S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సహాయకుడు

సిబ్బంది ఆ కేబిన్‌లో వెతికితే ఎవరూ కనపడలేదు.
అరగంట క్రితం కెప్టెన్ రస్కిన్ తమ ఓడ వెళ్లాల్సిన
అక్షాంశాలు, రేఖాంశాలు రాసిన బోర్డ్ మీద స్టీర్ నార్త్ వెస్ట్ (వాయవ్యం వైపు పోనివ్వు) అనే మాటలు కనిపించాయి. అది సిబ్బందిలోని ఎవరి చేతి రాతా కాదు. వారిలో ఎవరైనా ప్రాక్టికల్ జోక్‌గా దాన్ని రాసారా
అని రస్కిన్ అడిగితే, వారంతా అది తమ పని కాదని చెప్పారు. దాంతో ఓడలోకి ఎవరో రహస్యంగా ఎక్కి ఉంటారని భావించిన రస్కిన్
ఓడంతా వెతకమని తన సిబ్బందిని కోరాడు.

1828. అట్లాంటిక్ మహాసముద్రంలోని ది వెస్ట్రిస్ అనే సరుకు రవాణా ఓడ బోస్టన్ నించి బయలుదేరింది. కెప్టెన్ రస్కిన్‌తో పాటు ఈసారి అతని భార్య మేరీ కూడా ఆ నౌకలో ప్రయాణిస్తోంది. తమ కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న ఆమెని రస్కిన్ గాలి మార్పు కోసం వెంట తీసుకువచ్చాడు.
పదహారు రోజులు గడిచాక జ్వరంతో బాధపడుతున్న ఆమెకి ఓ రాత్రి అకస్మాత్తుగా తన కేబిన్‌లో చలి దుస్తుల్లోని ఓ ఏభై ఏళ్ల వ్యక్తి కనిపించాడు.
‘ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు?’ ఆమె అడిగింది.
అతను జవాబు చెప్పకుండా ఆమె వైపే దీర్ఘంగా చూస్తూండటంతో ఆమెకి భయం వేసి గంట తాడు లాగింది. కొద్ది క్షణాల్లో స్టీరింగ్ గది నించి రస్కిన్, అతని సహాయకుడు ఆమెకి ఏమైనా ప్రమాదం జరిగి ఉండచ్చని హడావిడిగా వచ్చారు.
‘ఏమిటి? ఏమైంది?’ రస్కిన్ అడిగాడు.
‘నాకు ఇక్కడ ఓ మనిషి కనిపించాడు’ ఆమె భయంగా చెప్పింది.
‘మన నౌకలోని తొమ్మిది మందీ నీకు తెలుసు. వారిలో ఎవరు?’ రస్కిన్ అడిగాడు.
‘వాళ్లు కాదు. కొత్త వ్యక్తి’
‘అసాధ్యం. సిబ్బంది తప్ప నౌకలో కొత్త వ్యక్తి ఎవరూ లేరు’
‘కాని నేను అతన్ని స్పష్టంగా చూశాను’
వెంటనే సిబ్బంది ఆ కేబిన్‌లో వెతికితే ఎవరూ కనపడలేదు. అరగంట క్రితం కెప్టెన్ రస్కిన్ తమ ఓడ వెళ్లాల్సిన అక్షాంశాలు, రేఖాంశాలు రాసిన బోర్డ్ మీద స్టీర్ నార్త్ వెస్ట్ (వాయవ్యం వైపు పోనివ్వు) అనే మాటలు కనిపించాయి. అది సిబ్బందిలోని ఎవరి చేతి రాతా కాదు. వారిలో ఎవరైనా ప్రాక్టికల్ జోక్‌గా దాన్ని రాసారా అని రస్కిన్ అడిగితే, వారంతా అది తమ పని కాదని చెప్పారు. దాంతో ఓడలోకి ఎవరో రహస్యంగా ఎక్కి ఉంటారని భావించిన రస్కిన్ ఓడంతా వెతకమని తన సిబ్బందిని కోరాడు. కాని వారికి ఎక్కడా ఏ వ్యక్తీ కనపడలేదు.
మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి మేరీకి జ్వరం ఎక్కువైంది. ఆమె ఓడని వాయవ్యం వైపు పోనించారా అని భర్తని అడిగింది. లేదంటే, గత రాత్రి మళ్లీ ఆ వ్యక్తి కనిపించి ఓడని అటువైపు మళ్లించమని పదేపదే కోరాడని చెప్పింది. ఆమె కలగని ఉంటుందని, నిద్రలో బోర్డ్ మీద తన భార్యే ఆ పదాలని రాసి ఉంటుందని రస్కిన్ అనుమానపడ్డాడు. ఆమె చెప్పింది నమ్మలేదు. అది కల కాదని, అతను నిజంగా కనిపించాడని ఆమె పదేపదే చెప్పినా అతను నమ్మలేదు.
‘నా భార్య ఓడని వాయవ్యం వైపు మళ్లించమంటే కల కన్నదని నేను అటు పోనిస్తే, దీని యజమానికి నేను ఏం వివరణ ఇవ్వాలి?’ అతను ప్రశ్నించాడు.
‘మనం వెళ్లే వైపు వెళ్తే మాత్రం తప్పకుండా ప్రమాదంలో చిక్కుకుంటాం. అతను చెప్పింది వినకపోతే మనమంతా ప్రాణాలే పోగొట్టుకోవచ్చు’ ఆమె నమ్మకంగా చెప్పింది.
ఆ ఓడలో డాక్టర్ లేకపోవడంతో ఆమె మానసిక స్థితిని కనుక్కునే వారు ఎవరూ లేకపోయారు.
అతను డెక్ మీదకి వచ్చి చూస్తే ఆకాశం నిర్మలంగా ఉంది. తుఫాను వచ్చే సూచనలు ఏం లేవు. కొద్దిసేపటికి అతని సహాయకుడు వచ్చి చెప్పాడు.
‘గాలి ఆగ్నేయం వైపు వీస్తోంది. పొగ మంచు కూడా అటు వైపు అలుముకుంటోంది. కాబట్టి మన ఓడని వాయవ్యం వైపు పోనిస్తే మంచిది’
‘సరే. ఇంక మనం చేసేది ఏం ఉంది?’ రస్కిన్ ఒప్పుకున్నాడు.
ఇది గమనించిన సిబ్బంది అతని భార్య చెప్పినట్లు పోనిస్తున్నందుకు రస్కిన్‌ని నిందించారు. కొద్ది దూరం వెళ్లాక టెలిస్కోప్ లోంచి చూసిన ఒకరు కెప్టెన్‌ని దాన్ని ఇచ్చి చూడమన్నారు. చూస్తే దూరంగా మునిగిపోతున్న ఓ ఓడ. అందులోంచి చేతులు ఊపే ఒకతను కనిపించారు. తమ ఓడని రస్కిన్ ఆ ఓడ దగ్గరికి పోనించి అందులోని నలుగుర్ని రక్షించారు. తమ ఓడ సముద్రంలోని ఓ మంచు శిలని తాకి పాడైందని, వారం రోజుల నించి తాము అందులో గడుపుతున్నామని వారిలోని ఒకరు చెప్పారు. ఆ నలుగురిలో ఒకరు డాక్టర్. అతను తన మెడికల్ చెస్ట్‌ని కూడా తీసుకువచ్చాడు.
ఆ సంగతి తెలిసి రస్కిన్ డాక్టర్‌ని మేరీ దగ్గరకి తీసుకువచ్చారు. ఆమె కళ్లు తెరచి అతన్ని చూడగానే ‘నాకు తెలుసు మీరు వస్తారని’ అని చెప్పింది. తర్వాత తన భర్తని అడిగింది.
‘ఇతనే నాకు కనిపించిన వ్యక్తి. నేను చెప్పింది ఇప్పుడైనా మీరు నమ్ముతారా?’
‘మీరు ఈ ఓడ మీదకి ఇటీవల వచ్చారా?’ అతను అడిగాడు.
‘లేదు’ డాక్టర్ జవాబు చెప్పాడు.
రస్కిన్ వెంటనే ఆ డాక్టర్‌కి బోర్డ్, చాక్‌పీస్ ఇచ్చి, దాని మీద ‘స్టీర్ నార్త్ వెస్ట్’ అని రాయమని కోరాడు. అతను రాసాక రస్కిన్ చెప్పాడు.
‘డాక్టర్. నాలుగు రోజుల క్రితం మేరీకి జ్వరం వచ్చింది. తన గదిలో మిమ్మల్ని చూసానని చెప్పింది. నిన్న రాత్రి ఈ బోర్డ్ మీద ఒకరు ఈ మాటలు రాసారు. వెనక్కి తిప్పి ఆ చేతిరాతని చూడండి’
డాక్టర్ చూస్తే అచ్చం అది తన చేతి రాతే!
ఆ ఓడలో ప్రయాణించిన అమెరికన్ కాంగ్రెస్‌మేన్, రచయిత, అమెరికా రాయబారిగా వివిధ దేశాల్లో పనిచేసిన రాబర్ట్ డేల్ ఓవెన్ దీని గురించి రాసాడు.
ప్రపంచంలో జరిగే కొన్ని విచిత్ర సంఘటనలకి తార్కికమైన వివరణ దొరకదు. ఆమెకి ఆ ప్రమాదంలో చిక్కుకున్న డాక్టర్ ఎలా కనిపించాడు. తను చిక్కుకున్న ఓడ వైపు రమ్మని తనకి తెలీకుండానే ఎలా చెప్పగలిగాడు? డాక్టర్ సమయానికి రాకపోతే చికిత్స అందక మేరీ మరణించేది. ఓడ వాయవ్యం వైపు వెళ్లకపోతే డాక్టర్ మిగిలిన ముగ్గురు సిబ్బంది కూడా మరణించేవారు. ఇది ఎలా సాధ్యమైందో బహుశ వందేళ్ల తర్వాత ఎవరైనా తెలుసుకోగలరేమో? ప్రస్తుతానికి వీటికి జవాబులు దేవుడికే తెలియాలి.