S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/18/2017 - 03:02

హైదరాబాద్, జూలై 17: గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి ఈ నెల 30న జరగాల్సిన ప్రాథమిక పరీక్షపై హైకోర్టు సోమవారం నాడు స్టే విధించింది. రాష్టవ్య్రాప్తంగా మహిళా డిగ్రీ గురుకులాల్లో 546 లెక్చరర్ పోస్టుల నియామకం కోసం జూన్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కేవలం మహిళలు మాత్రమే అర్హులని ప్రకటనలో కమిషన్ పేర్కొంది.

07/18/2017 - 03:02

మహబూబాబాద్, జూలై 17: మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం రోడ్డుపై నడుచుకుకుంటూ వెళుతున్న ఒక యువతిని ఇద్దరు యువకులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. యువతి దుస్తులు చించి, అకారణంగా దాడి చేసిన సంఘటన ఇక్కడ సంచలనం రేకెత్తించింది.

07/18/2017 - 02:37

హైదరాబాద్ (జీడిమెట్ల), జూలై 17: ఓ యువతి పై యాసిడ్ దాడికి పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దత్తాత్రేయ నగర్‌లో నివాసముండే ఖబీర బేగం (22), సుభాష్‌నగర్‌లో నివాసముండే ప్రదీప్ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో పనిచేస్తారు.

07/18/2017 - 02:33

హైదరాబాద్, జూలై 17: రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్ధి రామనాధ్ కోవింద్ భారీ మెజారిటీతో గెలుస్తారని బిజెఎల్పీ నేత జి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. రాష్టప్రతి ఎన్నిక అనంతరం వారు వేర్వేరుగా మాట్లాడుతూ రాష్టప్రతి ఎన్నికల్లో అన్ని వర్గాలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయని అన్నారు.

07/18/2017 - 02:32

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్‌ను అరెస్టు చేయడాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం, బైలాంపూర్ గ్రామంలో కొండ పోచమ్మ జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో టిజెఎస్‌సి చైర్మన్ కోదండరామ్ సోమవారం సమావేశమైనప్పుడు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

07/18/2017 - 02:31

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ లిటరసీ (డిజిథాన్) కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిఐటిఏ) దక్షిణాఫ్రికా చాప్టర్ ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని జోహనె్నస్‌బర్గ్ వెళ్లిన తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను కలిసిన టిఐటిఏ దక్షిణాఫ్రికా చాప్టర్ ప్రతినిధులు డిజిథాన్‌కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

07/18/2017 - 02:31

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అందువల్ల ఈ పనులపై జిఎస్‌టి వేయవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. జిఎస్‌టి అమలు-తీరుతెన్నులపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

07/18/2017 - 01:03

హైదరాబాద్/ఖైరతాబాద్, జూలై 17: బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతం అయి ఉన్నా వర్షం మాత్రం చిరుజల్లులతో సరిపెట్టుకుంది. కాగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. భారీ వర్షం కారణంగా నగరంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

07/18/2017 - 00:57

హైదరాబాద్, జూలై 17: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలంటే (కెజిబివిలు) తనకు చాలా ఇష్టమని, ఇక్కడ తల్లిదండ్రులు లేనివారు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే ఉన్నవారు, కడు పేద కుటుంబాల పిల్లలు చదువుతున్నారని, వీరికి మించి విద్య వసతులు కల్పించేందుకు కేంద్రం వల్ల తాను ప్రతి సారీ కొట్లాడుతున్నానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.

07/18/2017 - 00:57

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంజార్జి) వైకె రెడ్డి తెలిపారు.

Pages