టెక్నిక్ బేబీ!
Published Saturday, 22 July 2017టాలీవుడ్లో రామ్‌చరణ్ చిత్రం ‘చిరుత’లో తళక్కున మెరిసిన అమ్మడు నేహాశర్మ గుర్తుందిగా. అవునులే.. అప్పుడే ఎలా మరిచిపోతాం. ఆ చిత్రంలో ఈ అమ్మడి హొయలు.. చిందించిన గ్లామర్‌ని యువతరం ఎలా మరిచిపోతుంది? తెలుగులో తొలి చిత్రమే అత్యంత ప్రతిష్టాత్మకం.. కానీ, ఏం లాభం? తొలి చిత్రం తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అంతే టాలీవుడ్లో రెండో సినిమా చేశాక, తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో ఒకటీ అరా చిత్రాలు చేసిన ఈ బ్యూటీకి అక్కడా వర్కవుట్ కాకపోవడంతో నిరాశ చెందింది. దాంతో కెరీర్లో డీలా పడిపోయింది. తాజాగా నేహా చేస్తున్నదేమిటి? అనేగా మీ డౌటు? సినిమాల సంగతేమోగానీ, చెల్లెలితో కలిసి ఎంచక్కా జిమ్‌లో వర్కవుట్ చేసేస్తోంది. అందాల భామలు తమ అందాలకు మెరుగులు దిద్దుకోవడం, ఫిట్నెస్ కోసం సమయాన్ని కేటాయించడం మామూలే. అయితే శర్మ సిస్టర్స్ ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివేశారు. వెరైటీ టెక్నిక్స్ ఫిట్‌నెస్‌లో కనిపెట్టడం, వాటిని చేసి చూపించడం అలవాటుగా పెట్టేసుకున్నారు. అటు నేహాశర్మ, ఇటు ఆమె చెల్లెలు ఐషా శర్మ. ఇద్దరూ సొషల్ మీడియాలో జిమ్ వర్కవుట్స్ వీడియోల్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ కావలసినంత హాట్ అప్పీల్ అయితే పంచుతున్నారు. అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారంతా. ఎవ్వరేమనుకున్నా తమ పద్ధతి మార్చుకోలేం అంటూనే ఇద్దరూ సినిమాల అవకాశాల కోసం ఈ విధమైన టెక్నిక్‌లు చేస్తున్నారని వాళ్ల సన్నిహితులే చెబుతున్నారు అదీ..సంగతీ!