S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆనందోబ్రహ్మ!

తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ తాప్సీ గ్లామర్ హీరోయిన్‌గా క్రేజ్‌ని సంపాదించుకుంది. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు లభించిన అవకాశాలను ఎంపిక చేసుకోవడంలో ఆచి తూచి అడుగులు వేసింది. గ్లామర్ వుండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే తాప్సీ ఆశించినట్లుగా ఆమెకు టాలీవుడ్‌లో కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయే పాత్రలేవీ దరిచేరలేదు. అయినా ఆమెలో ఆశ చావలేదు. తన అడుగులు కెరీర్‌వైపే పరుగులు తీశాయి. మంచి చిత్రాలు.. అంతకంటే మంచి పాత్రల కోసం ఆమె ఆరాటం, తపన ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా నటించిన ‘ఆనందో బ్రహ్మ’ మంచి అనుభూతినే మిగిల్చిందట తాప్సీకి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో హారర్ కామెడీ నేపథ్యంలో కొత్తగా అనిపించే రీతిలో ఈ చిత్రం తెరకెక్కిందట. మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడితే ఎలా వుంటుందన్న వింత ఆలోచనకు తెరరూపం ఈ ‘ఆనందోబ్రహ్మ’. ఈ చిత్రం గురించి తాప్సీని కదిలిస్తే- ‘‘కెరీర్‌లో నచ్చే పాత్రల కోసం ఎవ్వరికైనా ఎదురుచూపులు తప్పవు. అరుదుగా వచ్చే ఇలాంటి క్యారెక్టర్స్ కోసం నిరీక్షణ తప్పదు. ప్రతిభకు తోడు అదృష్టమూ కలిసిరావాలి. అలా కలిసి వచ్చినప్పుడే మన కెరీర్‌లో సంతృప్తి లభిస్తుంది. ఆనందోబ్రహ్మ చిత్రంలో నాకు నచ్చే పాత్ర లభించింది. ఆ పాత్రలో నేను ఒదిగిపోయాను. ఈ చిత్రంలోని క్యారెక్టర్ నాకు తెలుగులో మరింత మంచి పేరుని తెచ్చిపెడుతుందన్న నమ్మకం వుంది’’ అని చెప్పుకొచ్చింది, దటీజ్..తాప్సీ!!

-సమీర్