S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

03/22/2020 - 23:29

‘కాలగర్భం - ఇవాల్టి ఇంటర్‌నెట్ కన్నా ఫెద్దది, గొప్పది. సన్నివేశాలు, సంఘటనలు ఇవన్నీ అందులోకి ఎన్నైనా వెళ్లిపోతాయి. గానీ వాటిని అక్కణ్నుంచి ఇవతలికి తీసుకురావడం అన్నది బిడ్డని కనడానికి తల్లి పడే ప్రసవ వేదనలాంటిది. అమ్మ కడుపులోంచి ఈ నేల మీద పడుతున్నప్పుడు అమ్మ పడే వేదన లాంటిదే శిశువుకి కూడా కలుగుతుంది. కానీ అదేదో చెప్పలేదా శిశువు..

03/15/2020 - 23:59

ఫాత ఫొటోలు ముచ్చట్లు చెబుతాయి. జ్ఞాపకాలను కెలుకుతాయి. కానీ ఉత్తరాలు సంభాషిస్తాయి. అప్పటి చరిత్రను బొమ్మలు తీసి చూపిస్తాయి. రాసిన వాడి ఆంతర్యాన్ని అంతఃచేతననీ ప్రతిబింబిస్తాయి. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఉత్తరాలను ఒక ‘కాణాచి’గా భావించాను. పదిలంగా ఉన్న వాటిని చాలా ఆలస్యంగా తడుముతున్నాను. కనీసం ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం వాటిని తెరిచి, అనుభవించవలసింది అనిపిస్తోంది.

03/09/2020 - 23:38

భెజవాడ గాంధీనగరం అంటేనే సినిమాల నగరం! పెట్టుబడి పోయేది ఇక్కడి నుంచే. సినిమాలు పంపిణీ అయ్యేదీ ఈ ఊరి నుంచే, పైగా, ‘పత్రికా, ‘ప్రభా’ వెలువడుతున్నదీ - అన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇక్కడ్నుంచే. అంచేత ఎర్నేనిమేన్షన్‌లోని స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, దాని పక్క భవనంలో కేంద్ర ప్రభుత్వ సమాచార సంస్థ పి.ఐ.బి. (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో రెండూ కూడా ఇక్కడే ఏర్పడి ఉన్నాయి.

03/01/2020 - 23:24

అరవై అయిధు జనవరి ఇరవై మూడు నుంచి జనవరి పది అర్ధరాత్రికి బెజవాడ ఎడిషన్‌కి ఏడాదవుతోంది. ఎవడి మటుక్కి వాడే సెలబ్రేట్ చేసుకోవాల్సిందేననుకోండి. కానీ జనవరి పది అర్ధరాత్రి ఒక పిడుగు పడ్డట్లయింది. ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్ర్తీగారు పరాయిగడ్డ తాష్కంట్‌లో గుండెపోటుతో రాత్రి ఒంటి గంటా రెండు నిమిషాలకు అంతిమ శ్వాస వదిలారు. ఉలిక్కి పడ్డంది దేశం. పత్రికల కార్యాలయాల్లో పి.టి.ఐ. ప్రింటర్లు గణగణ ‘‘స్నాప్..

02/23/2020 - 23:36

‘‘ఫత్రిక రాకతోనే పాత బెజవాడ కొత్త విజయవాడ అయిపోవాలీ అంటే ఎట్లాగయ్యా? వీరాజీ!’’ అనేవాడు ప్రకాశరావుగారు. ఈపాటికే జైహింద్ టాకీస్ పక్కనున్న విశాలాంధ్ర - చుట్టుగుంట చంద్రం బిల్డింగ్‌లోకి వెళ్లిపోయి దాని జాగాలో ముక్కలైన కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులైన వాళ్లు ఎవరు అటు విశాలాంధ్రగా ఇటు ప్రజాశక్తిగా పోయారో తెలుసుకునే టైమ్ కూడా లేదు.

02/16/2020 - 23:18

ఎంతో కాలంగా అంధు కోసం ఉవ్విళ్లూరుతూ ఎదురుచూస్తున్న విజయవాడ నుంచి పత్రిక ప్రచురణ ఎట్టకేలకు సాధ్యమైంది. గాంధీనగరం ఐదు రోడ్ల కూడలి ‘ఆంధ్రపత్రిక సెంటర్’ అయింది. జనవరి 24, ఆదివారం తేదీ గల సంచికని శనివారం చేయడంతో కేంద్ర కార్మిక మంత్రిగా వెళ్లిన సంజీవయ్యగారు సందేశంలో (తన) పేర్కొన్నట్లు ‘‘ఆంధ్రుల ఆదిపత్రిక అభిమాన పత్రిక - కృష్ణా తీరం నుంచి కూడా ప్రచురణయైంది. ‘‘ఒక వెలితి తీరింది.’’

02/09/2020 - 23:43

ఐధు పాసింజర్ బోగీలను అవతల పారేసి, ముందుకు వెళ్లిపోయింది మద్రాసు-హౌరా మెయిలు. భోగి పండుగ అన్ని చోట్లా చలిమంటలు వేసుకుని ఉంటారు జనం. ఆ రాత్రి అడవిలో పెద్దలు, పిన్నలు నాకు ఎందరో సహాయం చేశారు. నా ‘బదిలీ’కి మంచి ముహూర్తమే అయిందది. యువకులు నా సామాన్లు మోసుకొస్తే పెద్దలు టార్చిలైట్లతో ముందు నడిచారు. ఒక ‘‘మిలటరీ బోగీ’’ దగ్గర ఆగి ‘‘వుఠో..

02/02/2020 - 22:36

‘‘నరుఢా! ఏమి నీ కోరిక?’’ అంటూ పాతాళభైరవి సినిమాలోలాగా ఒక యక్ష కన్య ‘డింగ్’మని ప్రత్యక్షమై అడుగుతుందని నేను అనుకోలేదు గానీ - ఊరు, డిపార్ట్‌మెంట్ మారిపోతున్నప్పుడు అయినా - కొంచెం సమయం, సదుపాయం దొరుకుతాయని నేను అనుకున్నాను.

01/26/2020 - 22:51

అధే కనుక ఫ్లాప్ అయితే అటు తర్వాత అపారంగా నాకు, నా కెరీర్ మీద ఏర్పడ్డ కాన్ఫిడెన్స్ నీరుగారిపోయి ఉండేది. డైలీలో కూడా, దురదృష్టవశాత్తు, అది ఆగిపోయేదాకా, వీక్లీలో కన్నా ఎక్కువకాలం, అహర్నిశలూ పనిచేసినా, నా మీద పాఠకులలో ‘వీక్లీ’ ముద్రయే మిగిలింది!

01/19/2020 - 23:12

అవతల భెజవాడ సంచిక డైలీ ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేయబడ్డట్లే వుంది. పై ఏడాది జనవరిలో యిది సాధ్యం కావచ్చును. (1965) అనుకుంటూ వుండగా- నేను సినిమాలకి- అంటే స్టూడియోల్లో చూపించే ప్రీవ్యూలకి సహచరులను పంపించేస్తూ వున్నాను. డైలీ ప్రెస్సులోకి ఓసారి వెళ్లాను. వర్కర్‌లు చుట్టుముట్టేస్తారు. ‘‘డైలీలోకి దిగిపోతున్నారా, సామీ?’’ అంటారు.

Pages