S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/30/2016 - 06:26

మెల్బోర్న్, జనవరి 29: అంతర్జాతీయ ఈవెంట్లలో అప్రతిహతంగా దూసుకెళ్తున్న టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) గ్రాండ్‌శ్లామ్ పోటీల్లో ‘హ్యాట్రిక్’ టైటిల్ కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటుకున్నారు.

01/30/2016 - 06:24

మెల్బోర్న్, జనవరి 29: కంగారూలతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించి మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

01/30/2016 - 06:23

మెల్బోర్న్, జనవరి 29: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే ఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం ఇక్కడ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో కెనడా ఆటగాడు మిలోస్ రవోనిక్‌ను ఓడించి ఈ టోర్నీలో ఐదోసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ముర్రే ఇంతకుముందు నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

01/30/2016 - 06:22

న్యూఢిల్లీ, జనవరి 29: ఇక్కడ జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ పోటీల్లో మన దేశానికి చెందిన ఆయోనికా పౌల్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఫైనల్లో అయోనికా పౌల్ రజత పతకాన్ని సాధించడంతో మన దేశం 11వ ఒలింపిక్ కోటాను పూర్తి చేసుకుంది. అయితే ఇదే విభాగంలో పోటీ పడిన పూజా ఘట్కర్ కొద్దిలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక పోయింది.

01/29/2016 - 14:09

ఆస్ట్రేలియన్ ఓపెన్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా-హింగిస్ జోడి మహిళల డబుల్స్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో ఆండ్రియా-లూసీ జోడిని చిత్తు చేసింది. 7-6, 6-3 తేడాతో విజయం సాధించింది. వరుసగా 36వ విక్టరీని ఈ జోడి నమోదు చేసింది. అంతేకాదు సానియా-హింగీస్ వరుసగా మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

01/29/2016 - 08:38

మెల్బోర్న్, జనవరి 28: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ దూకుడు కొనసాగుతున్నది. కెరీర్‌లో 17 పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌పై అతను తొలిసారి ఆధిక్యాన్ని సంపాదించాడు.

01/29/2016 - 08:36

మెల్బోర్న్, జనవరి 28: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో విజయపరంపరలను కొనసాగిస్తూ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో ఆమె నాలుగో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కాను 6-0, 6-4 తేడాతో చిత్తుచేసింది.

01/29/2016 - 08:34

మీర్పూర్, జనవరి 28: అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో గురువారం ఐర్లాండ్‌ను ఢీకొన్న భారత్ 79 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ అర్ధ శతకాలతో రాణించడంతో, ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 268 పరుగుల చేయగలిగింది. సర్ఫరాజ్ 70 బంతులు ఎదుర్కొని 74, సుందర్ 71 బంతుల్లో 62 చొప్పున పరుగలు చేశారు.

01/29/2016 - 08:34

మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్‌ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టు టి-20 సిరీస్‌పై కనే్నసింది. మొదటి మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. శుక్రవారం జరిగే రెండో టి-20లోనూ గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

01/29/2016 - 08:33

న్యూఢిల్లీ, జనవరి 28: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో చోటు చేసకున్న అవకతవకలు, ఆర్థిక కుంభకోణాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్)తో దర్యాప్తు చేయించాలని బిజెపి నుంచి సస్పెండైన పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ డిమాండ్ చేశాడు. గురువారం అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిడిసిఎ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించాడు.

Pages