S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/06/2016 - 07:57

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఐదో విడత కౌనె్సలింగ్ గురువారం నాడు జరగనుంది. నాలుగో విడతలో ఎంబిబిఎస్, బిడిఎస్ వైద్య కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు బుధవారం సాయంత్రం మూడు గంటల లోపు చేరాల్సి ఉండగా, కొంత మంది రిపోర్టు చేయలేదని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

10/06/2016 - 07:47

హైదరాబాద్, అక్టోబర్ 5: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణలో పోలీస్ శాఖ కూడా పునర్వ్యవస్థీకరణ కావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. కొత్తగా వచ్చే జిల్లాలు, డివిజన్లు, మండలాల ఆధారంగా పోలీస్ శాఖ కూడా తమ కార్యాలయాలను దసరా రోజునే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

10/06/2016 - 07:46

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణలో ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలకు అదనంగా తాజాగా ప్రకటించిన నాలుగు జిల్లాలపై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ బుధవారం కూడా కసరత్తు చేసింది. రెండు రోజులుగా కేశవరావు నివాసంలో కొనసాగుతున్న కసరత్తులో కొత్తగా ప్రకటించిన గద్వాల, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల పరిధి, వీటిలో చేర్చాల్సిన మండలాలపైనే హైపవర్ కమిటీ దృష్టి కేంద్రీకరించింది.

10/06/2016 - 07:45

హైదరాబాద్, అక్టోబర్ 5: జిల్లాల పునర్ విభజన వల్ల మూడు ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి కె తారకరామారావు అన్నారు. ఒకటి ప్రజలకు పరిపాలనా సౌలభ్యం, రెండు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదుగుదల, మూడు ఆధిపత్యానికి చెక్ అని మంత్రి అభిప్రాయపడ్డారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ హైపవర్ కమిటీ చైర్మన్ కె కేశవరావును కలిసి మంత్రి కెటిఆర్ వినతిపత్రం సమర్పించారు.

10/06/2016 - 07:44

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సహకార సంఘాల సమాఖ్య (హౌస్‌ఫెడ్)కు చైర్మన్‌గా కె. నవనీత రావు ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిజిస్ట్రార్ పర్యవేక్షణలో సమాఖ్యకు జరిగిన ఎన్నికల్లో ఏడుగురు పాలక సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో నుంచి టి. నవనీతరావును (హైదరాబాద్) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

10/06/2016 - 07:43

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణలో బిజెపి బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 6, 7 తేదీల్లో సమావేశం కానుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని అన్నపూర్ణ గార్డెన్స్‌లో జరిగే ఈ సమావేశాలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ హయర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సమావేశాల్లో కార్యాచరణ రూపొందించనున్నారు.

10/06/2016 - 07:48

హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా 33 జిల్లాలను ఏర్పాటు చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. ఒక వేళ 31 జిల్లాలకే పరిమితమైతే రెండవ స్థానంలో ఉంటుంది. తమిళనాడులో 32 జిల్లాలు ఉన్నాయి. కర్నాటకలో 30 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 13, కేరళలో 14 జిల్లాలు ఉన్నాయి.

10/06/2016 - 06:56

హైదరాబాద్, అక్టోబర్ 5: డ్రగ్స్ కేసులో మరో నిందితుడిగా ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డిని ఎన్‌సిబి బుధవారం అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ డ్రగ్స్ ముఠాకు సహకరిస్తున్నాడన్న అభియోగాలపై నాందేడ్ వెళ్తుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న అభియోగంపై బెంగుళూరు సైంటిస్టు వెంకటరమణ, అతని భార్య సహా రవిశంకర్‌రావును ఎన్‌సిబి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

10/06/2016 - 06:51

హైదరాబాద్, అక్టోబర్ 5: ముసాయిదాలో ప్రతిపాదించిన 17 కొత్త జిల్లాలు, హైపవర్ కమిటీ పరిశీలనలోని 4 జిల్లాలు వినా మరో ఆలోచన లేదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తుది నోటిఫికేషనూ దీనికి లోబడే ఉంటుందన్నారు. హైపవర్ కమిటీ చైర్మన్, ఎంపి కేశవరావు బుధవారం రాత్రి సిఎంని కలిసి తాము అధ్యయం చేసిన సిరిసిల్ల, జనగామ, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాలపై సేకరించిన సమాచారాన్ని వివరించారు.

10/06/2016 - 06:50

హైదరాబాద్, అక్టోబర్ 5: జిల్లాల పునర్విభజన తుది అంకానికి చేరుకుంది. ముసాయిదాలో ప్రకటించిన జిల్లాతోపాటు ప్రజా విజ్ఞప్తుల మేరకు మరో నాలుగు జిల్లాలు చేర్చి, తుది ముసాయిదా జారీకి రంగం సిద్ధమైంది. ఈలోగా శుక్రవారం సిఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశమై జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనకు ఆమోదం తెలపనుంది. జిల్లాల పునర్విభజనపై సిఎం కెసిఆర్ బుధవారం కూడా కసరత్తు జరిపారు.

Pages