S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇళ్లలో తిండి... విషాలు (మీకు మీరే డాక్టర్)

ఫ్రశ్న: ఆహార కల్తీలకు విరుగుడు మందు ఏమైనా చెప్తారా?
-కింగ్ జార్జి, సికిందరాబాద్
జ: ఆహారంలో రుచికే తప్ప నాణ్యతకు ప్రాముఖ్యం ఇవ్వలేని బలహీనత మనలో ఉండటమే కల్తీదారులకు లోకువ. ఆహారంలో తక్కువ నాణ్యత కలిగిన వాటిని కలపటం, రంగు, రుచి, వాసనల కోసమూ, నిల్వ చేయటం కోసమూ విష రసాయనాలను వాడటం, ప్రమాదకరమైన రీతిలో వండటాన్ని ‘ఆహార కల్తీ’ అంటారు.
హానికర ద్రవ్యాలు కలపకుండా నాణ్యంగా సురక్షితంగా వండిన వంటకాన్ని ‘ఆహారం’ అని నిర్వచిస్తే ఇందుకు వ్యతిరేకమైన దాన్ని ‘కల్తీ ఆహారంగా’ భావించటానికి వీలౌతుంది. మనం స్వచ్ఛ ఆహారానే్న తింటున్నామా?
లాభాపేక్షతో వ్యాపారులు ఆహార కల్తీకి పాల్పడటం, ప్రభుత్వానికి వాళ్ల మీద అదుపు లేకపోవటం, ప్రభుత్వాలు స్వచ్ఛ ఆహార విధానాన్ని ప్రకటించక పోవడం, ప్రపంచీకరణ ప్రభావాన మారిన పరిస్థితుల్లో పాతబడిన చట్టాల స్థానే, పదునైన చట్టాల గురించిన ఆలోచనే లేకపోవటం లాంటి స్థానిక, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ‘మన కర్మ’ సిద్ధాంతానికి సంబంధించినవి కాబట్టి వాటిని అలా ఉంచుదాం.
ఘాటులేని లవంగాలు, రుచీపచీ లేని యాలకుల్లాంటి నాణ్యత లేని పచారీ దినుసులు, నూనేనా లేక ఏదైనా ద్రవ పదార్థమా అనిపించే నూనె పాకెట్లు, భయంకర విష పదార్థం అనదగిన నెయ్యి అలాగే, రంగులు కలిపిన పసుపు, కారాలు, పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు, ఆకుకూరలు ఇలా చుట్టూ విషాల్ని పేర్చుకుని ఆహార నిర్వచనాల గురించి ఆలోచించటం వలన ఉపయోగం ఏముంటుందీ? ఇవన్నీ తప్పనిసరి విషాలు. మనకుగా మనం వాటిని వాటికి సాధ్యమైనంత మేర దూరంగా ఉండగలగాలి.
రంగు, రుచి, సువాసనల కోసం అమాయకంగా విషాహారాల్ని మనకుగా మనమే వండుకుంటున్న వైనాన్ని ప్రముఖంగా చర్చించాల్సిన సమయం ఇది. ఆహార విషాలకు ఒక విరుగుడు మందు అడిగారు. రోగాన్ని తగ్గించుకోవటానికి డబ్బు ఖర్చయ్యింది అంటే, డబ్బుతో ఆరోగ్యాన్ని కొన్నట్టు కాదు. డబ్బు వదిలితే గానీ తెచ్చుకున్న జబ్బు వదలదని అర్థం.
శరీర తత్వానికి సరిపడే వాటిని తిన్నప్పుడు అవి సమస్థితిని కలిగిస్తాయి. వేడి శరీర తత్వం ఉన్నవారు వేడి చేసేవి ఎక్కువగా తింటే శరీరంలో అనేక వేడి లక్షణాలు పుట్టి ఇబ్బంది కలిగిస్తాయి. బాధని కలిగించేది ఏదైనా అది విషంతో సమానమే! మనం ఎంతో కమ్మగా వండుకుని ఇష్టంగా తింటున్న వంటకాల్లో ‘ఇది మనుషులు తినేందుకు కాదు’ అని లేబులు అంటించాల్సినవి కూడా ఉంటున్నాయి. వాటిని గమనించకపోతే, కేన్సర్, సొరియాసిస్, బొల్లి, ఎలర్జీ వ్యాధులు అకారణంగా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. వాటి మీద మనకు అవగాహన ఉండాలి.
బ్రాండ్ల పేర్లనీ, వాణిజ్య ప్రకటనల్నీ నమ్మి కల్తీలకు బలి కాకూడదు. పసుపు, కారం, బియ్యప్పిండి, జొన్నపిండి, శనగపిండి ఇలాంటి వాటిని దగ్గరుండి మర పట్టించుకోవటం ఉత్తమం. ఏ నూనె మంచిదని అడగటం కన్నా నూనె వాడకాన్ని నాలుగో వంతుకు తగ్గించటమే మేలు! కల్తీల బారి నుండి చాలా వరకూ బయట పడగలుగుతాం.
స్వీటు షాపులకు వెళ్లినప్పుడు ఆకుపచ్చ రంగు కారప్పూస, నీలం రంగు బూంది, ఇంకా రంగురంగుల స్వీటూ హాట్లను రంగుని చూసి మోసపోయి కొనకండి. రంగు వెయ్యనివి మా షాపులో లేవని చెప్తే కొనటం మానేయండి. ఇంట్లో కూడా వంటకాలలో రంగు చేర్చే అలవాటుంటే మానుకోండి.
వండే విధానం ద్వారా ఆహారాన్ని విషతుల్యం చేసుకోవటం ఆపగలిగితే, శరీరం ఇలాంటి తప్పనిసరి విషాలను కొంత తట్టుకోగలుగుతుంది. విషాలను తెచ్చుకుని, విషపూరితంగా వండుకు తినే పద్ధతిని మనం మానగలగాలి. బజార్లో దొరికే పొట్లాల్లో ఆహార పదార్థాలను గడువు తీరాక కూడా తింటే అది విషాహారమే అవుతుంది.
పోషక విలువలు తక్కువగా వుండే పిజ్జాలు, ఫ్రెంచి ఫ్రైల్లాంటివీ, జంక్ ఫుడ్స్ ఇవన్నీ విషపూరితాలే! ఇవి మేలుచేయవు. ఆకలి తీర్చవు. పైగా ఆకలిని చంపుతాయి. కాసేపు భోజనం ఆలస్యం అయితే ఓ కప్పు కాఫీనో టీనో తాగామనుకోండి.. కాఫీ టీలు ఆకలి తీర్చాయా? లేదు. ఆకలిని అణచాయి లేదా చంపాయి. ఆకలిని చంపే వాటిని తీసుకుంటే అవి కడుపులో విషాలను వ్యాపింపజేస్తాయి.
జ్యీశ ఛ్య్యిజూ ష్యౄఇజశ్ఘఆజ్యశ విరుద్ధ ఆహార పదార్థాలను కలిపి తినటం వలన అవి విషాహారాలౌతాయి. పెరుగన్నం తిని ఐస్‌క్రీం (పాలతో తయారౌతుంది కాబట్టి) తినటం, సాంబారిడ్లీ తిని కాఫీ టీలు తాగడం ఇలా ఒకదానితో ఒకటి విరుద్ధంగా ఉండే వాటిని కలిపి తినటం మంచిది కాదు.
గరిటెల కొద్దీ నెయ్యి, నూనె, వనస్పతి పోసుకుని తినటం అవి కల్తీలేనివైనా మంచిది కాదు. వేపుడు పదార్థాలను పరిమితంగా ఎప్పుడో ఒకసారి తప్ప, అదే పనిగా తింటే అది విషతుల్యం అవుతుంది. జీర్ణశక్తి మందంగా ఉండేవారికి, ఏది తిన్నా అజీర్తి, గ్యాసు పుడుతున్న వారికీ కఠినంగా అరిగే బిరియానీ, పలావు, పులిహోర, గోంగూర లాంటివి విషాహారాలే అవుతాయి.
వండిన పదార్థాలు పాచిపోయినప్పుడు, ఎలాగోలా వాటిని చెల్లబెట్టాలనుకుంటే అది విషాహారమే అవుతుంది. చల్చారిపోయిందని తిరిగి వండితే అదీ విషమే అవుతుంది. ఫ్రిజ్ చల్లదనం పోయేలా గోరువెచ్చనయ్యే వరకు వేడి చేయటం తప్పు కాదు. కానీ తిరిగి వండటం మంచిది కాదు.
ఇవన్నీ సాధారణ విషయాలు. మనం కొంచెం శ్రద్ధ వహిస్తే వీటిని తప్పించవచ్చు.

*

సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com