S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలివి

రమణమ్మకి శుచి శుభ్రం పాటించటం అలవాటు. తనలాగే అందరూ ఉండాలనుకోవటం ఆమె మనఃస్వభావం. అందుకు విరుద్ధంగా ఎవరైనా ఉన్నా, ప్రవర్తించినా తట్టుకోలేదు ఆమె.
ఆమెకి వొంట్లో బాగోకపోవటంతో వంట మనిషిని పెట్టుకోవాలనుకుంది. ఎంత మందో మారారు ఆమె సూటిపోటి మాటలు పడలేక. అప్పయ్య శాస్ర్తీ వచ్చిన తరువాత ఇక వంట మనిషి గురించి వెతికే అవసరమే కలగలేదు రమణమ్మ భర్త రామయ్యకి.
ఎప్పటి నుండో రామయ్యకి ఒక విషయం గురించి అప్పయ్య శాస్ర్తీని అడగాలని అనుకునేవాడు కానీ వీలు చిక్కలేదు.
అందుకు కారణం అప్పయ్య శాస్ర్తీకి చెముడు ఓ మాదిరిగా ఎక్కువే.
ఏదేని అడగాలంటే గట్టిగా అరిచినట్లు పెద్దగా చెప్పాలి. అలా అయితే ఆ విషయం ఎక్కడ భార్యకు తెలుస్తుందోనన్న భయం.
ఒకనాడు రమణమ్మ వాళ్ల అక్క ఇంటికి వెళ్లింది. ఇదే అవకాశమనుకుని అప్పయ్య శాస్ర్తీని అడిగారు ‘ఏమిటీ ప్రతి పనిలో నిన్ను తెగ పొగుడుతోంది మా ఆవిడ. ఏం మంత్రం వేశావు? నీకేమైనా మంత్రాలొచ్చా’ అని.
అందుకు అప్పయ్యశాస్ర్తీ ‘అయ్యా మంత్రం లేదు. తంత్రం లేదు. ఆమెకు శుచీ శుభ్రం పాటించటం ఎక్కువ. మీకు చిన్న కిటుకు చెబుతాను కోప్పడనంటే’
‘చెప్పు’
‘వినండి. కొత్తల్లో కొరలు తరిగేటప్పుడు పుచ్చులు చచ్చులు లేకపోతే మొత్తం కూర తరిగేవాడిని. కూర తుక్కు చూసి కస్సుమనేవారు. నీవు పుచ్చులు సచ్చులు చూడకుండా తరుగుతున్నావు’ అని. అస్సలు పుచ్చులూ అటువంటివి ఏమీ లేవమ్మా. చూసే తరిగాను అన్నా వినకుండా క్లాసు పీకేవారు. ఆమె అనుమానం ఎక్కువగా వంకాయలు, చిక్కుడు కాయలు, బెండకాయలు, తరిగేటప్పుడు మరీ విపరీతంగా ఉండేది. అప్పుడు అనుకున్నా. కూర తుక్కులో ఏ పది బాగున్నా ముక్కులు వేసి వాటికి కొద్దిగా గినె్న మసి పూసేవాడిని. అవి చూసి ఆ ఈ రోజు చక్కగా కళ్లు పెట్టి తరిగావు. ఇలాగే రోజూ తరుగు’ అని మెచ్చుకున్నారు. అప్పుడు అనుకున్నా. నాకు నచ్చినట్లు కాదు. ఇష్టం లేకపోయినా ఆమెకు నచ్చినట్లు ప్రవర్తిస్తే వచ్చే లాభాలే ఎక్కువ అని. మరల మరల పని కోసం వెతికే బాధ నాకు ఉండదని. పైగా పని నచ్చితే జీతం కోరినంత పొందవచ్చు అని’.
‘ఓరి నీ బండబడ. నీకు చదువు లేకపోయినా అపార బతుకు తెలివి ఉందిరా’ అని అప్పయ్య శాస్ర్తీని మెచ్చుకున్నాడు రామయ్య.

-చామర్తి వెంకట రామకృష్ణ