S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/25/2020 - 16:18

మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1పా): ఆదాయం - 5, వ్యయం - 5,
రాజపూజ్యం - 3, అవమానం -1.

03/22/2020 - 23:40

కరోనా వైరస్ మరణాలు, దాని తీవ్రత తెలిసినప్పటి నుంచి అందరిలో ఆందోళన మొదలైంది.
షేక్‌హాండ్ ఇవ్వాలంటే భయభ్రాంతులవుతున్నారు. దేనిని ముట్టాలన్నా ఆలోచిస్తున్నారు.
సాంఘిక దూరం (సోషల్ డిస్టెన్స్) మనుషుల మధ్య మొదలైంది.
ఎవరికి వాళ్లు శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు.

03/22/2020 - 23:27

చిగురాకుల ఎలకోయిల స్వరం తప్పి పాడింది
గుబురాకుల గువ్వపిట్ట పొదచాటుకు చేరింది
పచ్చపచ్చని పైరులపై పిచ్చుకమ్మ బిక్కచచ్చి నక్కింది
నెమలిబాల స్తంభించి గతి తప్పింది నృత్యహేల
మొన్న లేదు నిన్న లేదు నేడెందుకు చిన్నబోయె నీ వదనం
మాయమాయె గుండె గొంతుకలనేకం చేయు నీ హసనం
ఎందులకీ నైరాశ్యం.. ఏమిటి ఈ వైఫల్యం.. ఏం జరిగిందని
ఈ వైరాగ్యం.. ఏమయ్యిందని ఈ వైవిధ్యం

03/22/2020 - 23:18

మత్త॥ పట్టుబట్టి ప్రసూన పల్లవ పావడంబులు గట్టుచున్
పట్టరాని పరీమళంబును ప్రాణి కోటికి పంచుచున్
అట్టహాసముతో నటించుచు హాయి హాయిగ నూగుచున్
చెట్టుచేమలు చూడ నెంతగ చెన్ను మీరెను సృష్టలోన్

03/21/2020 - 23:56

ఇవి యేమి పూవులో
ఇవి యేమి తావులో
చెట్ల కొమ్మలు ఎంత పుకిలించెను..

ఎండ కన్నుల రంగు
ఎన్ని వనె్నలు పొంగు
ఇప్పుడీమేరలో ఇగిరించెను..

వనసీమకీ పూట
జన వాటి నీ చోట
కిరణాలు తోలుకొని యేతెంచెను..

చూచిపోవే తల్లి
చూచి పోరా తండ్రి
చిగురు వనె్నల దొనె్న చారణాలు..

చూచి పోవే తల్లి
చూచి పోరా తండ్రి
తులకించు మెలపులీ తోరణాలు..

03/21/2020 - 23:50

చైత్రానికి కుసుమాంజలితో
వయ్యారాల వసంతాన్ని ఆహ్వానిస్తూ
ఆమని కోయిలలు గానం చేసే గొంతుకతో
కవి కోయిలలు పరవశించి పలికిన పదాలతో
ఆశాభావాల్తో ఆహ్వానించాలని పించింది ఉగాదిని.

మరాఠీల గుడెపగ్వా, మళయాళీల విషు,
తమిళుల పూత్తాండు, కన్నడ కూగీ హేలు,
సిక్కుల వైశాఖి, బెంగాలీల పోయ్‌లా బైశాఖి -
ఎక్కడైనా ఉగాదే అదే ‘యుగాది’,
నూతన జీవనానికి ‘నాంది’.

,
03/21/2020 - 23:29

రాచకొండ అంటేనే గుట్టలు...గుహలు...గోపురాలు, అబ్బురపరిచే శిల్పాలతో పాటు కోనసీమ అందాలను మైమరిపించే విధంగా రాచకొండ గుట్టలు దర్శనమిస్తాయి. రాతి కట్టడాలు, కోట గోడలు, గోల్కొండను మైమరిపించే విధంగా ఉన్న రాచకొండ గత పాలకుల నిర్లక్ష్యంతో కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

03/21/2020 - 23:25

సీనియర్, సీరియస్ చిత్రకారుడు ఎం.కృష్ణారెడ్డి. ఆయన చిత్రాలు విభిన్న శైలిలో, విశేష ‘వస్తువు’తో అటు ఆక్రిలిక్ రంగుల్లో కాన్వాసుపై పెన్ను, పెన్సిల్‌తో కాగితంపై ఇటు ప్రింట్ రూపంలోనూ కనిపిస్తాయి. ఇంతటి వైవిధ్యం ఒకే ‘కుంచె’లో కొలువుదీరడం అభినందనీయం!

03/17/2020 - 00:00

ప్రతి చిన్న మాటకి విలువ ఉంది.
బలం ఉంది.
మనం చదివిన ఏదో చిన్న పేరాలోని అంశమో మనల్ని ప్రభావితం చేయవచ్చు.
ఓ కవితలోని రెండు చరణాలను మనకు స్పూర్తిని ఇవ్వవచ్చు.
ఓ ప్రకటనలోని అంశం కూడా మనల్ని ఆకర్షించవచ్చు.
ప్రతి చదువుకి
ప్రతి మాటకి
ప్రతి దయకి
ప్రతి ప్రార్థనకి
ప్రతి సంభాషణకి
ప్రతి సమావేశానికి ఎంతో విలువ ఉంది.

03/16/2020 - 23:58

సాంఘిక మాధ్యమాలనేవి ఓ వ్యసనంగా మారిపోయాయి. మన జీవితం వీటితోనే ముడిపడినట్టుగా అనిపిస్తుంది. గతంలో ఉదయం లేవగానే దేవుని బొమ్మ చూసేవాళ్లు. ఇప్పుడు వాట్సప్‌లు చూస్తున్నారు. సాంఘిక మాధ్యమాల వల్ల ఉపయోగాలు చాలా ఉన్నప్పటికీ, చాలామంది విలువైన కాలాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని అనిపిస్తుంది.

Pages