S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

10/12/2019 - 17:55

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు వయసు మీరిన తరువాత చాలా మందికి డబ్బుకు సంబంధించి తత్వం బోధపడుతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అనుకుంటాం. అలా అనుకోకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలి. 40 ఏళ్ళ వయసులో గ్రహించి రూపొదించిన 40 తప్పుల జాబితాలో ఈ వారం మరి కొన్ని..

10/05/2019 - 19:06

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు. డబ్బుకు సంబంధించి ప్రతి వారికి జీవితంలో చాలా సార్లు జ్ఞానోదయం కలుగుతుంది. చిన్న వయసులోనే ఈ జ్ఞానోదయం కలిగితే జీవితానికి ఎంతో ఉపయోగం. కానీ కొందరికి జీవిత చరమాంకంలో జ్ఞానోదయం కలుగుతుంది. అప్పటికీ చాలా మంది ఇక చేయగలిగింది ఏమీ లేదనే నిరాశలో ఉంటారు.

09/28/2019 - 18:50

కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అంశం ఇటు ఇండియాలో, అటు పాకిస్తాన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియాలో కన్నా పాకిస్తాన్‌లో ఎక్కువ చర్చ సాగుతోంది. ఏడు దశాబ్దాల పాటు కాశ్మీర్ పేరు మీదనే పాక్ పాలకులు, సైన్యం బతికేస్తుంది. అన్ని దేశాల్లో దేశం కోసం సైన్యం ఉంటుంది. కానీ పాక్‌లో మాత్రం సైన్యం కోసం పాక్ దేశం ఉంది అని ఒక విమర్శ. పాకిస్తాన్‌లో సైన్యందే అసలైన అధికారం.

09/21/2019 - 19:39

డబ్బు సంపాదించడం కన్నా ఖర్చు చేసే విధానం కూడా కీలకమే. ఎంత సంపాదిస్తేనేం ఖర్చుపై అదుపు లేకపోతే పొదుపు ఉండదు. పొదుపు లేనప్పుడు మీ వద్ద సంపదా ఉండదు. సంపాదించడం ఒక కళ అంటారు. సంపాదించడమే కాదు ఖర్చు చేయడం కూడా కలే.

09/14/2019 - 18:49

మీ ఉద్యోగాన్ని మీరు ప్రేమిస్తున్నారా?
చెప్పడానికి మోహమాట పడుతున్నారా?
పోనీ మేం చేసే ఉద్యోగాన్ని మేం ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం అని మీ సహచరులు, మిత్రులు ఎవరైనా చెప్పారా?
ఆలోచిస్తున్నారా? బహుశా అలా చెప్పిన వారు ఒక్కరు కూడా గుర్తుకు రావడం లేదు కదూ?
ఇది మీ ఒక్కరి పరిస్థితే కాదు. దాదాపు అందరి పరిస్థితి ఇదే.

09/07/2019 - 18:53

ఈ మధ్య జాతీయ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ముంబై ఐఐటి నుంచి బిటెక్, ఎంటెక్ చేసిన యువకుడు శ్రావణ్ కుమార్ రైల్వేలో దన్‌బాద్ డివిజన్‌లో దిగువ స్థాయి ఉద్యోగంలో చేరాడు. అక్కడి రైల్వే అధికారులంతా ఆశ్చర్యపోయారు. వారే కాదు ఈ వార్త చదివిన వారు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రైల్వేలో డీ గ్రూప్ ఉద్యోగం నెలకు జీతం 18 వేల రూపాయలు.

08/24/2019 - 22:25

శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా కొన్ని అంశాల్లో పాశ్చాత్యుల ముద్ర పడితే కానీ మనలో కొందరికి నమ్మకం కలగదు. డెల్‌కార్నీ కాదు కదా వారి తాతల కన్నా కొన్ని వేల సంవత్సరాల ముందు కాలానికి చెందిన ఎందరో భారతీయ మహనీయులు మనకెన్నో జీవిత సత్యాలను, విజయవంతమైన జీవితం గడపడానికి ఉపయోగపడే విషయాలు ఎన్నో చెప్పారు.

08/17/2019 - 19:36

సంపాదన లేకపోయినా ఇనె్వస్ట్ చేయవచ్చు. ఇదేదో లాటరీ కాదు. లక్కీ స్కీం అంత కన్నా కాదు. ఇది నిజం. జీవితంలో విజయం సాధించే వారు ఆచరించి చూపిన మార్గం. సాధారణంగా 20 వరకు చదువు సాగుతుంది. ఆ తరువాత ఉద్యోగ వేట వెంటనే ఫలిస్తే, 20 నుంచి 25 ఏళ్ల వయసు నుంచి సంపాదన మొదలవుతుంది. ముందు చూపు ఉన్న వారు అప్పటి నుంచి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను ప్రారంభించవచ్చు. ఇది చాలా మంది చేసేదే.

08/10/2019 - 18:03

స్వాతంత్య్ర పోరాటం గురించి మనం చదివే ఉంటాం. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతోమంది మన జీవితాలకు ప్రేరణగా నిలిచారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆ కాలంలో విద్యార్థులు చదువులను వదిలేశారు. న్యాయవాదులు ఎంతో ఆదాయం వచ్చే వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఎందుకు? బానిసత్వం భరించరానిది కాబట్టే స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం తెగించారు.
మరి మనమేం చేస్తున్నాం?

08/03/2019 - 19:01

మన దేశం వ్రతాలకు పెట్టింది పేరు. ఉత్తరాదిలో కరువా చౌత్ ప్రఖ్యాతి. సాంప్రదాయ కుటుంబాలు వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటారు. నిజానికి ఇలాంటి నమ్మకాల వెనుక శాస్ర్తియ కారణాలు ఉన్నా, కొందరు వీటిని మూఢనమ్మకాలుగానే చూస్తారు. అన్నం తినకపోతే బూచాడు వచ్చి తీసుకు వెళతాడు అని పిల్లలను బెదిరించినట్టుగా ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక అంశాలను వ్రతాలుగా అలవాటు చేశారు.

Pages