సోలార్ పాండా
Published Thursday, 10 August 2017చైనాలోని ‘దతాంగ్’లో 1500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సోలార్ పవర్ ప్లాంట్‌లోని సోలార్ ప్లేట్స్‌ను ఇలా పాండా రూపం వచ్చేలా ఏర్పాటు చేశారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్ కింద చైనాకు చెందిన పాండా గ్రీన్ ఎనర్జీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. వేలాది సోలాన్ ప్యానల్స్‌ను ఇలా పాండా రూపం వచ్చేలా పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా వంద పాండా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యమని ఆ సంస్థ సిఇఒ లి యువాన్ అంటున్నారు. ప్రస్తుతం దతాంగ్ ప్రాజెక్టు తొలిదశ పూర్తయింది. దీనివల్ల ఏటా 2.75 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల విడుదల దీనివల్ల తగ్గుతుందన్నది అంచనా.