S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/08/2016 - 08:14

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌ల్లో ఇదొకటి. మెల్బోర్న్ మైదానంలో, 2000 జనవరి 12న జరిగిన ఈ వనే్డలో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ శతకం వృథా అయింది. భారత అభిమానులు ఆగ్రహించి, మైదానంలోకి సీసాలు, ఇతర వస్తువులను విసిరి గందరగోళం సృష్టించడంతో 17 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది.

01/08/2016 - 08:13

వౌంట్ మంగనుయ్ (న్యూజిలాండ్), జనవరి 7: శ్రీలంకతో గురువారం జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌ని మూడు పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లకు 179 పరుగులు చేయగలిగింది.

01/08/2016 - 08:13

చివరి క్షణాల్లో గందరగోళపడితే, గెలిచే మ్యాచ్‌లను కూడా ఏ విధంగా కోల్పోతారన్నది ఆస్ట్రేలియాతో 2004 జనవరి 9న జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో భారత్ నిరూపించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రూ సైమండ్స్ 88, మైఖేల్ క్లార్క్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కెప్టెన్ గంగూలీ అండగా నిలిచాడు.

01/08/2016 - 08:12

చివరి వరకూ ఉత్కంఠ రేపిన పోరు 1992 వరల్డ్ కప్‌లో భాగంగా మే ఒకటిన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్‌లోని గబ్బా స్టేడియంలో జరిగింది. నరాలు తెగిపోయే ఉత్కంఠ మధ్య సాగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం ఒక పరుగు తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 47 ఓవర్లకు కుదించడం భారత్ విజయాన్ని దెబ్బకొట్టింది.

01/08/2016 - 08:12

మెల్బోర్న్, జనవరి 7: ఫెయిర్‌ఫాక్స్ మీడియాపై పరువునష్టం దావా వేయడానికి వెస్టిండీస్ సూపర్ క్రికెటర్ క్రిస్ గేల్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రముఖ న్యాయవాదిని అతను సంప్రదించినట్టు తెలుస్తున్నది.

01/08/2016 - 08:11

న్యూఢిల్లీ, జనవరి 7: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఫైనల్‌కు రాంచీ ఆతిథ్యమిస్తుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌ని కూడా అక్కడే నిర్వహించనున్నట్టు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 20న సెమీ ఫైనల్స్, 21న ఫైనల్ మ్యాచ్‌లను బిర్సా ముండా స్టేడియంలో జరపనున్నట్టు టోర్నీ షెడ్యూల్‌తోపాటు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని ఆరు వేరువేరు కేంద్రాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి.

01/07/2016 - 05:59

న్యూఢిల్లీ, జనవరి 6: స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రీలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకునే క్రమంలో భారత ఏస్ షూటర్ అపూర్వీ చండీలా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అపూర్వీ 211.2 పాయింట్లు సంపాదించి, స్వర్ణ పతకాన్ని అందుకుంది. అంతేగాక, 211 పాయింట్లతో ఇ సిలింగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు చేసింది.

01/07/2016 - 05:57

న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలోని వివిధ క్రీడా సంఘాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిందని భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డిడిసిఎ)లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

01/07/2016 - 05:56

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవూమా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను సెంచరీ సాధించి, అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున శతకాన్ని చేసిన తొలి నల్లజాతీయుడిగా అతని పేరు చరిత్ర పుటల్లో చేరింది.

01/07/2016 - 05:55

ముంబయి, జనవరి 6: క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన కెసి గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆటగాడు ప్రణవ్ ధన్‌వాదేకు ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ఐదేళ్లపాటు అతనికి నెలకు 10,000 రూపాయలు చొప్పున స్కాలర్‌షిప్‌ను ఎంసిఎ అధ్యక్షుడు శరద్ పవార్ మంజూరు చేశారు.

Pages