S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/22/2018 - 04:43

హైదరాబాద్, మే 21: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో చెప్పాలని వీహెచ్‌పీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది.

05/21/2018 - 04:09

హైదరాబాద్, మే 20: త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యే క దృష్టి సారించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ నగర శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి జేడీఎస్‌గా మారబోతున్నదని విమర్శించారు.

05/21/2018 - 04:08

హైదరాబాద్, మే 20: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ అధికారుల నియామకానికి ఆదివారం ప్రాధమిక పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలో ఉర్దు అధికారులను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దు అకాడమి ఈ నియామ ప్రక్రియను చేపట్టింది. ఇటీవల 66 స్పెషల్ కేటగిరి పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది.

05/21/2018 - 04:07

హైదరాబాద్, మే 20: ‘సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.’ అని బిజెపి నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎస్. రామచందర్ రావు పార్టీ కార్యకర్తలనుద్ధేశించి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో పార్టీ నగర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం రామచందర్ రావు అధ్యక్షతన జరిగింది.

05/21/2018 - 04:06

నల్లగొండ, మే 20: కరువు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగుతాగునీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం డిజైన్‌లో ప్రభుత్వం మరోసారి మార్పులకు సిద్ధపడింది.

05/20/2018 - 04:30

సూర్యాపేట: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెరుగైన రీతిలో పరిపాలనను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార వికేంద్రీకరణ కోసం కొత్తజిల్లాలను ఏర్పాటుచేసి సుపరిపాలనను అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్దిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

05/20/2018 - 03:45

నాగర్‌కర్నూల్, మే 19: రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధానాన్ని లూటీ చేస్తోందని, ఈ నాలుగేళ్ల కాలంలో రూ. ఐదు లక్షల కోట్ల బడ్జెట్‌లో ప్రజలకు ఇప్పటికీ ఎలాంటి సత్ఫలితాలు అందలేదని తెలంగాణ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

05/20/2018 - 03:43

వరంగల్, మే 19: అవినీతిలో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టం చేశారని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడే రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైన్లు, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.

05/20/2018 - 03:39

కరీంనగర్, మే 19: కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయాలు బాధాకరమని, ఇవి దేశానికి మంచిదికాదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఏ పార్టీలో గెలిచిన వారు ఏ పార్టీలోకి వెళుతున్నారో అర్థంకాని పరిస్థితి ఉందని, ఆ పరిస్థితులు తెలంగాణలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న రోత (గలీజు) రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

05/20/2018 - 03:37

గజ్వేల్, మే 19: పర్యావరణ పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దృష్టి సారిస్తుండగా, మానవ మనుగడ, పశు, వన్యప్రాణుల మనుగడకు వాతావరణ సమతుల్యత ఎంతో అవసరమని ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రతినిధి అతుల్‌బగాయ్ పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ పరిదిలోని మినాజిపేట, సింగాయపల్లి, కోమటిబండ అటవీ ప్రాంతాలను సందర్శించిన సందర్బంగా ఆయన మాట్లాడారు.

Pages