S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/14/2016 - 06:47

సిడ్నీ, జనవరి 13: సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలిసి ఆడుతున్న భారత స్టార్ సానియా మీర్జా సెమీ ఫైనల్స్ చేరింది. అంతేగాక, వరుసగా 28వ విజయాన్ని నమోదు చేసి, 22 సంవత్సరాల క్రితం నాటి రికార్డును సమం చేసింది. సానియా, హింగిస్ జోడీ క్వార్టర్ ఫైనల్‌లో 6-2, 6-3 తేడాతో చైనాకుచెందిన చెన్ లియాంగ్, షుయ్ పెంగ్ జోడీపై సునాయాసంగా గెలిచింది.

01/14/2016 - 06:47

బ్రిస్బేన్, జనవరి 13: ఇటీవల దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మంగళవారం ఆసీస్‌తో జరిగిన మొదటి వనే్డలో విఫలం కావడం టీమిండియా కెప్టెన్‌ను వేధిస్తున్నట్టు సమాచారం. స్వదేశంలో చెలరేగిపోయే వీరిద్దరూ విదేశాల్లో ఎందుకు విఫలమవుతున్నారో అర్థంగాక ధోనీ ఆందోళన పడుతున్నాడు.

01/13/2016 - 07:50

* వనే్డ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒకే మ్యాచ్‌లో రెండు వందలకు మించి భాగస్వామ్యాలు రెండు నమోదయ్యాయి. తొలుత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 207 పరుగులు జోడించారు. అనంతరం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవెన్ స్మిత్, జార్జి బెయిలీ 242 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

01/13/2016 - 07:48

పెర్త్, జనవరి 12: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. ఇక్కడ వకా మైదానంలో మంగళవారం జరిగిన మొదటి వనే్డని ఐదు వికెట్ల తేడాతో కైవసం చేసుకొని, సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ వీరవిహారం చేసి సాధించిన అజేయ సెంచరీ వృథాకాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జార్జి బెయిలీ శతకాలతో కదంతొక్కి జట్టును విజయపథంలో నడిపించారు.

01/13/2016 - 07:48

వెల్లింగ్టన్, జనవరి 12: న్యూజిలాండ్ కరెన్సీ లేకపోవడం పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షహీద్ అఫ్రిదీని కష్టాల్లోకి నెట్టింది. జేబుల్లో అమెరికా డాలర్లు ఉన్నప్పటికీ, కివీస్ స్థానిక కరెన్సీలోకి మార్చుకోకుండానే అఫ్రిదీ అతని సహచర ఆటగాడు అహ్మద్ షెజాద్ వెల్లింగ్టన్ విమానాశ్రయంలోని ఒక రెస్టారెంట్‌లోకి వెళ్లారు. తీరా బిల్లు చెల్లించే సమయంలో యుఎస్ డాలర్లు ఇవ్వబోతే, రెస్టారెంటు సిబ్బంది వాటిని తీసుకోలేదు.

01/13/2016 - 07:47

సిడ్నీ, జనవరి 12: ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ జోడీ సానియా మీర్జా, మార్టినా హింగిస్ తమ విజయపరంపరను కొనసాగిస్తున్నారు. ఇటీవలే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో టైటిల్ సాధించిన వీరు మంగళవారం ఇక్కడ ప్రారంభమైన సిడ్నీ ఇంటర్నేషనల్ మొదటి రౌండ్‌లో అనస్తాషియా రొడియోనొవా, అరినా రొడియోనొవా జోడీని 6-7, 6-3, 10-8 తేడాతో ఓడించి శుభారంభం చేశారు. అంతేగాక, తమ వరుస విజయాల సంఖ్యను 27కు పెంచుకున్నారు.

01/13/2016 - 07:47

బ్రిస్బేన్, జనవరి 12: భారత్‌తో ఈనెల 15న ఇక్కడ జరిగే రెండో వనే్డ నుంచి మిచెల్ మార్ష్‌కు విశ్రాంతినివ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) నిర్ణయించింది. అతని స్థానంలో జాన్ హాస్టింగ్స్‌ను జట్టులోకి తీసుకోనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కాలంలో మార్ష్ అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతున్నాడని, అతనికి విశ్రాంతినివ్వడం అత్యవసరమని పేర్కొంది.

01/13/2016 - 07:46

పెర్త్, జనవరి 12: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం వాకా స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌తో మొత్తం ముగ్గురు క్రికెటర్లు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేశారు. వీరిలో ఇద్దరు ఆస్ట్రేలియన్లుకాగా, ఒకరు భారత ఆటగాడు. ఒకేసారి వనే్డ కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముగ్గురు బౌలర్లలో బరీందర్ శరణ్ సఫలంకాగా, స్కాట్ బోలాండ్, జోల్ పారిస్ దారుణంగా విఫలమయ్యారు.

01/13/2016 - 07:45

కరాచీ, జనవరి 12: స్పాట్ ఫిక్సింగ్‌లో ముద్దాయిగా తేలడంతో జైలు శిక్షతోపాటు సస్పెన్షన్ వేటును కూడా ఎదుర్కొన్న మహమ్మద్ అమీర్‌కు మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కడంపై పాకిస్తాన్ జాతీయ కోచ్, మాజీ పేసర్ వకార్ యూనిస్ సంతోషం వ్యక్తం చేశాడు.

01/12/2016 - 07:31

పెర్త్, జనవరి 11: పెర్త్‌లోని వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం (వకా) మైదానం హోరాహోరీ పోరాటానికి వేదిక కానుంది. బలమైన జట్లు భారత్, ఆస్ట్రేలియా మంగళవారం నాటి మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌కు సిద్ధంకాగా, ఫలితం ఎలావున్నా పోరు తీవ్ర స్థాయిలో సాగుతుందనేది వాస్తవం. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియాకు గత ఏడాది అచ్చిరాలేదు.

Pages