S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్చ్.. రెజీనా!

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతూనే చక్కటి చిత్రాల్లో సహజ నటన కనబరిచి ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టింది బ్యూటీ రెజీనా. అదే ఊపులో ఏడాదికి మూడు, నాలుగు చిత్రాల్లో మెరిసింది. యువతరం కథానాయికలతో జోడీ కట్టి కెరీర్‌లో దూసుకెళ్లింది. అయితే ఈ భామ ఇప్పుడు కాస్త నెమ్మదించింది. రెజీనా నటించిన తాజా చిత్రం ‘నక్షత్రం’ బాక్సాఫీస్ వద్ద చతికిలబడి ఆమెను మరింత కుంగదీసింది. ఈ చిత్రం పరాజయం ఈ భామ కెరీర్‌పై ప్రభావం చూపిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ‘నక్షత్రం’పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఎంతగానో ఆశించింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టించండంతో ఆమె ఆశలు నీరుగారిపోయాయి. అంతేకాకుండా, ఈ ఏడు కేరళ నుంచి కొత్త అమ్మాయిల రాక.. నవతరం తారలపై ప్రేక్షకుల చూపు, పరిశ్రమ ప్రోత్సాహం వుండడంతో వారికే అవకాశాలు వస్తున్నాయి. దాంతో రెజీనా కెరీర్ సందిగ్ధంలో పడిందంటున్నారు. మళ్లీ ఊపు వస్తుందో..లేదో చూడాల్సిందే అంటున్నారు.

-సమీర్