S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

10/12/2019 - 17:33

మనిషికి చదువు, తెలివి, మనం, పట్టాలంటే తగిన వాతావరణం ఉండాలి. ఇంట్లో వాళ్లంతా ఒక రకంగా ఉంటూ పిల్లలను మాత్రం చదవండి అంటే వాళ్లకు అందులో రుచి కలగదు గాక కలగదు. కొన్ని కుటుంబాల సంగతి వేరు. బ్రాహ్మణులు అనగానే అందరూ దుమ్మెత్తి పోయడం బాగా నేర్చుకున్నారు. వాళ్లు వెనకటి ఏవో నేరాలు ఘోరాలు చేస్తే చేసి ఉండవచ్చు. కానీ మధ్యలో వాళ్లకు ఒక విషయం అర్థం అయింది.

10/05/2019 - 18:43

లోకాభిరామంలో చెప్పుకునే సంగతుల గురించి నేను పడుతున్న బాధ చాలా మందికి తెలుసు. అందరికీ కనీసం ఆసక్తికరంగా ఉండే సంగతులు అందించాలని ప్రయత్నం. నా జన్యుశాస్త్ర పరిశోధనలో భాగంగా కొంత మానవీయ శాస్త్రంలో ఆసక్తి కలిగింది. ఆ రకం సమాచారం మీకు కూడా అందించాలనిపించింది. నా వంతు నేను చేస్తున్నాను. తరువాత మీ ఇష్టం.

09/28/2019 - 18:35

‘ఏంవాయ్, మై డియర్ వెంకటేశం! ముఖం వేలవేశావ్’ అంటాడు గిరీశం తన శిష్యుడితో. ఆ అబ్బాయి తీరు చూస్తేనే నీరసంగా ఉన్నాడన్న సంగతి గురువుకు అర్థమయిపోయింది. ఎలెక్షన్‌లు జరగకముందే కొంతమంది నాయకుల ముఖంలో కనిపించిన వాలకం చూస్తే, ఇక ఈ వ్యక్తి గెలిచే అవకాశం లేదూ అన్న సంగతి ముందే అందరికీ అర్థమయి పోయింది.

09/21/2019 - 19:17

మనలను మనం మాటలతో మోసం చేసుకోగూడదు
- పెర్సివాల్ లోవెల్

09/14/2019 - 18:44

మనిషి మ ఒదటి నుంచి విజ్ఞత, విజ్ఞానం అనే స్థాయి తెలివి గురించి తపన పడుతున్నాడు. ప్రతి వ్యక్తిలోను ఇంటలిజెన్స్ అనే తెలిలి కొంత ఉంటుంది అనుకొన్నారు. అందుకు ఆధారంగా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది అనుకున్నారు. అంతరాత్మ బోధనతో మనిషికి తెలివి కలుగుతుంది అనుకున్నారు. కానీ చాలామంది లోపల గోల ఒకటే ఉన్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. నిజమైన విజ్ఞతను సంపాదించాలంటే అందుకు మరో మార్గాలు ఉన్నాయని మానవులు వెదకసాగారు.

09/07/2019 - 18:33

భాషలో విషయం ఉంటే చాలదు. దానికొక గమ్యం కూడా ఉండాలి - రెనీ డౌమాల్
* * *

08/31/2019 - 19:37

తనకేదీ తెలియదని తెలుసుకోవడమే మనిషి తెలివికి గమ్యం - జోసెఫ్ అడిసన్
* * *

08/24/2019 - 18:21

ఏడుకొండల ఎంకన్నను వీఐపీలు అంటే నిజంగా పెద్దమనుషులు వెళ్లినపుడు ఆలయం అధికారులు ఎదురువచ్చి ఆహ్వానం పలికే సంప్రదాయం ఒకటి ఉన్నది. మిగతా చోట్ల అంతా పూర్ణకుంభ స్వాగతం అని సలాంఛన స్వాగతం అని ఆ కార్యక్రమానికి పేరు. తిరుమల క్షేత్రం వారు మాత్రం ఇస్తికపాల అనే స్వాగతం పలికారు అని పత్రికలలో రాస్తుంటారు. ఈమాటకు ఎవరికీ అర్థం తెలియదు.

,
08/17/2019 - 18:56

పార్లమెంట్ ఎన్నికలకన్నా చాలా ముందు అంటే మార్చి నెల చివర్లో నేను ఒక వారం పాటు ఉత్తర భారతదేశంలో తిరిగాను. అది నిజానికి విహార యాత్రగా పథకం ప్రకారం చేసిన ప్రయాణం కాదు. మరొక అవసరం మీద ఒక పెద్ద మనిషి బయలుదేరితే అతనితోపాటు నేను కూడా వెళ్లి తిరిగాను. మొదట అహమదాబాదు వెళ్లాము. అక్కడి నుంచి రిషికేశ్, కురుక్షేత్ర, షిమ్లా, ఆ తర్వాత దిల్లీ. అంటే ప్రయాణం కనీసం ఐదు ఆరు రాష్ట్రాలలో సాగింది అని అర్థం.

08/10/2019 - 17:36

మనిషి చేతుల యొక్క లక్షణాల ద్వారా ఎవరికి వారిని ప్రత్యేకంగా చెప్పే పరిస్థితికి అమ్మ కడుపులోనే ఆరంభం జరుగుతుంది. అవే వేలిముద్రలు. పది నుండి పదహారు వారాల వయస్సులోనే వేలిముద్రలు మొదలవుతాయి. వాటి తీరు మీద జన్యువుల ప్రభావం ఉంది. శంఖాలు, చక్రాలు, ఇవిగాక ఆర్చెస్ అనే నిర్మాణాలు అన్నీ అక్కడే మొదలవుతాయి. పిండంగా ఉన్నప్పటి నుంచి చేతుల మీద పడిన వివిధ ప్రభావాల కారణంగా వీటి తీరు నిర్ణయం అవుతుంది.

Pages