఐసిసి మహిళల వరల్డ్ కప్‌లో భారత్ తన మొదటి మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ ఏడాది జూన్ 24 నుంచి మొదలయ్యే మహిళల వరల్డ్ కప్ పోటీలకు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా, డెర్బీలో జరిగే మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొంటున్న భారత్ ఆతర్వాత 29న వెస్టిండీస్‌తో టాంటన్‌లో తలపడుతుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే మ్యాచ్ జూలై 2న డెర్బీలో జరుగుతుంది.

03/09/2017 - 07:34

దుబాయ్, మార్చి 8: భారత స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అరుదైన ఘనతను అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో వీరిద్దరూ సంయుక్తంగా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించారు. 2008లో డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్ ఇదే విధంగా బౌలింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని పంచుకున్నారు.

03/09/2017 - 07:33

గ్రేటర్ నోయిడా, మార్చి 8: తటస్థ వేదిక గ్రేటర్ నోయిడాలో బుధవారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. స్టువర్ట్ థాంప్సన్ 56, కెప్టెన్ విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ 39, గారీ విల్సన్ 41 (నాటౌట్) మెరుగైన స్కోర్లు చేశారు.

03/09/2017 - 07:33

న్యూఢిల్లీ, మార్చి 8: భారత్‌తో బెంగళూరులో జరిగిన రెండో టెస్టు మ్యాచ్, నాలుగోరోజు ఆట సమయంలో చోటు చేసుకున్న వివాదానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని, నిజానికి తాను తప్పు చేశానని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోమ్ స్పష్టం చేశాడు. జరిగిన సంఘటనలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పొరపాటు ఏమీ లేదని అతను ట్విటర్‌లో వివరణ ఇచ్చాడు.

03/09/2017 - 07:32

గాలే, మార్చి 8: కుశాల్ మెండిస్ ఆరు పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, అతని ప్రతిభకు అసెల గుణరత్నే, నిరోషన్ డిక్‌విల్లా, దిల్‌రువాన్ పెరెనా అర్ధ శతకాలు జత కలవడంతో, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 494 పరుగుల భారీ స్కోరు సాధించింది.

03/08/2017 - 01:37

చిత్రం..రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ వెన్నువిరిచిన అశ్విన్‌ను అభినందిస్తున్న సహచరులు

03/08/2017 - 01:20

బెంగళూరు, మార్చి 7: ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు సంచలన విజయాన్ని సాధించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 41 పరుగులకే 6 వికెట్లు కైవసం చేసుకుని ఈ మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చాడు. దీంతో భారత జట్టు మరో రోజు ఆట మిగిలి ఉండగానే 75 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించి నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

03/08/2017 - 01:19

దుబాయ్, మార్చి 7: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమైంది.

03/08/2017 - 01:17

చిత్రం..అద్భుతమైన డైవ్‌తో గాలిలోనే క్యాచ్ పట్టిన
టీమిండియా వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా

Pages