S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం స్పెషల్

04/14/2018 - 23:59

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నది పెద్దల మాట. ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెడితే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదన్నది నిజం. కలియుగ వైకుంఠంగా భాసిల్లే తిరుమల కేవలం ధార్మిక క్షేత్రంగానే కాకుండా సామాజిక సేవలను కూడా విస్తృతంగా చేపట్టడంలో విశ్వవ్యాప్తం చెందింది.

04/07/2018 - 23:58

కట్టుబాట్లు, దురాచారాల మధ్య నలిగిపోతున్న మహిళా లోకాన్ని చైతన్యపరిచి, సభ్య సమాజంలో పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు ఎందరో సంఘ సంస్కర్తలు దశాబ్దాల కిందట నడుం కట్టుకున్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో స్ర్తిలు చట్టసభల వరకూ వెళ్లగలిగారు. లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం-అంటూ నాలుగు దశాబ్దాల కిందటే ఓ సినీకవి చెప్పిన మాటను నిజం చేస్తున్నారు నేటి మహిళలు.

04/01/2018 - 00:07

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. పొట్టి క్రికెట్‌ను పొట్టి పేరుతో చెప్పాలంటే ఐపీఎల్.. సునామీలా దూసుకొచ్చి, యావత్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన టీ-20 టోర్నీ. అప్పటి వరకూ రాజ్యమేలిన ఇంగ్లీష్ కౌంటీల ప్రాభవం తగ్గిపోవడానికి ఐపీఎల్ కారణమైంది. ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బిగ్‌బాష్‌ను చావుదెబ్బ కొట్టింది.

03/24/2018 - 23:54

‘శ్రీరామనవమి’ వచ్చిందంటే చాలు దేశమంతటా ఆకాశమంత పందిళ్లు వేసి భూదేవంత పీట వేసి ఊరూ వాడా ఏకమై ఆనందోత్సాహాలతో సీతారాముల కల్యాణం జరుపుకుంటారు ప్రజలు. శ్రీరాముడు లోకారాధ్యుడు ఎందుకైనాడు? భగవంతుడనా? పురుషోత్తముడనా? ఎవరి విశ్వాసాలు వారివి. రెండూ సత్యాలే కావచ్చు. నమ్మినవారికి నమ్మినంత. నాణెమునకు బొమ్మా బొరుసు ఉన్నట్లే శ్రీరాముడిలో నారాయణతత్త్వముంది, నరతత్త్వము వుంది.

03/17/2018 - 23:56

పంచపాదం పితరం ద్వాదశాకృతిం
దివ ఆహుః పరే అర్థే పురీషిణం
అధేమే అన్యఉపరే విచక్షణం
సప్త చక్రౌషడర ఆహురర్పిత మితి
-ఋగ్వేదం
***

03/11/2018 - 00:23

నైపుణ్యం ఉంటేనే ఏ వృత్తిలోనైనా రాణించడం సుసాధ్యం. నాలుగు గోడల మధ్య విద్యనభ్యసించి, ఎలాంటి ‘ప్రాక్టికల్ నాలెడ్జి’ లేకుండా బయటకు వచ్చే యువతకు ఉపాధి అవకాశాలు తక్కువే. అయితే కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రతి రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు అనేక కంపెనీలు ఎంపిక చేసిన యువతకు శిక్షణ ఇచ్చి వారితో పనిచేయించుకొనేవి.

03/04/2018 - 20:03

సినీ గీతం అనునిత్యం తీరాన్ని తాకే కెరటం. ఎగసిపడే భావాలను ఒడిసి పట్టుకునేందుకు భావ తీరాలు ఎదురు చూస్తూంటాయి. హాయి, ఆనందం, ఉత్సాహం, ఉత్తేజంతో తరాలు తరిస్తూంటాయి. మొన్నటి పింగళి, సముద్రాల తరం నిన్నటి తరం ఆత్రేయ, ఆరుద్ర, సినారె, వేటూరి, సిరివెనె్నల సమాహారం.. నేటి తరానికి చెందిన చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తీ సినీ సంద్రంలో భావ తీరాలను తాకే సాహితీ నావికులే.

02/25/2018 - 00:01

ఎన్ని చిక్కులో.. అన్ని చిట్కాలు
*

02/18/2018 - 04:29

‘ఫలానా పేరు మోసిన కార్పొరేట్ కాలేజీ హాస్టల్‌లో మా అమ్మాయిని చేర్పించాం..’- అని చెప్పుకోవడం ఇపుడు తల్లిదండ్రులకు ఓ ఫ్యాషన్‌గా మారింది. అమ్మాయినో , అబ్బాయినో బాగా ఖరీదైన కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూళ్లు లేదా కాలేజీల్లో చేర్పించడం తమ హోదాకు తగిన చిహ్నంగా ఈ కాలపు పేరెంట్స్ భావిస్తున్నారు. మరికొంత మంది తల్లిదండ్రులు పిల్లల అల్లరిని తట్టుకోలేక హాస్టళ్లలో వేస్తున్నారు.

02/11/2018 - 00:00

పరమేశ్వరుడైన శంకరుని మహిమ అపారమైనది. అద్భుతమైనది. శివుని మహిమ వాక్కులకు, మనస్సునకు అందనిది. వేదత్రయము - సాంఖ్య శాస్తమ్రు - పతంజలి యోగ శాస్తమ్రు, శివాగమములతో ఒప్పారుచున్నది శైవ మతము. మోక్ష ప్రాప్తికి ఉత్తమ మార్గము. సకల జీవులకు, పరమ శాంతికై పలు రీతులలో సాధనలు చేయుటకు పరమ గమ్యుడు శివుడు.

Pages