S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆటు పోట్లు!

అందాల భామ హన్సిక కెరీర్‌లో ముందు నుంచి ఆటుపోట్లు తప్పడం లేదట. ఆమె కెరీర్ అంతా అయోమయంలోనే కొనసాగుతూనే వుంది. ఎన్నో ఆశలతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఇక్కడ కాలం కలిసిరాలేదు. తెలుగు పరిశ్రమలో ఇక ఇంతే కెరీర్ అనుకున్న సమయంలో కోలీవుడ్ పిలుపునందుకుంది. అక్కడ అడుగుపెడుతూనే విజయపథంలో దూసుకెళ్లింది. అవకాశాల మీద అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఒక దశలో టాప్-5 కథానాయికల్లో ఒకరిగా నిలిచింది. అయితే అదే జోరును కోనసాగించలేకపోయింది. టాలీవుడ్‌లోనూ ఇదే స్థితి. ‘గౌతమ్‌నంద’తో కెరీర్ గాడిలో పడుతుందని ఆశించింది. కానీ ఆ చిత్రమూ నిరాశనే మిగిల్చింది. కెరీర్ ఎలా వుంది అని హన్సికను కదిలిస్తే- ‘‘ఏ నటికైనా ఆటుపోట్లు తప్పవు. నా కెరీర్‌లోనూ ఇదే జరుగుతోంది. విజయాలు చూశాను.. అపజయాలు చూశాను.. అయినా బెదరలేదు. అనుకున్న లక్ష్యాలను చేరాలంటే ఇవన్నీ తప్పవు. నా కెరీర్ నాకు ఇప్పుడు సంతృప్తిగానే వుంది. మంచి బ్యానర్లలో సినిమాలు అంగీకరించాను. రాబోయే చిత్రాలు నాకు మరింత మంచి పేరును తెచ్చిపెడతాయి’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ తమిళమా? తెలుగా? ఎక్కడ సెటిలవ్వాలనుకుంటన్నారంటే మాత్రం నోరు మెదపకుండా తప్పించుకుంది. అదీ..సంగతీ!!

-సమీర్