S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాహ్..కీర్తి!

...అంటున్నారంతా టాలీవుడ్‌లో కీర్తి సురేష్ చేస్తున్న చిత్రాలు.. పోషిస్తున్న పాత్రల గురించి. పరిశ్రమలోకి వచ్చిరావడంతోనే తన ఖాతాలో మంచి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. పాత్రలో విలీనమై హావ భావాలను వ్యక్తం చేయడంలో తనకు తానేసాటి అనిపించుకునేలా చేసింది. రెండు సినిమాలతోనే ఇంతటి క్రేజ్ సంపాదించుకోవడం మాటలు కాదు, చేతలు కావాలి. ఆ చేతలే కీర్తి సురేష్‌లో మెండుగా వున్నాయంటున్నారు చిత్ర ప్రముఖులు. తాజాగా కీర్తి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రంలో నటిస్తోంది. సావిత్రి నిజ జీవిత పాత్రను పోషించడమంటే ఓ సవాల్ లాంటిదే. ఆ సవాల్‌ని స్వీకరించి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో అడుగులు కదుపుతోంది. ఈ చిత్రంలోని పాత్ర గురించి కీర్తి చెబుతూ- ‘‘మహానటి పాత్ర పోషించే అవకాశం రావడం నా అదృష్టం. ఇంత త్వరగా ఇలాంటి అవకాశం వస్తుందనుకోలేదు. తెరపై సావిత్రిలాగే కనిపించి ప్రేక్షకుల మనసులను దోచుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాను’’ అంది ఎంతో పట్టుదలతో.

-సమీర్