S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వాహ్..రకుల్!

టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ అంటే..యువతరం ప్రేక్షకుల్లో హాట్ హాటే! చేస్తున్న చిత్రాలు.. పోషిస్తున్న పాత్రలు వేటికవే భిన్నంగా వుంటూనే గ్లామర్‌ని మిస్సవకుండా అవసరమైన చోటల్లా తన సత్తాను చాటుతూనే వుంది. అందుకే అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది కాబట్టే దర్శక, నిర్మాతలతో పాటు కథానాయకులూ తమ చిత్రాల్లో రకుల్‌కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి క్రేజీ ప్రాజెక్కుల్లోనూ చోటు దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, స్టార్ హీరో విజయ్ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మురుగుదాస్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ‘స్పైడర్’ రూపొందిస్తుండగా.. విజయ్ తన ‘మెర్సల్’తో బిజీగా వున్నారు. వీరిద్దరూ చేస్తున్న చిత్రాలు పూర్తి కాగానే మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే విజయ్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే దానిపై మురుగదాస్ ఓ నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ‘స్పైడర్’లో నటిస్తున్న రకుల్‌ప్రీత్‌తో తన తదుపరి ప్రాజెక్టు గురించి చర్చించారని తెలిసింది. దీంతో విజయ్‌కీ జోడీగా రకుల్ ఛాన్స్ కొట్టేసినట్టేనని అంటున్నారంతా. టాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ విజయాల బాటలో రివ్వున దూసుకెళుతున్న ఈ సుందరాంగి ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ‘స్పైడర్’ విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ ‘మెర్సల్’ దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా మంచి మంచి అవకాశాలు రకుల్ చేజిక్కించుకుంటోంది. తెలుగు, తమిళం అంటున్నారు.. రెండు పడవల ప్రయాణం కష్టంగాలేదా? అని రకుల్‌ని కదిలిస్తే- ‘‘ప్రస్తుతం అయితే కష్టంగా ఏం లేదు. తమిళంలో మరింత బిజీగా మారితే తప్పదేమో కష్టం. అక్కడా మంచి అవకాశాలు వస్తున్నాయి. రెండు భాషల్లోనూ నేనేంటో నిరూపించుకోవాలన్నదే నా తపన. టాలీవుడ్ ఆదరించినట్టే, కోలీవుడ్ కూడా నన్ను అంతగానే ఆదరిస్తుందన్న నమ్మకం నాకుంది’’అంటూ చెప్పుకొచ్చింది. అదీ..సంగతీ! వాహ్..రకుల్!!