S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/26/2016 - 05:35

న్యూఢిల్లీ, జూలై 25: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్ క్రీడలకు ముందు దేశంలో ‘ఒలింపిక్ వేడి’ని రగిల్చేందుకు ‘రన్ ఫర్ రియో’ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31వ తేదీన న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఈ ఈవెంట్‌ను ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు.

07/26/2016 - 05:44

న్యూఢిల్లీ, జూలై 25: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను డోపింగ్ కుంభకోణం చుట్టుముట్టడం ‘దురదృష్టకరమని’ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అతని సహచర రెజ్లర్ సుశీల్ కుమార్ సోమవారం ఆవేదన వ్యక్తం చేశాడు. సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన విషయం విదితమే.

07/25/2016 - 07:34

న్యూఢిల్లీ, జూలై 24: అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ఆధ్వర్యాన పోలెండ్‌లోని బిడ్గోస్క్‌లో జరుగుతున్న అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో హర్యానాకు చెందిన రైజింగ్ అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించాడు. అద్భుత ప్రదర్శనతో 86.48 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

07/25/2016 - 07:32

న్యూఢిల్లీ, జూలై 24: రియో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత క్రీడా బృందానికి ఆదివారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పక్కకు నెట్టి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతనిపై ప్రాథమిక సస్పెన్షన్ విధించారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

07/25/2016 - 07:32

రియో డి జనిరో,జూలై 24: రియో ఒలింపిక్స్ మరో 15 రోజుల్లో ప్రారంభమవుతుండగా ఆదివారం అథ్లెటిక్ విలేజ్ అధికారికంగా ప్రారంభమయింది. దీంతో ఒలింపిక్సలో పాల్గొనే 10 వేలకు పైగా అథ్లెట్లు, మరో 7 వేల మంది అధికారులు ఈ విలేజ్‌లోకి ప్రవేశించడం మొదలవుతుంది. వచ్చే నెల 5న గేమ్స్ ప్రారంభమయ్యే దాకా అథ్లెట్ల రాకడ కొనసాగుతూనే ఉంటుంది.

07/25/2016 - 07:31

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 24: టీమిండియాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు భారీ ఓటమి దిశగా పయనిస్తోంది.

07/25/2016 - 07:30

ముంబయి, జూలై 24: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బిసిసిఐ) దాని అనుబంధ సంగాల్లో సమూల మార్పులను తీసుక రావాలంటూ జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఏ) ఆదివారం యథాతథంగా ఆమోదించింది. దీంతో ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్ష పదవినుంచి శరద్ పవార్ తప్పుకోవలసి ఉంటుంది. పవార్ బిసిసిఐ అధ్యక్షుడిగా, ఐసిసి అధ్యక్షుడిగా కూడా పని చేసిన విషయం తెలిసిందే.

07/25/2016 - 07:29

న్యూఢిల్లీ, జూలై 24: అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న రైజింగ్ అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రాకు వైల్డ్‌కార్డు ద్వారా వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభయమ్యే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పించే విషయాన్ని పరిశీలించాలని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) ఆదివారం అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్)కు విజ్ఞప్తి చేసింది.

07/24/2016 - 16:43

ముంబయి: జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సులపై సుప్రీం కోర్టు తీర్పును ఏకగీవ్రంగా ఆమోదించినట్లు ముంబయి క్రికెట్‌ సంఘం ( ఎంసీఏ) అధ్యక్షుడు శరద్‌పవార్‌ ఆదివారం చెప్పారు. క్రికెట్‌ పరిపాలనా రాజ్యాంగాన్ని మార్పులు చేసి తిరిగి రాసుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ఎంసీఏ అధ్యక్షుడు శరద్‌పవార్‌ నేతృత్వంలో ఆ సంఘం ఆదివారం సమావేశమైంది.

07/24/2016 - 05:51

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 23: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ దుమ్ము రేపాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడి కరీబియన్ల వెన్ను విరిచాడు. అతని జోరును ప్రతిఘటించడంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు.

Pages