S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏవీ నా బావులు

చేద బావులు
బొక్కెనలు
చేంతాడు
నీళ్లు తోడే
పందేలు
తోడి తోడి
అలసినా మోములో
కానరాని అలసట
చేంతాడు బావిలోకి వదులుతుంటే
దరి తగలకుండా బొక్కెన లాగుతుంటే
ఆనంద పరవశమే
గోళాలు కొప్పెర్లు గంగాళాలు
కుడితి తొట్లు ఎన్నైనా
ఇట్టే నిండిపోయేవి
వానకాలమైతే
చేతికందే నీళ్లు
చెర్లు నిండితే బావుల్లో జలకళ
బావుల చెంత
బావమరదళ్ల
వదిన మరదళ్ల
పరాచికాలు
ఆ ఇంటి ఈ ఇంటి ముచ్చట్లు
కష్టసుఖాల పలకరింపులు
యథేచ్ఛగా
స్వేచ్ఛగా సాగిపోయే
బావులు పోయే
గొట్టపు బావులు వచ్చే
వేలడుగుల లోతు బావులు
వెర్రిగా జనాన్ని ఏమార్చి
నీటికి దూరం చేసిరి
నీరు కొనబట్టిరి
వనరులున్న నేలలో
వనరుల వేలంలో
మనిషి బలైపోతుండే
ఏలికల పాచికలాటలో
మనిషి గతాన్ని మరుస్తుండే
ఎదిగి వచ్చిన సమాజానే్న
తూలనాడుతుండే
భావిని ఊహించలేక
వర్తమానాన్ని భరిస్తుండే భారంగా
*

-గిరిప్రసాద్ చెలమల్లు 9493388201