S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం?

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు కూడదు. రచనా వ్యాసంగాల ద్వారా ఆదాయం, ప్రాముఖ్యత లభిస్తాయి. ఇతరుల సలహాల మీద కాక మీ కార్యదక్షత మీద ఆధారపడి నూతన ఒడంబడికలకు ప్రయత్నించండి. 29, 30 తేదీల్లో బృంద కార్యక్రమాలు, సామూహిక, సమారాధనలు, పండుగలలో పాల్గొని ఉల్లాసం పొందుతారు. క్రయ విక్రయాలు, స్పెక్యులేషన్ అనుకూలిస్తాయని చెప్పవచ్చు. సర్వీసులు, సంక్షేమ పథకాలు ముందు వెనుకలు ఆలోచించి ప్రారంభిస్తారు. అభినందనలు, శుభాకాంక్షలు అందుకుంటారు.

వృషభం (మే 15 - జూన్ 14)
అనవసర విషయాలపై కాలయాపన చేయక మీ శక్తియుక్తులను సద్వినియోగం చేయడం ఉత్తమం. ఉన్న వనరులను పొదుపుగా వాడడం అన్ని విధాలా ఉత్తమం. నిరుపయోగమైన వస్తువులను మరమ్మతుల ద్వారా వాడుకలోనికి తేగలుగుతారు. వృత్తిపరంగా చెప్పుకోదగ్గ మార్పులు ఏర్పడుతాయి. ప్రతిజ్ఞలు, ప్రమాణాలకు అనుకూలమైన సమయం కాదిది. కుటుంబ వ్యక్తులతో వాదనలు, అపోహలకు దారి తీయకుండా జాగ్రత్త వహించండి.

మిథునం (జూన్ 15 - జూలై 14)
మరుగున పడ్డ వ్యవహారాలు కొన్ని తిరిగి ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ఇంటా బయటా కూడా మీ పనులు నిరాటంకంగా నిర్వహించ గలుగుతారు. బలహీనులకు, అనుయాయులకు చేయూత నిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతారు. కలహాలు, అపోహలు తొలగి మనశ్శాంతి పొందగలుగుతారు. ఆత్మీయుల నుండి ఆదరణ, శుభ వార్తాశ్రవణం ఉంటాయి. ధన, భాగ్యాభివృద్ధికి మంగళ, బుధ వారాల్లో అంకురార్పణ జరుగుతుంది.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)
హితులు, శ్రేయోభిలాషులతో కలిసి శుభ కార్య నిర్వహణకు పూనుకుంటారు. నూతన విషయాలు తెలుసుకోవడం, బంధుమిత్రుల కలయిక, వివాదాల నుండి బయటపడటం, ప్రోత్సాహకాలు, బహుమతులు అందుకోవడం శుక్ర, శనివారాల్లో జరుగవచ్చు. ప్రయాణాలు పెరిగినా శ్రమకు తగిన ఫలితాలు పొందుతారనడంలో సందేహం లేదు. సంఘంలో మీ ప్రాధాన్యత, వృత్తి ఉద్యోగాల్లో ఆధిక్యత అనుభవానికి వస్తాయి. గతంలో మీ ద్వారా లబ్ధి పొందినవారు మీకీ వారంలో ఉపయోగపడతారు.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
కొత్త విషయాలు తెలుసుకో గలుగుతారు. దూషణ, భూషణ, తిరస్కారాలకు అతీతంగా కృషి చేసి మీ ఏకాగ్రత, కార్యనిర్వహణా సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు కొన్ని ఈ వారంలో పూర్తవుతాయని చెప్పవచ్చు. జడత్వం నుండి బయటపడి చైతన్యం దిశగా అడుగువేస్తారని చెప్పవచ్చు. అకాల భోజనం, అధిక త్రిప్పట ఉన్నా సాధించిన అభివృద్ధి మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. విరామ కాలక్షేపాలు, విహార యాత్రలు ఆనందాన్నిస్తాయి.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
మేధావులతో పరిచయాలు, స్వకార్యాలలో విజయం మిమ్మల్ని పులకింపజేస్తాయి. నిరాశా నిస్పృహలు వీడి అన్ని విషయాల్లో చురుగ్గా పాలుపంచుకుంటారు. బంధనాలు, అడ్డంకులు తొలగడం, విద్యా, వృత్తి రంగాలు మీ అభివృద్ధికి బాటలు వేసేవిగా ఉంటాయి. పాత బాకీలు తీర్చి కొత్త ఒప్పందాలు, ఒడంబడికలకు సమాయత్తమవుతారు. మీ అభిమానులు, ఆత్మీయులతో కలిసి ఆనందిస్తారు. భాగస్వామ్యాలు, సోదర వర్గం యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
కుటుంబ బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసినా సంయమనంతో సమర్థించుకు వస్తారు. సోదరవర్గం ద్వారా ధన, కనక, వస్తు వాహనాలు లభించే సూచనలున్నాయి. నష్టపోయిన చోటే తిరిగి ప్రయత్నించి అభివృద్ధి సాధిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఆశ్రీతులు, అనుయాయుల అవసరాలకు ఆదుకుని మీ పెద్దరికాన్ని నిలుపుకుంటారు. భాగస్వాముల మనోభావాలను గమనించి తగురీతిలో స్పందిస్తారు. పోటీలు, ప్రచారాలలో మీరు ఆధిక్యత సాధిస్తారు.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
పనులన్నీ సక్రమంగానే సాగుతున్నా ఊహకందని మార్పులు జరిగే సూచనలున్నాయి. కళలు, విజ్ఞాన రంగాల్లో మీకు ప్రోత్సాహం లభించగలదు. విచిత్ర వస్తువులు, ప్రోత్సాహకాలు అందుకుని ఉల్లాసం పొందుతారు. అభిజాత్యం వీడి అందరితోటి కలిసి భవిష్యత్ ప్రణాళికలను గూర్చి విశే్లషిస్తారు. దూర ప్రాంతాల నుండి బంధువులు, శ్రేయోభిలాషులు వచ్చి మీలో చైతన్యం నింపుతారు. బాధ్యతలను పూర్తి చేసి, వాయిదాలను చెల్లించి వస్తు వాహనాలను సమకూర్చుకో గలుగుతారు.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
అభియోగాలను, ఆరోపణలను తిప్పికొట్టి మీ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తారు. మిత్రవర్గంతో కలిసి సామాజికాభివృద్ధికి నూతన ప్రణాళికలను ప్రారంభిస్తారు. క్రీడా, కళా విశేషాలు మీకు ఉల్లాసాన్ని కలుగజేస్తాయి. ఆదాయం పెరగడంతో ధనం విరివిగా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించి ఇబ్బందుల నుండి బయటపడ గలుగుతారు. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. పెట్టుబడులకు, ప్రచారాలకు అనుకూలమైన వారమిది.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
మీ బలహీనతలు ఇతరులు గ్రహించకుండా గుంభనంగా ఉండడం అవసరం. ఆరోగ్యపరంగా డాక్టర్ సలహాలలు పాటించడం తప్పనిసరి. విద్యార్థులు అంతరాయాలు లేకుండా ముందుకు సాగాలంటే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆత్మీయుల ప్రేమాభిమానాలు చవి చూస్తారు. ప్రత్యర్థులు మీ వెనుక గోతులు తవ్వకుండా అప్రమత్తత పాటించండి. కుటుంబ సౌఖ్యం లభ్యమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొన్ని వాయిదా పడవచ్చు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. క్రీడలలో రాణిస్తారు.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారనవచ్చు. నష్ట ద్రవ్యలాభం, పెట్టుబడుల ద్వారా ఆదాయం మీ బ్యాంకు బాలెన్స్‌ను పెంచుతాయి. ఊహించని విధంగా అధికారుల నుండి సహకారం, ప్రోత్సాహం లభ్యమవుతాయి. ప్రస్తుత మార్పులను గమనించి కొన్ని పనులను, ప్రణాళికలను వాయిదా వేసే సూచనలున్నాయి. అలంకారాలు, ఆభరణాలు సమకూర్చుకో గలుగుతారు. సన్నిహితుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
నిరంతర కృషితో మీ ముందున్న లక్ష్యాలకు చేరువగా వెళ్లడమేకాక, ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షిస్తారు. గొప్పవారి సహకారం అందడం, ఆస్తుల ద్వారా ఆదాయం, కుటుంబ సౌఖ్యం గురు, శుక్రవారాల్లో పొందగలరు. నూతన అనుబంధాలు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం పొందడం, పాత వస్తువుల స్థానంలో కొత్తవి లభించడం మీ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆత్మీయులతో కలిసి ప్రముఖ స్థలాలను, దేవాలయాలను సందర్శిస్తారు. సర్దుబాట్లు, సవరింపుల ద్వారా కొన్ని సత్ఫలితాలను పొందగలుగుతారు.

ఎస్.రవిప్రకాశ్