S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/28/2016 - 00:48

చెన్నై, డిసెంబర్ 27: ఢిల్లీలో కామనె్వల్త్ క్రీడల సందర్భంగా అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 10 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన పార్లమెంట్ మాజీ సభ్యుడు సురేష్ కల్మాడీ భారత ఒలింపిక్ సంఘ (ఐఓఎ) జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐఓఎ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనతో పాటు మరో కళంకిత నాయకుడు అభయ్ సింగ్ చౌతాలాను కూడా ఐఓఎ జీవితకాల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

12/28/2016 - 00:45

మెల్బోర్న్, డిసెంబర్ 27: భారత టెస్టు క్రికెట్ జట్టును అప్రతిహతంగా ముందుకు నడిపిస్తూ సర్వత్రా ప్రశంసలు అందుకొంటున్న డైనమిక్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) మరో విశిష్టమైన గౌరవాన్ని కల్పించింది. ఈ ఏడాదికి తాము ఎంపిక చేసిన అంతర్జాతీయ వనే్డ క్రికెట్ జట్టుకు కోహ్లీని సారథిగా నియమించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది.

12/28/2016 - 00:44

రాయ్‌పూర్, డిసెంబర్ 27: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి జట్టు టైటిల్‌కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం ఇక్కడ ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 30 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టును ఓడించి సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

12/28/2016 - 00:42

నాగర్‌కోయిల్ (తమిళనాడు), డిసెంబర్ 27: తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జరుగుతున్న సీనియర్ నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో జిమ్జాంగ్ దేరు సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను మంగళవారం పురుషుల క్లీన్ అండ్ జెర్క్ 62 కిలోల విభాగంలో 153 కిలోల బరువు ఎత్తి ఈ రికార్డును సృష్టించడంతో పాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

12/28/2016 - 00:40

మెల్బోర్న్, డిసెంబర్ 27: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్‌లో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అజర్ అలీ అజేయ శతకంతో సత్తా చాటుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ జట్టు భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతోంది.

12/28/2016 - 00:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఇండియన్ సూపర్ లీగ్ (ఐ-లీగ్) 10వ ఎడిషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. స్ట్రైకర్ సునీల్ చెత్రి సహా పలువురు భారత ఫుట్‌బాల్ స్టార్ల సమక్షంలో అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. దేశంలోని నాలుగు ప్రాంతాలకూ చెందిన పది జట్లు ఈ టోర్నీలో తలపడబోతున్నాయి.

12/28/2016 - 00:38

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 27: శ్రీలంకతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పట్టు బిగిస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైన దక్షిణాఫ్రికా జట్టు మంగళవారం శ్రీలంకను సమర్ధవంతంగా ప్రతిఘటించింది. ముఖ్యంగా వెర్నాన్ ఫిలాండర్ 35 పరుగులకే 3 వికెట్లు కైవసం చేసుకుని శ్రీలంక బ్యాట్స్‌మన్లను చక్కగా నిలువరించాడు.

12/27/2016 - 02:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత క్రికెట్‌కు పర్యాయపదంగా మారిపోయాడు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రతి యుద్ధంలోనూ తానే ఒక సైన్యమై దూసుకెళ్లాడు. సహచరులకు మార్గదర్శకంగా నిలిచాడు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన అతి కొద్దిమంది క్రికెటర్లలలో కోహ్లీ ముందు వరుసలో నిలిచాడు. టెస్టుల్లోనేగాక, అన్ని ఫార్మెట్స్‌లోనూ అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు.

12/27/2016 - 02:33

కరాచీ, డిసెంబర్ 26: పాకిస్తాన్ జాతీయ క్రికెట్ అకాడెమీలో అకాడెమీలో చోటు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ మహీందర్‌పాల్ సింగ్ కొత్త శకానికి నాంది పలికాడు. పాక్ అకాడెమీకి ఎంపికైన తొలి పంజాబీ క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. 21 ఏళ్ల మహిపాల్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావీన్స్‌లోని గిరిజన ప్రాంతానికి చెందిన వాడు. అయితే, అతను లాహోర్ శివార్లలోని నాన్కానా సాహెబ్‌లో నివాసం ఉంటున్నాడు.

12/27/2016 - 02:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: గాయాల కారణంగా కెరీర్‌లో ఎక్కువ శాతం విశ్రాంతికే పరిమితమవుతున్న భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తనకు కుటుంబం పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమను, బాధ్యతను చాటుకున్నాడు. ‘మీరు అసూయ పడుతూనే ఉండండి..’ అంటూ విమర్శలకు చెంపపెట్టు సమాధానమిచ్చాడు. ఇటీవల తన భార్య హసీన్ జహాన్, కుమార్తె అయిరా షమీతో కలిసి తీయించుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో ఉంచడంతో వివాదం మొదలైంది.

Pages