పెళ్లిజంటల పరుగుపందెం
Published Friday, 5 May 2017థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఎప్పటిమాదిరిగానే ఈమధ్య ఓ వినూత్న పరుగుపందెం నిర్వహించారు. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న జంటల మధ్య పరుగుపోటీ అన్నమాట. జంటగా పరుగెట్టి గెలవాలి. అలా గెలిచినవారికి దాదాపు 28వేల అమెరికన్ డాలర్ల విలువైన బహుమతులు ఇస్తారు. మొదటి బహుమతి సాధించిన జంటకు దేశంలోని ప్రఖ్యాత రిసార్టులో హనీమూన్తోపాటు మరో దేశంలో పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. వారికి పెళ్లి దుస్తులు బహుమతిగా ఇస్తారు. ఈసారి ఆ పోటీలో నెగ్గిన జంటలో పెళ్లికుమార్తె పేరు సిరడ తమ్వన్న. వరుడి పేరు సిట్టిచాయ్ ప్రసాంగ్సిన్.