S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/09/2016 - 16:41

హైదరాబాద్‌ : పుప్పాలగూడ అల్కాపురిలోని గ్యాంగ్‌స్టర్‌ నయీం నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో పోలీసులు అరెస్టు చేసిన నయీం మహిళా అనుచరులు ఫరా, హర్షాలకు రాజేంద్రనగర్‌ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఫరా, హర్షాలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

08/09/2016 - 16:37

మెదక్: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేపు చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు మెదక్ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం కుట్ర పన్ని తన దీక్ష ఆపాలని చూస్తోందని, అయనప్పటికీ తాను దీక్ష చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

08/09/2016 - 17:52

నల్గొండ : ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

08/09/2016 - 16:18

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. న్యాయస్థానం నయీం ఇద్దరు అనుచరులను 10 రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

08/09/2016 - 14:53

మెదక్‌ : మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ సంగారెడ్డిలో బుధవారం నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. గ్రామాలను సందర్శించే నేతలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, లాఠీ ఝళిపించడం సరికాదన్నారు. పోలీసుల జులుంతో నిర్వాసిత గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొందని ఆరోపించారు.

08/09/2016 - 14:43

నల్గొండ : ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ మృతదేహాన్ని నల్గొండ జిల్లా భువనగిరికి మంగళవారం తరలించారు. నయీమ్ మేనకోడలు షాజిదా బేగం, బావ సలీం షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి వచ్చి మృతదేహాన్ని భువనగిరికి తీసుకువెళ్లారు. భువనగిరిలో నయీమ్ అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

08/09/2016 - 14:41

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాల కోసం నిర్మించిన ఘాట్లు నాసిరకంగా ఉన్నాయని, పుష్కరాల పేరుతో టీఆర్‌ఎస్‌ నేతలు జేబులు నింపుకొనే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేత డీకే అరుణ ఆరోపించారు. పుష్కరాల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సీఎం అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని తెలిపారు.

08/09/2016 - 13:06

హైదరాబాద్‌: భూసేకరణ జీవో 123ను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ జీవో 123 రద్దు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

08/09/2016 - 13:02

నల్గొండ : గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఐదుగురుని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలో ఎంపీపీ తోటకూర వెంకటేశ్‌ యాదవ్‌ను, మున్సిపల్‌ కౌన్సిలర్‌ నాజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

08/09/2016 - 12:26

హైదరాబాద్ : ప్రతి థియేటర్‌లో ఐదో షోగా చిన్న సినిమాను ఆడించాలని, చిన్న చిత్రాలకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందజేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. సినిమారంగంపై అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. నంది అవార్డుల పేరు మార్చి త్వరలో ప్రకటిస్తామని, 200 సీట్ల కెపాసిటీతో మినీ థియేటర్లు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Pages