S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/18/2018 - 02:30

హైదరాబాద్, మే 17: తెలంగాణా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు.

05/18/2018 - 02:29

హైదరాబాద్, మే 17: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి అండదండగా ఉన్న ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి, ఉద్యోగ సంఘం నేతల తీరును ఎండగట్టారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ముందు కేసీఆర్ ఈ మాట అని ఉంటే బాగుండేదని అన్నారు.

05/18/2018 - 02:26

హైదరాబాద్, మే 17: ఆర్టీసీ కార్మిక నాయకులను ఉద్ధేశించి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా అంటూ ముఖ్యమంత్రి బెదిరింపుగా మాట్లాడటం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలా విస్మరించారని ఆయన ప్రశ్నించారు.

05/18/2018 - 02:25

హైదరాబాద్, మే 17: ఇజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వాణిజ్య, వ్యాపార వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సంబంధిత అధికారులను ఆదేశించారు.

05/18/2018 - 02:23

హైదరాబాద్, మే 17: వేసవిలో వణ్యప్రాణుల సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మండుటెండలో దట్టమైన అడవిలోని కుంటల్లోని నీరు సైతం ఆవిరై పోతుండటంతో మూగ జీవాలు నీటి కోసం అల్లాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వేసవిలో అడవి పలుచబడుతుండటంతో ఆహార అనే్వషణతో పాటు నీటి కష్టాలతో క్రూర మృగాలను, సాదారణ జంతులు విలవిలలాడుతున్నాయి.

05/18/2018 - 00:00

హైదరాబాద్, మే 17: రష్యా దేశంలో మెడికల్ కోర్సులో ఉన్నత విద్యాభ్యాసానికి ఉన్న అవకాశాలపై హైదరాబాద్‌లో 21న సదస్సు నిర్వహిస్తున్నట్టు రష్యా ఫెడరల్ కాన్సులేట్‌లో వైస్ కాన్సులేట్ మైఖల్ జె గోర్బచెవ్ అన్నారు.

05/17/2018 - 23:59

హైదరాబాద్, మే 17: గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. కర్నాటక పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్ బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం రాజ్యాగం విరుద్ధమన్నారు.

05/17/2018 - 23:59

హైదరాబాద్, మే 17: బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్ తల్లి జానకీదేవి అంతిమసంస్కారం గురువారం నాడు బన్సీలాల్‌పేటలో జరిగింది. జానకీదేవి బుధవారం నాడు ఢిల్లీలో కన్నుమూశారు.

05/17/2018 - 23:56

హైదరాబాద్, మే 17: తెలంగాణ యువతలో విజయస్ఫూర్తిని నింపి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు, మార్గదర్శకంగా నిలిచేందుకు టీశాట్ ప్రణాళిక రూపొందించింది. అం దులో భాగంగా ఇటీవలె వెలువడిన 2017 సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్ధుల గాథలను ప్రత్య క్ష ప్రసారం ద్వారా ప్రసారం చేస్తూ నే కొత్తగా సివిల్స్ రాస్తున్న వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రణాళిక రచించింది.

05/18/2018 - 04:31

హైదరాబాద్: తెలంగాణ ఎమ్సెట్ ఫలితాలను ఈనెల 19వ తేదీన ప్రకటించనున్నారు. 2వ తేదీ నుండి 7వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఎమ్సెట్ పరీక్షను నిర్వహించారు. అగ్రికల్చర్ స్ట్రీంకు 73078 మంది రిజిస్టర్ చేసుకోగా, 71,766 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీంకు 1,47,912 మంది రిజిస్టర్ చేసుకోగా 1,36,311 మంది హాజరయ్యారు.

Pages