S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాము కనిపిస్తే పండగే

మనది తపోభూమి. భక్త్భివమే భారత్‌ను తరతరాల నుండి పుణ్యభూమిగా కీర్తినందుకునేలా చేసింది. ఇక్కడ చెట్టూ పుట్టా, రారుూ రప్పా అన్నీ పూజితాలే. ఇక గోవులు, పాముల గురించి చెప్పనక్కరలేదు. మనిషిలో దేవుడిని చూడాలని అద్వైతులు పూర్వమే చెప్పారు. కానీ మనవారు మరింత ముందుకెళ్లి మనుషులతో పాటు మరెన్నో వాటిలో దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. దానికి చక్కని ఉదాహరణే మహారాష్టల్రోని సోలాపూర్ జిల్లాకి చెందిన షెత్‌పాల్ గ్రామం. ఇక్కడ నివసించే ప్రజలు అనునిత్యం నాగుపాములను పూజిస్తుంటారు. సాధారణంగా మన దేశంలో నాగుల చవితి నాడే మనం నాగులను పూజిస్తాం. కానీ షెత్‌పాల్ గ్రామవాసులు ప్రతిరోజూ నాగుపాములకు ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తుంటారు. పుణెకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామ జనాభా 2650 మంది. వారు నాగులను అంతగా పూజించడానికి అసలు కారణం ఏమిటో తెలియదు కానీ, అక్కడి వారంతా నాగులను భక్తిశ్రద్ధలతో పూజించడం మాత్రం మనకు కనిపిస్తుంది.
చివరికి షెత్‌పాల్ గ్రామవాసుల ఇళ్లలోకి కొన్ని సార్లు అక్కడ ఎక్కువగా కనిపించే పాములు ప్రవేశించి కలియదిరుగుతూ కూడా కనిపిస్తాయి. కానీ అక్కడున్న పెద్దవాళ్లు, పిల్లలు ఎవరూ ఈ విషయమై ఎలాంటి భీతీ బెరుకు లేకుండానే జీవిస్తుంటారు. సాధారణంగా వేరే చోట ఎక్కడైనా అయితే పాముని చూడగానే భయంతో హడలిపోయి పాములు పట్టేవారిని పిలుస్తారు. కానీ షెత్‌పాల్ గ్రామస్తులు మాత్రం ఎప్పుడైనా పాములు తమ ఇళ్లలోకి ప్రవేశిస్తే ఆనందిస్తారు. ఆ పాములకు ఎలాంటి ఆటంకం కలగకుండా పక్కకు తప్పుకుని అవి వెళ్లిపోయేటంత వరకు వేచి చూస్తారు. ఆ తర్వాతే తమ పనులు తాము చేసుకుంటారు. నాగుపాములు ఎవరింట్లోకైనా ప్రవేశిస్తే దానిని వారు దేవస్థానంగా పరిగణిస్తారు. అలా పాములు తమ ఇళ్లలోకి రావడం అంటే అవి తమని ఆశీర్వదించడానికి వచ్చినట్లు భావిస్తారు. అదొక అదృష్టంగా చెప్పుకుంటారు. షెత్‌పాల్ గ్రామస్థులు ఎప్పుడూ పాములను చంపడం, కొట్టడం వంటివి చేయరు.
షెత్‌పాల్ గ్రామంలో ఎటువంటి హానీ జరగకపోవడం వల్ల నాగుపాములు అక్కడ యథేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తాయి. రహదారుల్లోను, పొలాల్లోను, నివాస సముదాయాల్లో కూడా నాగుపాములు సంచరించడం అక్కడ సర్వసాధారణ విషయం. అయితే వాటిని చూసి గ్రామస్థులు భయపడడం, కేకలు వేయడం, వాటిని పట్టుకోవాలని ప్రయత్నించడం వంటివి అస్సలు చేయరు. అవి కూడా అక్కడి గ్రామస్థులతో సహజీవనం సాగిస్తున్నట్లే ఉంటుంది ఆ దృశ్యాలను చూస్తుంటే. షెత్‌పాల్ గ్రామంలో పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా పాములంటే ఏమాత్రం భయపడరు. పైగా కొన్నిసార్లు అయితే పిల్లలు అక్కడి నాగుపాములతో ఆడుతూ కనిపించడం చూస్తుంటే బయటి వారు షాక్‌కు గురవుతుంటారు. ఆ గ్రామంలోని ఇళ్లల్లోకే కాకుండా కొన్నిసార్లు అక్కడి పాఠశాలల్లోకి కూడా పాములు ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఆయా పాఠశాలల విద్యార్థులెవరూ పాములను చూసి భయపడరు. ఆ పాములు వాటంతట అవి వెళ్లిపోయే వరకు వేచి ఉండి తర్వాత పాఠాలు చదువుతారు. అంత పెద్ద సంఖ్యలో పాములు ఆ గ్రామంలో సంచరిస్తుంటే అవి వారిని కాటు వేయవా అని. నిజమే ఎవరికైనా ఈ అనుమానం వస్తుంది. కానీ మనుషులతో పాటు కలసి మెలసి జీవిస్తున్నట్లు కనిపించే పాములు అక్కడి ప్రజలను కాటు వేసిన వైనం గానీ, అలాంటి సంఘటనలు నమోదైన విషయం గానీ చరిత్రలో ఇప్పటి వరకు లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.

- దుర్గాప్రసాద్ సర్కార్