S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/08/2016 - 07:52

హైదరాబాద్, ఆగస్టు 7: ‘మోదీతో మనం... మహా సమ్మేళనం’ పేరిట బిజెపి ఆదివారం ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో గోషామహల్ నియోజకవర్గం ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రజల మధ్యనే కూర్చోవాల్సి వచ్చింది. బిజెపికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా, రాజా సింగ్ తప్ప మిగతా నలుగురూ వేదికపై ఆసీనులయ్యారు. రాజా సింగ్ సభా ప్రాంగణానికి రావడంతోనే కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

08/08/2016 - 07:52

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణలో బిజెపిపై భ్రమలు తొలిగిపోయాయని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బిజెపియేనని పలువురు తెలంగాణ బిజెపి నాయకులు స్పష్టం చేశారు. ఎల్‌బి స్టేడియంలో ఆదివారం జరిగిన బిజెపి మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోడీ హాజరు కావడానికి ముందు ప్రసంగించిన పలువురు బిజెపి నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

08/08/2016 - 07:46

సంగారెడ్డి, ఆగస్టు 7: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు రావడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడే పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ట్‌స్టేషన్‌లకు తరలించారు. మల్లన్నసాగర్ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తెస్తామని ముందుగానే ప్రకటించిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు నిఘా పెట్టారు.

08/08/2016 - 07:19

తెలంగాణకు కేంద్రం వెన్నుదన్ను తగాదాలుపడే కాలానికి చెల్లుచీటీ మీ హైదరాబాద్‌లాగే.. ఢిల్లీనీ చూడండి
కొత్త రాష్ట్రంలో పురోగతి పరుగు అభివృద్ధిపై సిఎం కెసిఆర్‌ది అంకితభావం రాష్ట్రాల మధ్య పోటీతోనే దేశ వికాసం
విద్యుత్, ఎరువుల కొరత లేకుండా చేశాం నీటి బొట్టు నిలిపితే.. మట్టి బంగారమే భగీరథ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

08/08/2016 - 07:16

హైదరాబాద్, ఆగస్టు 7: ‘అన్ని వేల కోట్లు కావాలి, ఇన్ని వేల కోట్లు కావాలని అడగటం లేదు.మీ (ప్రధాని) ప్రేమ, ఆశ్వీర్వాదం ఉంటే చాలు వాటంతకు అవే వస్తాయన్న అవగాహన కలిగిన వ్యక్తిని’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు.

08/08/2016 - 07:14

హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఫార్మా కాలేజీల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) రంజీవ్ ఆర్ ఆచార్య పేరుతో ఈ ఉత్తర్వులు ఆదివారం జారీ అయ్యాయి. ‘బి.్ఫర్మసీ’ (ప్రైవేట్ అన్-ఎయిడెడ్) కాలేజీల్లో ఫీజులు 35 వేల నుండి 40 వేల రూపాయలుగా ఉండేలా నిర్ణయించారు.

08/08/2016 - 06:58

హైదరాబాద్, ఆగస్టు 7: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రాక సందర్భంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన పర్యటన, ప్రసంగం ఒకింత నిరాశనే మిగిల్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలతోపాటు బిజెపి నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ ప్రధాని పాల్గొన్నారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన బిజెపి మహా సమ్మేళన్‌కు భారీయెత్తున పార్టీకి చెందిన శ్రేణులు తరలివచ్చాయి.

08/07/2016 - 03:33

హైదరాబాద్, ఆగస్టు 6: నల్సార్ విశ్వవిద్యాలయ 14వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి శనివారం సతీసమేతంగా బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కెసిఆర్‌ను కలిశారు.

08/07/2016 - 03:28

హైదరాబాద్, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతి వేడుకలను శనివారం రాష్టమ్రంతటా ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ భవన్‌లో జయశంకర్‌కు నివాళులర్పించారు. జయశంకర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో అన్ని జిల్లాల్లో మంత్రులు ఆయన విగ్రహాలకు, చిత్ర పటాలకు నివాళులర్పించారు.

08/07/2016 - 03:07

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణ జల వనరులకు సంబంధించిన ప్రతి సమాచారం ప్రజల ముందుంచడానికే ఇస్రోతో అవగాహన కుదుర్చుకున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఇదొక చారిత్రక ఘట్టమన్నారు. తెలంగాణ జల వనరుల సమాచారం క్రోడీకరణకు ఒప్పందం ఉపయుక్తమన్నారు. శనివారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ, ఇస్రోల మధ్య ఒప్పందం కుదిరింది.

Pages