S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దీపికా హవా!

బాలీవుడ్‌లోనే కాదు, హాలీవుడ్‌లోనూ ఇప్పుడు దీపికా పదుకొనే హవా కొనసాగుతూనే వుంది. నటిస్తున్న చిత్రాలతోపాటు చేస్తున్న పాత్రలు కూడా భిన్నంగానే వుంటున్నాయి. అంతేకాదు, హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టీన్ ఛాయిస్ పురస్కారం కోసం నామినేషన్ కూడా దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది. ప్రముఖ హాలీవుడ్ నటిమణి గల్ గడొట్‌తో ఈ పురస్కారం కోసం పోటీ పడబోతోంది. దీపిక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘ట్రిఫ్లెక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ కొద్ది నెలల కిందట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఏజెంట్ సెరెనా ఉంగర్ పాత్రలో కళ్లు చెదిరిపోయే పోరాటాలు చేసింది. ఇప్పుడు ఆ పాత్రకుగాను యాక్షన్ చిత్ర నటి విభాగంలో టీన్ ఛాయిస్ నామినేషన్ దక్కించుకుంది దీపిక. ఈ అత్యంత పురస్కారం కోసం ‘వండర్ ఉమన్’లో నటించిన గల్ గడొట్‌తో పోటీని ఎదుర్కొంటుంది. ఈ పురస్కారం కోసం వీరి మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఈ పురస్కారం కోసం నామినేషన్ దక్కించుకోవడం ఎలా ఫీలవుతున్నారు? అని దీపికను మీడియా కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వుంది. బాలీవుడ్‌లో ఎలాగైతే పేరు తెచ్చుకున్నానో హాలీవుడ్‌లో కూడా అలాంటి పేరే తెచ్చుకోవాలనుకుంటున్నా. అలా తెచ్చుకున్నప్పుడే బాలీవుడ్ ఫవర్ హాలీవుడ్‌లోనూ తెలుస్తుంది. ‘ట్రిఫ్లెక్స్’లో హీరోగా నటించిన విన్ డీసిల్‌తో పాటు నినా డొబ్రెవ్, రూబీరోస్ తదితరులు కూడా ఈ పురస్కారం కోసం నామినేషన్ దక్కించుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది. ‘ట్రిఫ్లెక్స్’ సీరిస్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలోనూ నటించే అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవలే విన్ డీసిల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ ప్రత్యేక ఇమేజ్‌ను సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్.. దీపికా!!

-సమీర్