S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/03/2017 - 00:44

ముంబయ, జనవరి 2: సుప్రీం కోర్టు తాజా తీర్పు పట్ల ప్రముఖ రాజకీయవేత్త, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ విచారాన్ని వ్యక్తం చేశాడు. రాజకీయాల్లో మరాఠా మాంత్రికుడిగా పేరు పొంది బిసిసిఐతో పాటు అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాల్లో ఎన్నో ఏళ్ల పాటు చక్రం తిప్పిన పవార్ (76) గత నెల ఎంసిఎ (ముంబయి క్రికెట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే.

01/03/2017 - 00:42

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసుల అమలును అడ్డుకుంటున్నందుకు పదవి నుంచి ఉద్వాసనకు గురైన బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

01/03/2017 - 00:40

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడంలో విఫలమైనందుకు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలకు సర్వోన్నత న్యాయస్థానం ఉద్వాసన పలకడంతో తాత్కాలిక అధ్యక్షునిగా బోర్డులోని ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఎవరిని నామినేట్ చేయాలన్న దానిపై బిసిసిఐ మల్లగుల్లాలు పడుతోంద

01/03/2017 - 00:38

కొచ్చి, జనవరి 2: కేరళ క్రికెట్ అసోసియేషన్ (కెసిఎ)లో ఏకమొత్తంగానో లేక విడివిడిగానో ఇప్పటికే తొమ్మిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న అధ్యక్షుడు టిసి.మాథ్యూ, కార్యదర్శి అనంతనారాయణ్‌తో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు సోమవారం తమతమ పదవుల నుంచి వైదొలిగారు.

01/03/2017 - 00:37

హైదరాబాద్, జనవరి 2: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో సింధు రజత పతకాన్ని సాధించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు అనేక బహుమతులను అందించిన విషయం విదితమే.

01/03/2017 - 00:36

సిలిగురి, జనవరి 2: శాఫ్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సిలిగురిలోని కాంచన్‌జంగా స్టేడియంలో సోమవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో నేపాల్‌ను మట్టికరిపించి టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టుకు కమలా దేవి 45వ నిమిషంలో తొలి గోల్‌ను అందించింది.

01/03/2017 - 00:35

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో తన పాత్ర ముగిసిందని పదవి నుంచి ఉద్వాసనకు గురైన బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే అన్నాడు. బోర్డు కార్యదర్శి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తనకేమీ బాధ కలిగించలేదని, తాను బాగానే ఉన్నానని ఆయన చెప్పాడు.

01/02/2017 - 00:38

న్యూఢిల్లీ, జనవరి 1: వ్యాయామానికి మతంతో ఎలాంటి సంబంధం లేదని, సోషల్ మీడియాలో తాను ఉంచిన ఫొటోలపై రాద్ధాంతం తగదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఫిజికల్ వర్కవుట్ రొటీన్‌లో భాగంగా అతను సూర్య నమస్కారాలు చేయడం విమర్శలకు కారణమైంది. కైఫ్ పెట్టిన ఫొటోలు మత విశ్వాసాలను కించ పరిచేవిగా ఉన్నాయంటూ కొంత మంది ఇస్లామిక్ మతవాదులు విమర్శలు గుప్పించారు.

01/02/2017 - 00:36

నాగపూర్, జనవరి 1: జార్ఖండ్‌తో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మొదటి రోజు ఆటలో ప్రియాంక్ కిరీట్ పంచాల్ అజేయ శతకంతో రాణించడంతో గుజరాత్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 283 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 62 పరుగుల స్కోరువద్ద తొలి వికెట్‌కను సమిత్ గొహెల్ (18) రూపంలో కోల్పోయింది.

01/02/2017 - 00:34

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి అందరి దృష్టినీ ఆకట్టుకున్న సాక్షి మాలిక్ ఈ టోర్నీలో స్టార్ అట్రాక్షన్‌గా మారనుంది. ఆమెతోపాటు ‘్ఫగట్ సిస్టర్స్’ కూడా అభిమానులను ఆకర్షించనున్నారు. అమీర్ ఖాన్ తీసిన దంగల్ సినిమా వారి జీవిత గాథే కావడంతో, ఫొగట్ సిస్టర్స్‌ను బరిలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడడం ఖాయం.

Pages