S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనుషులమే..!

ఒక్క కన్నీటి చుక్క వెనక..
ఎంత సముద్ర ఘోష ఉందో
ఎంత లోతైన అగాధముందో
ఎన్ని సుడిగుండాలున్నాయో
ఎన్ని అలజడులున్నాయో!

ఒక్క ఆనందబాష్పం వెనక..
ఎంత సంతోష సాగరముందో
ఎంత ఎతె్తైన ఆనందముందో
ఎన్ని రాగాల సంగీతముందో
ఎన్ని కలల అలలున్నాయో!

బాధలు దాచితే
బంధాలు గట్టిపడునేమో!
ఆనందాలు పంచితే
అనుబంధాలు ఉట్టిపడునేమో!

సంపద పెరిగితే ఎగిరిపోతాడు
ఉన్నది తరిగితే ఉలిక్కిపడతాడు!
మంచికి మించిన సంపద లేదు
బంధాలకు మించిన బంధుత్వం లేదు!

మనిషికి మనిషే శత్రువు
మనిషికి మనిషే ఆప్తుడు!
బతికినా కలిసుండేది మనిషే
చచ్చినా గుర్తుంచుకునేది మనిషే!

అన్నిటికీ కారణం మనుషులే
అన్నిటికీ మూలం మనుషులే!
తోడై మెలగాలి నీడై నిలవాలి
ఒకరికొకరై కలిసి నడవాలి!
*

-పుట్టి గిరిధర్ 9491493170