S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/17/2016 - 01:15

రియో డి జెనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు ఘోరంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు. ఈ పోటీల్లో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఆసియా క్రీడల మాజీ పసిడి పతక విజేత వికాస్ కృష్ణన్ (75 కిలోలు) క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన రెండో సీడ్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజియెవ్ చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు.

08/17/2016 - 01:13

రియో డి జనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో వరస వైఫల్యాలతోఅల్లాడిపోతున్న భారత్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతేకాదు, అతని భవిష్యత్తు సైతం ప్రశ్నార్థకంగా మారింది.

08/17/2016 - 01:12

రియో డి జెనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించడంలో భారత డిస్కస్ త్రోవర్ సీమా అంటిల్ పునియా (33) విఫలమైంది. మంగళవారం ఇక్కడి ఒలింపిక్ స్టేడియంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల నడుమ జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ పోటీల్లో కేవలం 57.58 మీటర్ల దూరం మాత్రమే డిస్కస్‌ను విసిరి 20వ స్థానంతో సరిపెట్టుకున్న ఆమె ఈ పోటీల నుంచి నిష్క్రమించింది.

08/17/2016 - 01:10

రియో డి జెనిరో, ఆగస్టు 16: ప్రస్తుతం రియో డి జెనిరోలో ఉన్న భారత ఒలింపిక్ క్రీడా బృందంలోని కొంత మంది సభ్యులు సోమవారం తిండి లేక నానా తిప్పలు పడ్డారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరైనప్పుడు వారికి ఈ పరిస్థితి ఎదురైంది. ఈ వేడుకల సందర్భంగా అక్కడి అధికారులు కేవలం వేరుశెనగ పప్పులు పంచి చేతులు దులుపుకోవడంతో భోజనం లేక క్రీడాకారులు ఆకలితో అలమటించారు.

08/17/2016 - 01:08

రియో డి జెనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్ హర్‌దీప్ సింగ్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. మంగళవారం ఇక్కడ 98 కిలోల విభాగంలో టర్కీకి చెందిన ఇల్దెమ్ సెంక్‌తో జరిగిన ఓపెనింగ్ బౌట్‌లో అతను టెక్నికల్ పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఈ బౌట్‌లో హర్దీప్ సింగ్ (25) నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైనప్పటికీ టర్కీ రెజ్లర్ 2-1 తేడాతో విజయం సాధించాడు.

08/17/2016 - 01:07

రియో డి జనిరో, ఆగస్టు 16: కెన్యాకు చెందిన డేవిడ్ రుదిషా 800 మీటర్ల పరుగుపందెంలో సునాయాసంగా విజయం సాధించడం ద్వారా ఈ వినాగంలో తనకు ఎదురు లేదని చాటాడు. అంతేకాదు, 1964లో న్యూజిలాండ్‌కు చెందిన పీటర్ స్నెల్ తర్వాత ఈ విభాగంలో వరసగా రెండు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. ‘ఇంత పెద్ద పోటీలో గెలవడం గొప్పగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది.

08/16/2016 - 11:29

యో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సంచలన విజయం సాధించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోరులో సింధు 21-13, 15-21 తేడాతో ఝు యింగ్ ఓడించి క్వార్టర్స్ కు చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ ఝు యింగ్పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.

,
08/16/2016 - 01:30

రియో డి జెనీరో, ఆగస్టు 15: ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ మరోసారి సత్తా చాటాడు. రియో ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో టైటిల్ సాధించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న అతను రియోలోనే విజయభేరి మోగించి ‘స్ప్రింట్ హ్యాట్రిక్’ను పూర్తి చేశాడు. ఆరో లేన్‌లో పరిగెత్తిన బోల్ట్ లక్ష్యాన్ని 9.81 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు.

08/16/2016 - 01:33

రియో డి జెనీరో, ఆగస్టు 15: కొన్ని వేల మంది రియో ఒలింపిక్స్ అక్వాటిక్ స్టేడియంలో ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా టీవీల్లో వీక్షిస్తుండగా, చైనా డైవర్ హీ జీకి తన దేశానికే చెందిన కిన్ కాయ్ ప్రపోజ్ చేశాడు. మహిళల మడు మీటర్ల స్ప్రింగ్ బోర్డు విభాగంలో హీ జీ రజత పతకాన్ని గెల్చుకుంది. పోడియం వద్ద పతాకాన్ని స్వీకరించిన వెంటనే కిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ముందు మోకాలిపై కూర్చుకున్నాడు.

08/16/2016 - 01:33

రియో డి జెనీరో: మహిళల 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఫైనల్స్ చేరి సంచలనం సృష్టించిన లలితా బాబర్ టైటిల్ రేసులో విఫలమైంది. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో ఆమె రేస్‌ను 9 నిమిషాల 22.74 సెకన్లలో పూర్తి చేసి, పదో స్థానంలో నిలిచింది.

Pages