S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/19/2017 - 03:39

హైదరాబాద్, జూలై 18: మహబూబాబాద్ జిల్లా మహిళా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని టి.టిడిపి మహిళా విభాగం నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నంను కోరారు.

07/19/2017 - 03:38

హైదరాబాద్, జూలై 18: వనపర్తి జిల్లాలోని శంకర సముద్రం ప్రాజెక్టు, శ్రీ రంగపురం రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్‌ల కింద ముంపునకు గురవుతున్న నిర్వాసితులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మూడు లేఖలు రాశారు.

07/18/2017 - 03:16

చౌటుప్పల్, జూలై 17: బెల్జియం దేశానికి చెందిన ఫార్శితెర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం దండుమల్కాపురం శివారులోని వెబ్బర్ చైల్డ్ హోం భవన సముదాయానికి శ్రమదానంతో రంగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటారు.

07/18/2017 - 03:14

వరంగల్, జూలై 17: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో...లేదో తెలియదు కానీ, మంత్రాలకు మంత్రిపదవి వస్తుందని నమ్మి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పూజల పేరిట మాయగాళ్లకు 57 లక్షల భారీమొత్తం డబ్బు ముట్టచెప్పిన సంఘటనలో నిందితుల నుంచి ఆ మొత్తాన్ని పోలీసులు రికవరీ చేస్తున్నారు.

07/18/2017 - 03:11

గజ్వేల్, ములుగు, జూలై 17: కొండపోచమ్మ రిజర్వాయర్ ముంపు బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రాజకీయ జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరాంను సోమవారం సిద్దిపేట జిల్లా బహిళింపూర్‌లో పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసు వాహనాలను భూ నిర్వాసితులు అడ్డుకొని ధర్నాకు దిగడంతోపాటు వాహనాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.

07/18/2017 - 03:08

గజ్వేల్, ములుగు, జూలై 17: ప్రాజెక్టుల నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదని, 2013 జీఓ సవరణ ప్రకారమే ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలన్నదే తమ డిమాండ్ అని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా బహిళింపూర్‌లో ముంపు బాధితులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడారు.

07/18/2017 - 03:08

మహబూబాబాద్, జూలై 17: బోనాల పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించడంతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా ఆమ్రపాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా దంపతులు మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం గుట్టలో ఆటవిడుపు చేసారు. సోమవారం జిల్లాలో ఒకవైపు ముసురు పడుతుండగా ఇద్దరు మహిళా కలెక్టర్లు కాలినడకన దాదాపు 12 కిలోమీటర్ల మేర గుట్టల్లో ప్రయాణించారు.

07/18/2017 - 03:05

మానవపాడు, జూలై 17: పాడి పశువులు భారమయ్యాయి. వ్యవసాయం బరువైంది. ఊరిస్తున్న ఖరీఫ్ రైతులను నిలవనీయడం లేదు. అప్పులు అధికమైనా అన్నదాత సాగును వీడటం లేదు. ప్రకృతి కనికరిస్తుందో లేదో తెలియదు.

07/18/2017 - 03:03

నల్లగొండ, జూలై 17: వర్షాలు లేక నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకు మరింత లోతుకు పడిపోతుండటంతో హైద్రాబాద్, నల్లగొండ జిల్లాలకు కృష్ణా మంచినీటి సరఫరా సమస్యలను అధిగమించేందుకు హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఇరిగేషన్ శాఖలు మరో భగీరథ ప్రయత్నం ఆరంభించాయి.

07/18/2017 - 03:03

హైదరాబాద్, జూలై 17: గత రెండు దశాబ్దాల కాలంలో మావోయిస్టుల హింసాకాండకు 12వేల మంది బలయ్యారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2,700 మంది భద్రతా సిబ్బంది, 9,300 మంది సామాన్యులను ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హతమార్చినట్టు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి. అయితే గత మూడేళ్లలో మావోల హింస 25 శాతం తగ్గింది. 2011-14తో పోలిస్తే..

Pages