S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక తిరుగులేదు!

అంటున్నారు సొగసరి లావణ్య త్రిపాఠిని చూసినవారంతా. ఎందుకలా అంటున్నారు? అనే కదా మీ డౌటు! అక్కడికే వద్దాం.. స్లో అండ్ స్టడీగా గుట్టు చప్పుడు కాకుండా కెరీర్‌లో పరుగులు పెడుతున్న ఈ సుందరాంగికి టాలీవుడ్ ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. అగ్ర హీరోలే కాదు, నవతరం కథానాయకులతో కూడా జోడీ కడుతూ తన ప్రతిభను చాటుకునే దిశగా చూపు మరల్చింది. అందులో భాగంగానే తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దర్శక, నిర్మాతలు కూడా తమ చిత్రాల్లో లావణ్య త్రిపాఠిని నటింపజేసేందుకు ఆసక్తి కనబరుస్తుండడంతో ఆమె కెరీర్ మంచి ఊపుమీదుంది. తాజాగా సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు వి.వి వినాయక్ తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఈ భామనే కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇందులో లావణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడంతో ఆమె కెరీర్‌లో ఇది ఒక మైలురాయిలా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ చిత్రంతో పాటు మరో మూడు చిత్రాలకు కూడా లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుకే ఈ అమ్మడి కెరీర్‌కు ఇక తిరుగే ఉండదంటున్నారు. వాహ్..లావణ్య ఆల్ ది బెస్ట్!!

-సమీర్