S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/19/2016 - 02:22

రియో డి జెనీరో: భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ మహిళల 48 కిలోల ఫ్రీస్టయిల్ క్వార్టర్ ఫైనల్ పోరులో గాయపడింది. చైనాకు చెందిన సన్ యనాన్‌తో తలపడిన ఆమె కుస్తీ పడుతున్న సమయంలో మోకాలికి బలమైన గాయమైంది. అయితే, పోరును ఆపకుండా కొంత సేపు కొనసాగించడంతో కాలి కండరాలు చిట్లాయి. నొప్పితో విలవిల్లాడుతున్న వినేష్‌ను స్ట్రెచర్‌పై తరలించాల్సి వచ్చింది.

08/19/2016 - 02:20

రియో డి జెనీరో: ఒలింపిక్స్ సాకర్‌లో బ్రెజిల్‌కు మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. మహిళల విభాగం సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైన బ్రెజిల్ పురుషుల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్టార్ ఆటగాడు, కెప్టెన్ నేమార్ రెండు గోల్స్ చేసి, హోండురాస్‌పై బ్రెజిల్ 6-0 తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

08/19/2016 - 02:18

రియో డి జెనీరో, ఆగస్టు 18: మొట్టమొదటిసారి ఒలింపిక్స్ మహిళల ఫుట్‌బాల్‌లో ఫైనల్ చేరాలన్న బ్రెజిల్ ఆశలు గల్లంతయ్యాయి. పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం తేలిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో స్వీడన్ 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో జర్మనీతో పోరాటానికి రంగాన్ని సిద్ధం చేసుకుంది. సాకర్‌కు మారుపేరుగా నిలిచే బ్రెజిల్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తూ ఫైనల్ చేరలేకపోవడం అభిమానులను నిరాశ పరచింది.

08/19/2016 - 02:16

రియో డి జెనీరో: భారత మహిళా రెజ్లర్ బబితా కుమారి మొదటి బౌట్‌లో ఓటమిపాలైంది. మహిళల 53 కిలోల విభాగంలో పోటీకి దిగిన ఆమె తొలి రౌండ్‌లో గ్రీస్‌కు చెందిన మరియా ప్రెవొలరచి చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ పోటీల్లో ఆమెకు తదుపరి అవకాశాలు ప్రెవొలరచి విజయాలపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ప్రెవొలరచి ఫైనల్ చేరితే, బబితకు రెపీచేజ్‌లో పోటీపడే అవకాశం దక్కుతుంది.

08/19/2016 - 02:15

రియో డి జెనీరో: జమైకా అథ్లెట్ ఎలైన్ థాంప్సన్ మహిళల 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకు ముందు 100 మీటర్ల విభాగంలోనూ విజేతగా నిలిచిన ఆమె ‘సూపర్ డబుల్’ను సాధించింది. హోరాహోరీగా సాగిన 200 మీటర్ల పరుగును ఎలైన్ 21.78 సెకన్లలో పూర్తి చేసింది.

08/18/2016 - 02:31

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం పివి సింధు బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా దూసుకెళుతున్నది. సెమీ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాను ఢీకొననున్న ఆమె క్వార్టర్స్‌లో ఇహాన్ వాంగ్‌ను 22-20, 21-19 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో సెమీస్ చేరిన భారత రెండో బాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

08/18/2016 - 01:09

రియో డి జెనీరో: మహిళల 800 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ టింటూ లుకా హీట్స్‌లోనే ఓటమిపాలైంది. లక్ష్యాన్ని 2:00.53 నిమిషాల్లో పూర్తి చేసిన ఆమె 29వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన వివాదాస్పద అథ్లెట్ కాస్టర్ సెమెన్యా హీట్స్‌లో అందరి కంటే ముందుగా లక్ష్యాన్ని చేరి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

08/18/2016 - 01:08

రియో డి జెనీరో: ఇరాన్ వెయిట్‌లిఫ్టర్ బెదాద్ సలీమికొర్డాసియాబి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పురుషుల 105 కిలోలకు మించిన సూపర్ హెవీవెయిట్ ఈవెంట్ స్నాచ్‌లో అతను 216 కిలోల బరువునెత్తాడు. సలీమీగా అందరికీ సుపరచితుడైన అతను జార్జియాకు చెందిన లషా తలకజే రికార్డును బద్దలు చేశాడు. తలకజే 215 కిలోలతో రికార్డు నెలకొల్పగా సలీమీ ఆ దానిని అధిగమించాడు. అయితే, అతనికి స్వర్ణ పతకం దక్కలేదు.

,
08/18/2016 - 01:05

న్యూఢిల్లీ, ఆగస్టు 17: భారత క్రీడా రంగంలో ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి సంచలనం సృష్టించిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు ఈ అవార్డు దక్కాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టడమేగాక, చివరి వరకూ తీవ్ర స్థాయిలో పోరాడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

08/18/2016 - 01:02

రియో డి జెనీరో: బాడ్మింటన్ పురుషుల విభాగంలో తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ పోరాటానికి తెరపడింది. చైనాకు చెందిన మూడోసీడ్ లిన్ డాన్‌తో చివరి వరకూ హోరాహోరీగా పోరాడిన శ్రీకాంత్ 6-21, 21-11, 18-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. మొదటి సెట్‌లో ఏమాత్రం పోటీని ఇవ్వలేక చేతులెత్తేసిన శ్రీకాంత్ రెండో సెట్‌లో అనూహ్యంగా ఎదురుదాడికి దిగాడు.

Pages