S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/16/2016 - 01:32

రియో డి జెనీరో, ఆగస్టు 15: భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ రియో ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. వందకుపైగా సభ్యులతో కూడిన భారత బృందం రియోలో వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్న తరుణంలో పతకంపై శ్రీకాంత్ ఆశలు రేపాడు. ప్రీ క్వార్టర్స్‌లో జాన్ ఒ జొర్గెనె్సన్‌ను ఢీకొన్న అతను 21-19, 21-19 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌లో లిన్ డాన్ (చైనా)తో పోరును ఖాయం చేసుకున్నాడు.

08/16/2016 - 01:32

రియో డి జెనీరో, ఆగస్టు 15: అథ్లెటిక్స్‌లో భారత్ ఫ్లాప్ షోకు తెరపడడం లేదు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో రెంజిత్ మహేశ్వరి, మహిళల 200 మీటర్ల పరుగులో శ్రావణి నందా ఫైనల్స్‌కు చేరుకోలేక నిష్క్రమించారు. రెంజిత్ అత్యుత్తమంగా 16.13 మీటర్ల దూరానికి దూకి, 38 మంది పోటీదారుల్లో 30వ స్థానంలో నిలిచాడు.

08/16/2016 - 01:34

రియో డి జెనీరో, ఆగస్టు 15: దక్షిణాఫ్రికా అథ్లెట్ వేడ్ వాన్ నీకెర్క్ పురుషుల 400 మీటర్ల పరుగులో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లక్ష్యాన్ని 43.03 సెకన్లలో చేరిన అతను 17 ఏళ్ల క్రితం నాటి రికార్డును తిరగరాశాడు. 1996 ఆగస్టు 26న స్పెయిన్‌లోని సెవిల్లేలో జరిగిన అథ్లెటిక్ మీట్‌లో 43.18 సెకన్లతో రికార్డును సృష్టించిన మైఖేల్ జాన్సన్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు.

08/16/2016 - 01:08

రియో డి జెనీరో, ఆగస్టు 15: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకున్న భారత అత్యుత్తమ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నాలుగేళ్ల తర్వాత టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించమే లక్ష్యంగా శ్రమిస్తానని అన్నది. ఆదివారం జరిగిన మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో దీప కేవలం 0.15 పాయింట్ తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకొని, నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

08/16/2016 - 01:35

రియో డి జెనీరో: బ్రిటిష్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఒలింపిక్స్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను 7-5, 4-6, 6-2, 7-5 తేడాతో ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణాన్ని సాధించిన అతను వరుసగా రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన తొలి టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు.

08/15/2016 - 07:43

రియో డి జెనీరో, ఆగస్టు 14: బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. స్వీడన్‌కు చెందిన హెన్రీ హర్స్‌కైనెన్‌ను అతను 21-6, 21-15 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. అంతకు ముందు మొదటి రౌండ్‌లో అతను లినో మునొజ్ (మెక్సికో)పై 21-11, 21-17 ఆధిక్యంతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

08/15/2016 - 07:41

రియో డి జెనీరో, ఆగస్టు 14: అమెరికా స్విమ్మింగ్ సూపర్ స్టార్ మైఖేల్ ఫెల్ప్స్ కెరీర్‌లో 23వ స్వర్ణ పతకాన్ని సాధించి, ఈ మెగా ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పాడు. పురుషుల 4న100మీటర్ల మెడ్లే రిలేలో ర్యాన్ మర్ఫీ, కొడీ మిల్లర్, ఫెల్ప్స్, నాథన్ ఆడ్రియన్ సభ్యులుగా ఉన్న అమెరికా జట్టు లక్ష్యాన్ని 3 నిమిషాల 27.95 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది సరికొత్త ఒలింపిక్ రికార్డు.

08/15/2016 - 07:40

రియో డి జెనీరో, ఆగస్టు 14: భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. 36 సంవత్సరాల విరామం తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీ ఫైనల్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంతో తలపడిన భారత్‌కు ఆకాశ్‌దీప్ సింగ్ ఆరంభంలోనే గోల్‌ను సాధించిపెట్టాడు. అయతే, ఆ ఆధిక్యాన్ని శ్రీజేష్ నాయకత్వంలోని భారత జట్టు నిలబెట్టుకోలేకపోయంది.

08/15/2016 - 07:39

గ్రాస్ ఐలెట్, ఆగస్టు 14: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ని 237 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న భారత క్రికెట్ జట్టు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. దీనితో చివరిదైన నాలుగో టెస్టు నామమాత్రంగా మారింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 129.4 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ 118, వృద్ధిమాన్ సాహా 104 పరుగులతో రాణించారు.

08/15/2016 - 07:39

రియో డి జెనీరో, ఆగస్టు 14: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రియో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం నాటి గ్రూప్ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 61వ ర్యాంక్ క్రీడాకారిణి మరిజా ఉలిటినాను ఢీకొన్న సైనా 18-31, 19-21 తేడాతో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో హైదరాబాదీ సైనా టైటిల్ రేసులో అందరి కంటే ముందు ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ, ఆమె పేలవమైన ఆటతో ఇంటిదారి పట్టింది.

Pages